'ఢిల్లీ తప్పనిసరిగా టైటిల్‌ గెలుస్తుంది' | Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash | Sakshi
Sakshi News home page

Ricky Ponting Emotion: 'ఢిల్లీ తప్పనిసరిగా టైటిల్‌ గెలుస్తుంది'

Published Wed, Oct 13 2021 5:46 PM | Last Updated on Wed, Oct 13 2021 5:56 PM

Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash - Sakshi

Ricky Pontings Motivational Speech to DC players ahead of KKR clash:  ఐపీఎల్‌ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తప్పనిసరిగా టైటిల్‌ నెగ్గుతుందని ఆ జట్టు హెడ్‌ కోచ్‌ రికీ పాటింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా నేడు క్వాలిఫయర్ - 2లో భాగంగా షార్జా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్.. కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో చెన్నైతో ఢీకొట్టనుంది. ప్రస్తుత సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి పాయింట్ల ఢిల్లీ  పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. అయితే క్వాలిఫయర్-1లో సీఎస్‌కే చేతిలో ఓటమి చెందిన తరువాత ఢిల్లీ కాస్త ఢీలా పడింది. ఈ క్రమంలో నేడు జరగబోయే క్వాలిఫయర్ - 2లో  ఏ విధంగానైనా గెలిచి ఫైనల్‌కు చేరాలని ఢిల్లీ ఉర్రుతలూగుతుంది.

అయితే ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రికీ పాంటింగ్ తన జట్టుకు భావోద్వేగంతో కూడిన ప్రసంగం ఇచ్చాడు.  తమ జట్టు గత కొద్ది సీజన్ల నుంచి చాలా బాగా ఆడుతుందని, మా ఆటగాళ్ల మీద పూర్తి నమ్మకం ఉందని, తప్పని సరిగా ఢిల్లీ ఛాంపియన్‌గా నిలుస్తోందని పాటింగ్‌ తెలిపాడు. "నేను మూడు సంవత్సరాలుగా ఢిల్లీ జట్టులో ఉన్నాను .2018లో పాయింట్ల పట్టికలో చివరి స్ధానంలో నిలిచాము. 2019లో మా జట్టు మూడో స్ధానంలో నిలవగా, గత సంవత్సరంలో రన్నర్‌ప్‌గా నిలిచాము. మేము ఈ ఏడాది టైటిల్‌ గెలవగలమన్న నమ్మకముంది. రెండేళ్ల క్రితం ఉన్న ఢిల్లీ జట్టుకు.. ప్రస్తుతం ఉన్న ఢిల్లీ  జట్టుకు చాలా తేడా ఉందంటూ' పాంటింగ్ పేర్కొన్నాడు.

చదవండి: T20 World Cup 2021: కోల్‌కతా ఓపెనర్‌ వెంకటేష్‌ అయ్యర్‌కు బంపర్ ఆఫర్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement