
Courtesy: IPL.Com
Gautam Gambhir Comments On Ashwin: ఐపీఎల్ ఫేజ్2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆట తీరుపై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పెదవి విరిచాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయలేదని గంభీర్ విమర్శించాడు. స్పిన్ బౌలింగ్ బదులుగా అశ్విన్ అనేక వైవిధ్యాలను ప్రదర్శంచాడని అతడు తెలిపాడు. కాగా తొమ్మిదో ఓవర్‌లో మార్కస్ స్టోయినిస్ గాయం కారణంగా మైదానాన్ని వీడడం తో అతడి స్థానంలో అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. 2.5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆశ్విన్ ఒక్క వికెట్ కూడా సాధించలేదు.
"అశ్విన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఆఫ్ స్పిన్నర్, కానీ అతను ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయలేదు. అతడు ఒక ఆఫ్ స్పిన్నర్ అని మొదట అర్థం చేసుకోవడం అవసరం. ఆ సమయంలో బౌలింగ్ చేయడం అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ప్రత్యర్ధి జట్టు అప్పటికే మూడు, నాలుగు వికెట్లు కోల్పోయింది. చాలా కాలంగా ఆశ్విన్ క్రికెట్ ఆడడం లేదు. ఈ మ్యాచ్లో ఒత్తిడి కూడా పెద్దగా లేదు. ఏ ఫార్మాట్ అయినా కానీ ఎటుంటి పరిస్థితులోనైనా అతడు ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలగాలి" అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి చేరింది.
చదవండి: David Warner: అలా అవుట్ అవడం నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు!