
Prithvi Shaw Gifts Himself BMW Car: టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఖరీదైన కారు కొన్నాడు. దాదాపు 68.50 లక్షల విలువ గల(ఎక్స్ ఫోరూం ధర) బీఎండబ్ల్యూ 6 సిరీస్ గ్రాన్ టరిస్మోను సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న 21 ఏళ్ల పృథ్వీ షా... కారు ముందు దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘‘అట్టడుగు స్థాయి నుంచి మొదలై.. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం’’ అంటూ ఉద్వేగభరిత కామెంట్ జత చేశాడు.
కాగా మహారాష్ట్రలోని థానేలో సాధారణ కుటుంబంలో జన్మించిన పృథ్వీ షా... దేశవాళీ క్రికెట్‌లో పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్‌లో ఈ ముంబై ఓపెనర్ డబుల్ సెంచరీ సాధించాడు. 152 బంతుల్లో 227 పరుగులు చేసి సంజూ శాంసన్ (212) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించాడు.
అంతేగాక లిస్టు ఏ క్రికెట్ (పురుషులు)లో ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్(శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీ)గా కూడా నిలిచాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీ షా 15 మ్యాచ్‌లలో 479 పరుగులు చేసి సత్తా చాటాడు. యూఏఈ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ యువ ప్లేయర్ తనకు తాను బీఎండబ్ల్యూ కారును గిఫ్టుగా ఇచ్చుకున్నాడు.
బీఎండబ్ల్యూ 6 సిరీస్ జీటీ స్పెసిఫికేషన్స్
►పెట్రోల్, డీజిల్ వర్షన్‌లో లభ్యం
►ఇంజిన్: 1995- 2993సీసీ
►టాప్ స్పీడ్: 220- 250 కేఎమ్‌పీహెచ్
చదవండి: Yuvraj Singh Arrested: క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్..!
Comments
Please login to add a commentAdd a comment