Ravi Ashwin
-
ఏంటి చాహర్ ఇది..? అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా! వీడియో వైరల్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంకు ముందు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. అతిథ్య జట్టుకు 290 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 290 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు జింబాబ్వే ఓపెనర్లు ఇన్నోసెంట్ కైయా, కైటినో బరిలోకి దిగారు. అయితే భారత పేసర్ దీపక్ చాహర్ తొలి ఓవర్ వేసే క్రమంలో నాన్ స్ట్రైక్‌లో ఉన్న కైయాను మన్కడింగ్(రనౌట్) చేసే ప్రయత్నం చేశాడు. కాగా చాహర్ బెయిల్స్ పడగొట్టే సమయానికి.. కైయా క్రీజు నుంచి దూరంగా ఉన్నాడు. అయితే చాహర్ బెయిల్స్ పడగొట్టినప్పటికీ రనౌట్‌కు మాత్రం అప్పీల్ చేయలేదు. ఒక వేళ చాహర్ అప్పీల్ చేసి వుంటే మాత్రం కచ్చితంగా రనౌట్‌గానే అంపైర్ ప్రకటించే వాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చహర్‌ను టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పోలుస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. "ఏంటి చాహర్ ఇది.. అశ్విన్‌ను చూసి నేర్చుకున్నావా..?" అంటూ కామెంట్ చేశాడు. కాగా 2012లో శ్రీలంకపై, 2019 ఐపీఎల్ సీజన్లో జోస్ బట్లర్‌ను ఈ విధంగానే అశ్విన్ ఔట్ చేశాడు. అయితే బట్లర్‌ను మన్కడింగ్ చేసిన అశ్విన్ అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. కాగా భారత క్రికెట్ దిగ్గజం వినూ మన్కడ్ పేరు మీద ఉన్న ‘మన్కడింగ్’ ఔట్ ను సాధారణ రనౌట్ గా చేస్తూ ఈ ఏడాది మార్చిలో మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్ణయం తీసుకుంది. Deepak Chahar didn't Appeal on Mankad 😂 pic.twitter.com/4ihfnljbMl — Keshav Bhardwaj 👀 (@keshxv1999) August 22, 2022 Shades of Ashwin in Deepak Chahar. Kaia was almost Mankad had he appealed. — Gagan Thakur (@gagan_gt) August 22, 2022 చదవండి: Ind Vs Pak- Virat Kohli: పాక్‌తో మ్యాచ్‌లో ఫిఫ్టీ కొడితే ఆ నోళ్లన్నీ మూతపడతాయి! -
IPL 2022: 'అతడి కోసం వేలంలో యుద్దమే!.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే'
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. దీంట్లో 370 మంది భారత ఆటగాళ్లు, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాగా వేలానికి ముందు గరిష్టంగా కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకునే అవకాశం ఉండండంతో చాలా మంది స్టార్ ఆటగాళ్లని ఫ్రాంఛైజీలు విడిచి పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా మంది స్టార్ ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. అంతే కాకుండా మరో రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఫాఫ్ డు ప్లెసిస్‌ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డు ప్లెసిస్‌ను తిరిగి దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా డుప్లెసిస్ ఉన్నాడు. 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంఫియన్స్‌గా నిలవడంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. "గత సీజన్లో డు ప్లెసిస్‌ను 1.5 కోట్లకు సొంతం చెన్నైసూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సారి అతడి కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. సీఎస్కే ఈ సారి డు ప్లెసిస్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, గత సారి కంటే చాలా ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వేలంలో అతడికి మంచి డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. అదే విధంగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్‌కు కూడా వేలంలో భారీ ధర దక్కడం ఖాయం" అని అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా! -
అతడు వేలంలోకి వస్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్
అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో రానున్న ఐపీఎల్-2022 మెగా వేలంలో యువ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వాఖ్యలు చేశాడు. వేలంలో భారత అండర్-19 పేస్ బౌలర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ కోసం చాలా జట్లు పోటీపడతాయి అని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. హంగర్గేకర్ ఇన్స్వింగర్స్ను బాగా బౌలింగ్ చేయగలడని అశ్విన్ కొనియాడాడు. "అతడు ఇన్స్వింగర్స్ను బాగా బౌలింగ్ చేయగలడు. ప్రస్తుత భారత ఆర్మ్ పేసర్లలో ఇషాంత్ శర్మకు మాత్రమే ఉంది. ఇన్‌స్వింగర్స్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఇన్‌స్వింగర్స్ బౌలింగ్ చేసే అతడికి వేలంలో కచ్చితంగా డిమాండ్ ఉంటుందని నేను భావిస్తున్నాను" అని యూట్యాబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా హంగర్గేకర్ బ్యాట్‌తోను, బాల్‌తోను రాణించగలడు. అండర్-19 ఆసియా కప్‌ని భారత్ కైవసం చేసుకోవడంలో హంగర్గేకర్ కీలకపాత్ర పోషించాడు. చదవండి: Rashid Khan: రషీద్ ఖాన్ మంచి మనసు.. యంగ్ బౌలర్‌కి ఆర్థిక సాయం! -
అందుకే అతడిని భారత జట్టుకు ఎంపిక చేయలేదు!
దాదాపు నాలుగేళ్ల తరువాత వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతగా రాణించలేదు. దక్షిణాఫ్రికాతో రెండు వన్డేలు ఆడిన అశ్విన్ కేవలం ఒకే ఒకే వికెట్ పడగొట్టాడు. ఇది ఇలా ఉంటే.. స్వదేశంలో వెస్టిండీస్‌తో త్వరలో జరగనున్న వన్డే, టీ20 ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ఎంపిక చేసింది. అయితే బీసీసీఐ ప్రకటించిన జట్లలో అనూహ్యంగా అశ్విన్‌కి చోటు దక్కలేదు. అయితే అశ్విన్‌పై వేటు పడడానికి గల కారణాన్ని బీసీసీఐ చెప్పలేదు. అయితే ప్రకారం.. ఫిట్నెస్ సమస్యల కారణంగా అతడిని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో అశ్విన్ మణికట్టు, చీలమండకు తీవ్ర గాయాలయ్యాయని నివేదిక తెలుపుతుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్- భారత్ తొలి వన్డే జరగనుంది. అదే విధంగా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ అవేశ్ ఖాన్, ఆల్‌రౌండర్ దీపక్ హుడా భారత జట్టు తరఫున ఆరంగట్రేం చేయనున్నాడు. వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శిఖర్ ధావన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, దీపక్ హుడా. టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్. -
నెం1 బౌలర్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్.. బుమ్రాకి నో ఛాన్స్!
2021 ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-3 బౌలర్లను ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ప్రకటించాడు. నెం1 బౌలర్‌గా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌ను అతడు ఎంచుకున్నాడు. గత ఏడాదిలో 54 వికెట్లు పడగొట్టిన అశ్విన్ .. అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఇక టీ20 ప్రపంచ కప్-2021తో పరిమిత ఓవర్ల క్రికెట్లోకి పునరాగమనం చేసిన అశ్విన్ అదరగొట్టాడు. ఇక రెండు, మూడు స్ధానాల్లో షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీని హాగ్ ఎంచుకున్నాడు. 2021 ఏడాదిలో షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ వరుసగా 47, 41 వికెట్లు పడగొట్టారు. అదే విధంగా 2021 ఏడాదికు గాను నెం1 బ్యాటర్‌గా ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ని ఎంచుకున్నాడు. కాగా ఒకే క్యాలండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. గత ఏడాదిలో రూట్ 1708 పరుగులు సాధించాడు. కాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని హాగ్ ఎంపిక చేయకపోవడం గమనర్హం. చదవండి: Devon Conway: టెస్టుల్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కాన్వే.. తొలి ఆటగాడిగా! -
అశ్విన్‌ను ఎందుకు తీసుకోవడంలేదు.. దీనిపై విచారణ జరిపించాలి
Vengsarkar Comment on Ashwin: టీ20 ప్రపంచకప్2021లో భారత తుది జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకోకపోవడంపై మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మెగా టోర్నమెంట్లో వరుసగా టీమిండియా ఓడిపోతున్నప్పటికీ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై విచారణ జరిపించాలని అతడు డిమాండ్ చేశాడు. “అశ్విన్‌ని ఇంత కాలం ఎందుకు తీసుకోవడం లేదు? ఇది విచారణకు సంబంధించిన అంశం. ఫార్మాట్లలో అతడు 600 కంటే ఎక్కువ అంతర్జాతీయ వికెట్లు తీసిన అత్యుత్తమ స్పిన్నర్. అతడు అనుభవం ఉన్న స్పిన్నర్. అతడిని ఎందుకు తీసుకోవడంలేదో నాకు అర్థం కావడం లేదు. అశ్విన్‌ని ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అలాంటప్పుడు అతన్ని ఎందుకు సెలక్ట్ చేస్తారు? ఇది నాకు ఒక ప్రశ్నగా మిగిలింది" అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. కాగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్-2 ఐదో స్థానంలో నిలిచిన భారత్ సెమీస్ ఆశలు గల్లంతు చేసుకుంది. చదవండి: వారిని క్షమించు.. జట్టును కాపాడుకో.. కోహ్లికి బాసటగా నిలిచిన రాహుల్ గాంధీ -
ఆశ్విన్.. ముందు ఆ విషయం తెలుసుకో: గంభీర్
Gautam Gambhir Comments On Ashwin: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పెదవి విరిచాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయలేదని గంభీర్ విమర్శించాడు. స్పిన్ బౌలింగ్ బదులుగా అశ్విన్ అనేక వైవిధ్యాలను ప్రదర్శంచాడని అతడు తెలిపాడు. కాగా తొమ్మిదో ఓవర్లో మార్కస్ స్టోయినిస్ గాయం కారణంగా మైదానాన్ని వీడడం తో అతడి స్థానంలో అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆశ్విన్ ఒక్క వికెట్ కూడా సాధించలేదు. "అశ్విన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్, కానీ అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయలేదు. అతడు ఒక ఆఫ్ స్పిన్నర్ అని మొదట అర్థం చేసుకోవడం అవసరం. ఆ సమయంలో బౌలింగ్ చేయడం అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టు అప్పటికే మూడు, నాలుగు వికెట్లు కోల్పోయింది. చాలా కాలంగా ఆశ్విన్ క్రికెట్ ఆడడం లేదు. ఈ మ్యాచ్‌లో ఒత్తిడి కూడా పెద్దగా లేదు. ఏ ఫార్మాట్ అయినా కానీ ఎటుంటి పరిస్థితులోనైనా అతడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలగాలి" అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరింది. చదవండి: David Warner: అలా అవుట్ అవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు! -
రోహిత్ డబుల్ చేస్తాడనుకున్నా, అందుకే అలా చేశా
పూణే: ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ డబుల్ హండ్రెడ్ సాధిస్తాడని ఊహించి ముందుగా ట్వీట్ చేసిన టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 37 పరుగుల వద్ద రోహిత్ అవుటవ్వడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ప్రస్తుత వన్డే సిరీస్‌లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా నమోదు చేయని రోహిత్.. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో ఉన్నట్టు కనిపించాడు. బంతిని చక్కగా మిడిల్ చేస్తూ చూడచక్కని షాట్లతో(6 ఫోర్లు) అలరించాడు. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్.. కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీని సాధిస్తాడని, టీమిండియా 400 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేస్తుందని అశ్విన్ ట్వీట్ చేశాడు. అయితే రోహిత్.. అశ్విన్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ, ఆదిల్ రషీద్ వేసిన గూగ్లీకి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాగా, సిరీస్‌లో వరుసగా మూడోసారి టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ప్రత్యర్ధి కెప్టెన్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో నటరాజన్ రంగప్రవేశం చేశాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ధవన్ శుభారంభాన్ని అందించి, తొలి వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్‌ను రషీద్ బోల్తా కొట్టించగా, ధవన్(56 బంతుల్లో 67; 10 ఫోర్లు) చూడచక్కని షాట్లతో హాఫ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే వరుస ఓవర్లలో ధవన్, కోహ్లి(10 బంతుల్లో 7), రాహుల్(18 బంతుల్లో 7) వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆతరువాత క్రీజ్‌లో వచ్చిన పంత్(62 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు), హార్ధిక్(44 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) లు చెలరేగి ఆడారు. ఆఖర్లో టెయిలెండర్లు వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగుల వద్ద ఆలౌటైంది. -
‘చెన్నై వరద బాధితులకు అండగా ఉంటాం’
న్యూఢిల్లీ: భీకర వర్షాలకు అల్లాడుతున్న చెన్నై నగరవాసుల్లో భారత క్రికెటర్లు మురళీ విజయ్, ఆర్.అశ్విన్ కుటుంబసభ్యులు కూడా బాధితులుగా ఉన్నారు. ఈ ఉపద్రవంలో మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నట్టు క్రికెటర్లు తెలిపారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ ముగియగానే ప్రభావిత ప్రాం తాల్లో సహాయం చేస్తామని అన్నారు. ‘చెన్నైని వర ద ముంచెత్తినా నగర వాసులు కొందరు ధైర్యంగా ఇతరులకు సహాయపడుతున్నందుకు గర్విస్తున్నాను. ఇందులో నా స్నేహితులు నటుడు సిద్ధార్థ్, ఆర్జే బాలాజి కూడా ఉన్నారు. ఈ కష్ట సమయం లో చెన్నై నగరం ధైర్యంగా ఉంది. సిరీస్ ముగిశాక బాధిత కుటుంబాలకు నా చేతనైనంత సహాయాన్ని కచ్చితంగా అందిస్తాను’ అని స్పిన్నర్ అశ్విన్ తెలి పాడు. అలాగే ప్రస్తుత తరుణంలో తన కుటుంబం తో పాటు లేనందుకు బాధపడుతున్నానని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.