టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు.
కాగా 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు.
కెరీర్‌లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్‌తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు.
సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్‌కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య
Comments
Please login to add a commentAdd a comment