Bharat Arun
-
గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది.క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్‌దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్‌ను మెంటార్‌గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్‌లు కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్‌వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్‌గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్ నాయర్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్‌పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన -
సెహ్వాగ్ కాదు!.. గావస్కర్ తర్వాత అతడే టెస్టు బెస్ట్ ఓపెనర్!
టీమిండియా బౌలింగ్ విభాగం మాజీ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయం వెల్లడించాడు. రవిశాస్త్రి దృష్టిలో సునిల్ గావస్కర్ తర్వాత అంతటి గొప్ప ఓపెనర్ మళ్లీ మురళీ విజయ్ అని పేర్కొన్నాడు. తనకు కూడా మురళీనే అభిమాన క్రికెటర్ అని తెలిపాడు. కాగా 2008లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా తమిళనాడుకు చెందిన మురళీ విజయ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్‌లో వరుసగా 33, 41 పరుగులు సాధించాడు. ఓపెనర్‌గా సత్తా చాటి టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగాడు. కెరీర్లో మొత్తంగా 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడి ఆయా ఫార్మాట్లలో వరుసగా 3982, 339, 169 పరుగులు సాధించాడు మురళీ విజయ్. గతేడాది జనవరిలో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తాజాగా మురళీ విజయ్ గురించి క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో భరత్ అరుణ్ మాట్లాడుతూ.. ‘‘యువకుడిగా ఉన్నప్పటి నుంచి నాకు మురళీ విజయ్‌తో పరిచయం ఉంది.కాలేజీలో తనను మొదటిసారి చూశాను. ఫస్ట్ డివిజన్ జట్టుకు అతడి పేరును రికమెండ్ చేశాను. అలా అతడి ప్రయాణం మొదలైంది. రవిశాస్త్రి ఎల్లప్పుడూ నాతో ఓ మాట అంటూ ఉండేవాడు. సునిల్ గావస్కర్ తర్వాత ఆ స్థాయిలో టెస్టుల్లో ఆకట్టుకున్న ఓపెనర్ మురళీ విజయ్ అని చెప్పేవాడు. నా ఫేవరెట్ క్రికెటర్ కూడా మురళీ విజయే’’ అని పేర్కొన్నాడు. కాగా టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన దిగ్గజ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మలను కాదని.. గావస్కర్ తర్వాతి స్థానాన్ని రవిశాస్త్రి మురళీ విజయ్‌కు ఇవ్వడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అప్పుడు పుజారాకు ఫోన్ చేశా.. రోహిత్, రాహుల్ భయ్యాకు థాంక్స్: అశూ భార్య -
Ind Vs Aus: పూర్తిగా అలసిపోయాను సర్.. శారీరకంగా, మానసికంగా కూడా! నా వల్ల కాదు!
India vs Australia- Test Series- Jasprit Bumrah: 2018- 19.. ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్.. తొలి టెస్టులో టీమిండియా విజయం.. రెండో టెస్టులో ఆతిథ్య ఆసీస్ గెలుపు.. మూడో మ్యాచ్‌లో కోహ్లి సేన ఘన విజయం.. ఇంకొక్క అడుగు పడితే.. ట్రోఫీ గెలిచే అవకాశం.. ప్రఖ్యాత మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో 9 వికెట్లతో చెలరేగి కంగారూ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జస్ప్రీత్ బుమ్రాపై భారీ అంచనాలు. సిడ్నీలోనూ సత్తా చాటుతాడని అభిమానుల ఆశలు.. అయితే, పిచ్ మాత్రం పేసర్లకు మరీ అంత అనుకూలంగా లేదు. దీంతో బుమ్రా కంగారు పడ్డాడు. వెంటనే బౌలింగ్ కోచ్ దగ్గరికి వెళ్లి కాస్త మొహమాటపడుతూనే తన మనసులో మాట బయటపెట్టాడు. అలసిపోయాను సర్.. నా వల్ల కాదు ‘‘సర్.. వికెట్ అనుకున్న విధంగా లేదు. ఇక్కడ ఫాస్ట్ బౌలర్లు చేయగలిగిందేమీ లేదు. నేను పూర్తిగా అలసిపోయాను. నా శరీరం పూర్తిగా అలసిపోయింది. మానసికంగానూ బలహీనం అయిపోయాను. ప్రస్తుతం నా పరిస్థితి ఇదీ. పిచ్ మరీ డల్‌గా ఉంది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నన్నేం చేయమంటారు సర్? కాస్త నెమ్మదిగా బౌలింగ్ చేయనా? నాకు ఏది సరైంది అనిపిస్తే అలాగే చేయమంటారా?’’ అని భరత్ అరుణ్‌ని అడిగాడు. ఎవరేం చెప్పినా ఓపికగా వినే భరత్ అరుణ్.. బుమ్రా మాటలను ఆసాంతం విన్నాడు. అయితే, తనేం చెప్పదలచుకున్నాడో పూర్తిగా అర్థమయ్యాక.. బుమ్రాను ఇబ్బంది పెట్టదలచుకోలేదు. తనదైన వ్యూహాలతో స్వేచ్ఛగా బౌలింగ్ చేసేందుకు సమ్మతించాడు. స్పిన్నర్ల విజృంభణ బుమ్రా అన్నట్లుగానే సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిపోయింది. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. పేసర్ షమీకి రెండు, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు రెండు వికెట్లు దక్కగా.. బుమ్రా ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. ఇక ఆసీస్ బౌలర్లలో ప్రధాన స్పిన్నర్ నాథన్ లియోన్‌కు 4 వికెట్లు దక్కాయి. టీమిండియా మాజీ కోచ్ రామకృష్ణన్ శ్రీధర్ ఈ మేరకు బుమ్రా- భరత్ మధ్య జరిగిన సంభాషణ గురించి తన పుస్తకం.. ‘‘కోచింగ్ బియాండ్’లో ప్రస్తావించాడు. ముందు మ్యాచ్‌లో అత్యద్భుతంగా ఆడిన బుమ్రా.. మరుసటి మ్యాచ్‌లో ఎలాంటి మానసిక ఆందోళనకు గురయ్యాడో వివరించాడు. సత్తా చాటిన బుమ్రా.. ఇప్పుడు ఫిట్నెస్ సమస్యలతో.. కాగా నాటి ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తంగా 21 వికెట్లతో సత్తా చాటాడు. ఇక ఆసియా కప్-2022 టీ20 టోర్నీ నుంచి జట్టుకు దూరమైన భారత పేసు గుర్రం బుమ్రా ఇంతవరకు పూర్తి స్థాయిలో జట్టుకు అందుబాటులోకి రాలేదు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఓ మ్యాచ్ ఆడినప్పటికీ వెన్నునొప్పి తిరగబెట్టడంతో మరోసారి దూరమయ్యాడు. స్వదేశంలో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌కు సైతం బుమ్రా దూరం కావడంతో అతడి ఫిట్‌నెస్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 30 టెస్టులాడిన బుమ్రా 128 వికెట్లు కూల్చాడు. ఎనిమిది సార్లు ఐదు వికెట్లు కూల్చిన(ఒక మ్యాచ్‌లో) ఘనత సాధించాడు. చదవండి: Women T20 WC: 10 వికెట్ల తేడాతో విజయం.. దర్జాగా సెమీస్‌కు 'ఈ సమస్య మన వల్లే'.. ఆలోచింపజేసిన యువీ ట్వీట్ -
"భారత్‌ను నెం1గా నిలపాలని కష్టపడ్డాడు.. మరో రెండేళ్లు కెప్టెన్‌గా ఉండాల్సింది"
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ నిలిచాడు. కోహ్లి సారథిగా 68 టెస్ట్‌ల్లో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అయితే కోహ్లి ఇంకా కొన్ని సంవత్సరాలు కెప్టెన్‌గా కొనసాగింటే బాగుండేదని భారత మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి తీసుకున్న ఈ నిర్ణయం తనను షాక్‌కు గురి చేసింది అని భరత్ అరుణ్ తెలిపాడు. కోహ్లి జట్టును నడిపించడానికి ఎంతో ఇష్టంగా ఉండేవాడని అతడు పేర్కొన్నాడు. విరాట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోన్నాడు అన్న వార్త విని నేను ఆశ్చర్యపోయాను. మాతో మాట్లాడే ప్రతిసారీ జట్టును లీడ్ చేయడంపై కోహ్లి చాలా మక్కువ చూపేవాడు. టీమిండియాను ప్రపంచంలో నెం1 జట్టుగా నిలపాలని అతడు నిరంతరం కష్టపడేవాడు. భారత జట్టుకు అద్భుతమైన పునాదిని వేసి తన బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. విరాట్ భారత జట్టు టెస్ట్ కెప్టెన్‌గా మరో రెండేళ్లు కొనసాగింటే బాగుండేది. కెప్టెన్ అంఏ ఎంస్ ధోనిలా కూల్‌గా ఉండాలి. ప్రశాంతంగా ఉన్నప్పడే ఫీల్డ్‌లో అధ్బుతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు అని భరత్ అరుణ్ పేర్కొన్నాడు. చదవండి: బంతిని చూడకుండానే భారీ సిక్సర్... అంత కాన్ఫిడెన్స్ ఏంటి రషీద్ భయ్యా! -
IPL 2022: కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
Bharat Arun Appointed As KKR Bowling Coach: టీమిండియా మాజీ ఆటగాడు, జట్టు మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. కైల్ మిల్స్ స్థానంలో కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా అరుణ్‌ను ఎంపిక చేసినట్లు ఫ్రాంఛైజీ సీఈఓ వెంకీ మైసూర్ వెల్లడించాడు. అరుణ్ ఎంపిక తక్షణమే అమల్లోకి వస్తుందని వెంకీ పేర్కొన్నాడు. అరుణ్ నియామకాన్ని కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ స్వాగతించాడు. కాగా, రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో భరత్ అరుణ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని హయాంలో టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లాంటి యువ పేసర్లు అరుణ్ కోచింగ్‌లో రాటు దేలారు. 59 ఏళ్ల అరుణ్ టీమిండియా తరఫున రెండు టెస్ట్‌లు, నాలుగు వన్డేలు ఆడాడు. ఇదిలా ఉంటే, దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021లో ఇయాన్ సారధ్యంలోని కేకేఆర్ జట్టు అనూహ్య విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తుదిపోరులో సీఎస్కే చేతుల్లో చతికిలబడడంతో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. మరోవైపు ఐపీఎల్ 2022 రిటెన్షన్‌లో విండీస్ యోధుడు ఆండ్రీ రస్సెల్, టీమిండియా యువ సంచలనం వెంకటేశ్ అయ్యర్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలను అట్టిపెట్టుకున్న కేకేఆర్.. జట్టు కెప్టెన్ మోర్గాన్, కీలక ఆటగాళ్లు దినేశ్ కార్తీక్, పాట్ కమిన్స్‌లను వేలానికి వదిలేసింది. చదవండి: ind vs Sa: భారత జట్టు ముందు సఫారీలు నిలవడం కష్టమే! -
కరోనా బారిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
లండన్: లండన్‌లో ఉన్న భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌లు కూడా కోవిడ్–19 బారిన పడ్డారు. వీరికి తాజాగా నిర్వహించిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు బీసీసీఐ ప్రకటించింది. శనివారం, ఆదివారం చేసిన ర్యాపిడ్ టెస్టుల్లో రవిశాస్త్రికి కరోనా ఉన్నట్లు తేలింది. దాంతో ఇంగ్లండ్‌తో మాంచెస్టర్‌లో జరిగే ఐదో టెస్టుకు వీరు అందుబాటులో ఉండరు. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
మహ్మద్ సిరాజ్ గురువు ఆయనే!
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అదరగొడుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్ విజయంలో టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కీలక పాత్ర పోషించారని మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జట్టుకు కోచ్‌గా వ్యవరించినప్పడే సిరాజ్ ప్రతిభను భరత్ అరుణ్ గుర్తించాడని శివరామకృష్ణన్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ‘సిరాజ్‌కు నేర్చుకోవాలనే తపనతో పాటు విజయవంతం అవ్వాలన్న పట్టుదల ఎక్కువే. భరత్ అతడికి ఎంతో పరిజ్ఞానాన్ని అందించాడు' అని శివరామకృష్ణన్ పేర్కొన్నారు. కొందరు ఆటగాళ్లు కోచ్ సలహాను పాటించకపోవచ్చు కానీ సిరాజ్ మాత్రం భరత్ అరుణ్ ఏది చెప్పినా దానిని అవ్యక్తంగా అనుసరించాడని ఆయన చెప్పారు. చదవండి:IPL-2021: పంజాబ్ కింగ్స్ లోకి ఆసీస్ యువ పేసర్ కాగా, టీమిండియా బౌలింగ్ కోచ్‌గా ఉన్న భరత్.. 2016లో హైదరాబాద్ రంజీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. అప్పడే.. సిరాజ్ కోచ్ భరత్ అరుణ్ దృష్టిలో పడ్డాడు. ఒకరకంగా టీమిండియాకు సిరాజ్ ఎంపికలో భరత్‌దే కీలకపాత్ర అని చెప్పొచ్చు. కివీస్‌తో తొలి టీ20 తర్వాత ఆశిష్ నెహ్రా రిటైరవనున్న నేపథ్యంలో చివరి 2 మ్యాచ్‌లకు జయదేవ్ ఉనద్కత్ లేదా బాసిల్ థంపిలలో ఒకరికి అవకాశం లభిస్తుందని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సిరాజ్‌కు జట్టులో చోటు దక్కడం వెనుక భరత్ పాత్ర ఉందని శివరామకృష్ణన్ వెల్లడించారు. చదవండి:Mohammed Siraj: సిరాజ్ సెలబ్రేషన్స్ వైరల్; హైదరాబాద్‌లో భారీ కటౌట్ -
ఏదో ఒకటి వాడనివ్వొచ్చుగా!
న్యూఢిల్లీ: స్వింగ్‌ను రాబట్టేందుకు బంతి మెరుపు పెంచే ప్రయత్నంలో బౌలర్లకు సరైన ప్రత్యామ్నాయం చూపించాలని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయ పడ్డారు. షైనింగ్ కోసం ఉమ్ముకు బదులు మరేదైనా పదార్థాన్ని సూచించాలని ఆయన కోరారు. అన్ని జట్లు దాన్నే అనుసరించినపుడు ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవన్నారు. క్రికెట్లో సాధారణంగా బౌలర్లు ఉమ్ముతోనే బంతిని షైనింగ్ చేస్తారు. కరోనా మహమ్మారి వల్ల దీనిని ఐసీసీ నిషేధించింది. ఈ నేపథ్యంలో బయటి పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని పలువురు బౌలర్లు, కోచ్‌లు సూచిస్తున్నారు. దీనిపై భరత్ అరుణ్ మాట్లాడుతూ ‘మైనం లేదా వ్యాజిలీన్ లేదా మరేదైనా గానీ... ఏదో ఒకటి వాడే వెసులుబాటు ఇస్తే, అన్ని జట్ల బౌలర్లు దాన్నే వాడతారు. అటువంటి పదార్థాన్ని ప్రయత్నిస్తే తప్పేంటి’ అని అన్నారు. ఉమ్మును వాడే పద్ధతి నుంచి అంత తేలిగ్గా బయటపడమని, శిక్షణ శిబిరాల్లో తరచూ దానిపై అవగాహన కల్పిస్తే ఆ అలవాటు తగ్గుతుందని అరుణ్ చెప్పారు. -
భరత్ దిద్దిన బలగం
మనది స్పిన్నిండియా! సిరీస్‌ల్లో నెట్టుకొచ్చినా... నెగ్గుకొచ్చినా... అది స్పిన్నర్ల వల్లే సాధ్యమయ్యేది. అందుకే స్పిన్ ఇండియాగా మారింది. కానీ ఇపుడు ఈ పరిస్థితి కూడా మారింది. స్పిన్నర్లకు దీటుగా పేసర్లు దడదడలాడిస్తున్నారు. ఇటీవలే వారిని మించి కూడా రాణిస్తున్నారు. అంతలా ఈ పేస్ పదును పెరగడానికి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఎంతో కృషి చేశారు... చేస్తున్నారు కూడా! సాక్షి క్రీడా విభాగం: సొంతగడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలిచిందంటే అది స్పిన్నర్ల ఘనతే! కానీ ఇది ఒకప్పటి మాట. ఇప్పుడీ ఆనవాయితీ మారింది. పేస్ పదును తేలింది. ప్రత్యర్థి జట్టును రెండుసార్లు ఆలౌట్ చేసి... మ్యాచ్‌ల్ని, సిరీస్‌లనీ గెలవడంలో పేసర్ల పాత్ర పెరిగింది. ఉన్నపళంగా ఈ మార్పేమీ జరగలేదు. కొంతకాలంగా సానబెడితేనే పేస్ ఫలితాలు సాకారమవుతున్నాయి. ఈ ఫలితాలకు, గణనీయమైన మార్పులకు టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణే కారణం. ఆయన సీమర్లనే కాదు స్పిన్నర్లు చహల్, కుల్దీప్, అశ్విన్, జడేజాల లోపాలను కూడా సరిదిద్దారు. భారత ‘బ్యాటిం గ్’కు మేలురకమైన బౌలింగ్ బలగాన్ని జతచేశారు. దీంతో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో విజయాలు చేకూరుతున్నాయి. భరత్ బౌలర్లకు బంతులెక్కడ సంధించాలో చెప్పరు... ఆ బంతి ఎక్కడ పిచ్ కావాలనేది కచ్చితంగా చెబుతారు. అదే వాళ్లను అలా టర్న్ అయ్యేలా చేస్తుందనేది ఆయన నమ్మకం. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 1962లో పుట్టిన భరత్ అరుణ్ తమిళనాడు తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడారు. భారత్ తరఫున రెండు టెస్టులు, నాలుగు వన్డేలు ఆడిన ఆయన 1993లో రిటైర్మెంట్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల తర్వాత 2002లో తమిళనాడు రంజీ జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లపాటు భరత్ ఈ పదవిలో ఉన్నారు. రెండుసార్లు తమిళనాడును రంజీ ఫైనల్‌కు చేర్చారు. అనంతరం 2008లో జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఆయన 2012లో భారత అండర్– 19 జట్టు బౌలింగ్ కోచ్‌గా పని చేశారు. 2014లో ఐపీఎల్–7లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన ఆయన అదే ఏడాది భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. షమీ రనప్ మార్చి... మొహమ్మద్ షమీ ప్రతిభఉన్న పేసరే కానీ... తర్వాత్తర్వాత పూర్తిగా టెస్టు బౌలర్‌గా ముద్రపడిపోయాడు. గాయాలతో సతమతమయ్యాడు. ఆటకు దూరమైన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనో ప్రధాన బౌలర్. కారణం భరత్ అరుణే! అతని సత్తా ఏంటో తెలిసిన కోచ్ ముందు షమీ రనప్‌ను గమనించాడు. పెద్దపెద్ద అంగలతో వేసే అడుగుల్ని మార్చాడు. వేగంగా పరిగెడితేనే సరిపోదని చెప్పాడు. బంతి సంధించేవేళ ఆ వేగాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమే కీలకమన్నాడు. ఉదాహరణకు 200 కి.