
Courtesy: IPL
DInesh Karthik Breach IPL Code Of Conduct.. ఐపీఎల్ 2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్–2 మ్యాచ్‌లో కేకేఆర్ 3 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. అయితే ఫైనల్లో అడుగుపెట్టిన కోల్‌కతాకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు కేకేఆర్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేష్ కార్తీక్‌కు ఐపీఎల్ యాజమాన్యం జరిమానా విధించింది.ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యిన కార్తీక్.. అసహనానికి లోనై స్టంప్స్‌ను కొట్టి పెవిలియన్‌కు వెళ్లాడు.
‘ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 అఫెన్స్ 2.2 రూల్ ప్రకారం కార్తీక్ చేసిన పని క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. అతడు నేరాన్ని అంగీకరించాడు. తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆదారపడి ఉందని' ఐపీఎల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్ రిఫరీ విధించే శిక్షకు కార్తీక్ కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు మ్యాచ్ రిఫరీ ఒక్క మ్యాచ్ నిషేదం కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో కార్తీక్ తప్పును రిఫరీ సీరియస్‌గా తీసుకుంటే, ఫైనల్ మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.