![Murali Vijay Opens Up Did Not Get Freedom Of Virender Sehwag But - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/17/sehwag.jpg.webp?itok=Iiej5f2v)
వీరేంద్ర సెహ్వాగ్ (PC: Virender Sehwag Twitter)
Virender Sehwag- Murali Vijay: విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న వీరేంద్ర సెహ్వాగ్ గురించి టీమిండియా మాజీ ఓపెనర్ మురళీ విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీరూ భాయ్‌లాగే తనకు కూడా మేనేజ్‌మెంట్ మద్దతు లభించి ఉంటే తన కెరీర్ వేరే విధంగా ఉండేదని పేర్కొన్నాడు. సెహ్వాగ్‌కు తన క్రీడా జీవితంలో అనుకున్నవన్నీ దక్కాయని, తన విషయంలో మాత్రం అలా జరుగలేదని వాపోయాడు.
కాగా 2008లో ఆస్ట్రేలియాతో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు చెన్నై బ్యాటర్ మురళీ విజయ్. సెహ్వాగ్‌తో కలిసి పలు సందర్భాల్లో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగాడు. 2018లో ఆసీస్‌తో పెర్త్‌లో ఆఖరిసారిగా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం విదేశీ లీగ్‌లలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న 38 ఏళ్ల ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. స్పోర్ట్స్ స్టార్ షోలో పాల్గొన్నాడు.
అలాంటి ఫ్రీడం దొరికి ఉంటే
ఈ సందర్భంగా డబ్లూవీ రామన్‌తో ముచ్చటిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. తన కెరీర్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు దక్కినంత స్వేచ్ఛ నాకు లభించలేదనే చెప్పాలి. తనకు యాజమాన్యం నుంచి అన్ని విధాలా మద్దతు దొరికింది. తన మాట చెల్లేది.
నాకు కూడా అలాంటి ఫ్రీడం దొరికి ఉంటే.. నా మాట వినిపించుకునే వాళ్లు ఉండి ఉంటే బాగుండేది. అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించాలంటే మేనేజ్‌మెంట్ మద్దతు తప్పనిసరి. వరుస అవకాశాలు వస్తేనే ప్రయోగాలు చేసే వీలు ఉంటుంది’’ అని మురళీ విజయ్ పేర్కొన్నాడు.
ఏదేమైనా తనలా ఎవరూ ఆడలేరు!
వీరూ భాయ్‌తో కలిసి ఆడటం గురించి చెబుతూ..‘‘సెహ్వాగ్ మరో ఎండ్‌లో ఉన్నాడంటే బ్యాటింగ్ చేయడం కాస్త కష్టమే. తనలా మరెవరూ బ్యాటింగ్ చేయలేరు అనిపిస్తుంది. భారత క్రికెట్‌కు ఆయన ఎనలేని సేవ చేశారు.
అలాంటి అద్భుత ఆటగాడితో కలిసి ఆడటం, ఆయన ఇన్నింగ్స్ ప్రత్యక్షంగా వీక్షించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. బంతి వచ్చిందంటే అదును చూసి బాదడమే ఆయన పని. తన సక్సెస్ మంత్ర ఇదే! గంటకు 145- 150 కిలో మీటర్లవేగంతో బంతిని విసిరే బౌలర్లను కూడా ఉతికి ఆరేయడం తనకే చెల్లింది. నిజంగా తన ఆట తీరు అసాధారణం’’ అని ప్రశంసలు కురిపించాడు.
చదవండి: IND vs NZ: మా సంజూ ఎక్కడ? గుండెల్లో ఉన్నాడు.. శభాష్ సూర్య! వీడియో వైరల్
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. సెహ్వాగ్ రికార్డుపై కన్నేసిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment