2021 ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-3 బౌలర్లను ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రకటించాడు. నెం1 బౌలర్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌ను అతడు ఎంచుకున్నాడు. గత ఏడాదిలో 54 వికెట్లు పడగొట్టిన అశ్విన్ .. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక టీ20 ప్రపంచ కప్-2021తో పరిమిత ఓవర‍్ల క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన అశ్విన్ అదరగొట్టాడు.
ఇక రెండు, మూడు స్ధానాల్లో షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీని హాగ్ ఎంచుకున్నాడు. 2021 ఏడాదిలో షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ వరుసగా 47, 41 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా 2021 ఏడాదికు గాను నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ని ఎంచుకున్నాడు. కాగా ఒకే క్యాలండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. గత ఏడాదిలో రూట్ 1708 పరుగులు సాధించాడు. కాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని హాగ్ ఎంపిక చేయకపోవడం గమనర్హం.
చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా!
Comments
Please login to add a commentAdd a comment