న్యూఢిల్లీ: భీకర వర్షాలకు అల్లాడుతున్న చెన్నై నగరవాసుల్లో భారత క్రికెటర్లు మురళీ విజయ్, ఆర్.అశ్విన్ కుటుంబసభ్యులు కూడా బాధితులుగా ఉన్నారు. ఈ ఉపద్రవంలో మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నట్టు క్రికెటర్లు తెలిపారు. ప్రస్తుత దక్షిణాఫ్రికా సిరీస్ ముగియగానే ప్రభావిత ప్రాం తాల్లో సహాయం చేస్తామని అన్నారు. ‘చెన్నైని వర ద ముంచెత్తినా నగర వాసులు కొందరు ధైర్యంగా ఇతరులకు సహాయపడుతున్నందుకు గర్విస్తున్నాను.
ఇందులో నా స్నేహితులు నటుడు సిద్ధార్థ్, ఆర్‌జే బాలాజి కూడా ఉన్నారు. ఈ కష్ట సమయం లో చెన్నై నగరం ధైర్యంగా ఉంది. సిరీస్ ముగిశాక బాధిత కుటుంబాలకు నా చేతనైనంత సహాయాన్ని కచ్చితంగా అందిస్తాను’ అని స్పిన్నర్ అశ్విన్ తెలి పాడు. అలాగే ప్రస్తుత తరుణంలో తన కుటుంబం తో పాటు లేనందుకు బాధపడుతున్నానని ఓపెనర్ మురళీ విజయ్ తెలిపారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు.
‘చెన్నై వరద బాధితులకు అండగా ఉంటాం’
Published Sun, Dec 6 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM
Advertisement
Advertisement