మీ. వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి తీరా బంతివేసే సమయానికి లయ కోల్పోతే లాభమేంటని సూచించాడు. ఎంత వేగంతో బ్యాలెన్స్ చేసుకుంటావో అంతే రనప్ అవసరమని చెప్పిన బౌలింగ్ కోచ్ మాటలు షమీని మార్చేశాయి. వేగం మారి బౌలింగ్ వైవిధ్యం పెరిగింది. కుదురుగా లైన్ అండ్ లెంత్కు కట్టుబడేలా చేసింది. అంతే కొన్ని రోజుల వ్యవధిలోనే అతనికి వన్డే జట్టులో పదిలమైన స్థానాన్ని కట్టబెట్టగా... ఇపుడు ఏకంగా పొట్టి ఫార్మాట్‌కు అక్కరకొచ్చే ఆటగాడ్ని చేసేసింది. పరిమిత ఓవర్ల ఆటకు దూరమైన ఆ బౌలర్‌ను వన్డే ప్రపంచకప్ ఆడే స్థితికి తీసుకొచ్చిన ఘనత అరుణ్‌దే. బుమ్రా శైలిపై సంశయమున్నా.. బౌలింగ్ కోచ్ భరత్ బౌలర్ల ప్రదర్శనకు వికెట్లే ప్రమాణంగా ఎప్పుడూ పరిగణించరు. భారత సంచలన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వచ్చీ రాగానే మంచి బౌలర్‌గా కితాబు అందుకున్నాడు. అతను తీసే వికెట్లతో టీమ్ మేనేజ్మెంట్ తెగ సంబరపడింది... కానీ అతని భిన్నమైన బౌలింగ్ శైలిపై అందోళన పడింది మాత్రం అరుణే! ఇది అతని కెరీర్‌కు, ఫిట్‌నెస్‌కు సమస్యగా మారుతుందని తొలినాళ్లలోనే హెచ్చరించారు. శరీరంపై ఆ శైలి తాలూకు పడే అదనపు ఒత్తిడి వల్లే తాజాగా బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించడం విశేషమైతే ఫిజియోతో కలిసి అతని ఫిట్‌నెస్‌కు ఢోకా లేకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కసరత్తు కూడా చేశారు అరుణ్. అయితే బుమ్రా తనకు ఆ బౌలింగ్ శైలే సౌకర్యవంతమని చెప్పడంతో కాదనలేకపోయారు. అలాగే ఇప్పుడు గాయం నుంచి కోలుకునేందుకు అన్ని రకాలుగా అతనికి సేవలందిస్తున్నారు. వికెట్లు తీస్తే సరిపోదని... నిలకడకూ ప్రాధాన్యమివ్వాలని, ఫిట్నెస్ను కాపాడుకోవాలని పదేపదే హెచ్చరిస్తారు. ఇషాంత్... స్వింగ్ సుల్తాన్ చాలా సార్లు ఇషాంత్ శర్మ వికెట్లు తీయడు. కానీ పొదుపుగా బౌలింగ్ చేస్తాడు. కారణం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఇషాంత్‌ను పెద్దగా పట్టించుకోకపోవడమే! దీన్ని బౌలింగ్ కోచ్ గమనించారు. అతని బౌలింగ్ కోణం (యాంగిల్), సంధించే ముందు మణికట్టు తీరు (రిస్ట్ పొజిషన్) మార్చుకుంటే సరిపోతుందని తగిన సలహాలిచ్చారు. అన్నట్లుగానే ఇషాంత్ తన బౌలింగ్ లోపాల్ని సరిదిద్దుకున్నాడు. అలా గాడినపడ్డ అతను వైవిధ్యమైన స్వింగ్ బౌలింగ్‌తో రాణిస్తున్నాడు. క్రికెటర్లెవరైనా ఒకసారి మంచిగా అనిపిస్తే అదే శైలిని, అదే దారిని కొనసాగిస్తారు. కానీ అది ఫలితాలను ఇవ్వకపోతే మాత్రం కొత్తదారుల్ని కనుగొనాలని చెబుతాడు అరుణ్. ఏదేమైనా ఇషాంత్ కొత్త యాంగిల్‌ను పరీక్షించడంతో పాటు ఉన్న లోపాల్ని సరిదిద్దుకోవడంతో మంచి స్వింగ్ బౌలర్‌గా మారాడు. ఉమేశ్ పేస్‌కు పదును... ఉమేశ్ సొంతగడ్డపై అద్భుతంగా రాణిస్తాడు. కానీ విదేశాల్లో ఆ మేరకు రాణించలేకపోవడానికి కారణం తగినన్ని అవకాశాలు రాలేకపోవడమేనని భరత్ అరుణ్ విశ్లేషించారు. విదేశీ పిచ్‌లపై అనుభవం లేకే ఉమేశ్ వెనుకబడ్డాడు కానీ ప్రతిభ లేక కాదు అనేది ఆయన అభిప్రాయం. అతని ప్రదర్శనకు మెరుగులు దిద్దేందుకు అరుణ్ బాగా శ్రమించారు. రనప్‌పై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే జట్టుకు అవసరమైనపుడల్లా అందుబాటులో ఉంచుతున్నారు. దక్షిణాఫ్రికాతో ముందుగా ప్రకటించిన టీమిండియాలో ఉమేశ్ లేడు. కానీ బుమ్రా గాయంతో అతనికి అవకాశం వచ్చింది. స్వదేశీ పిచ్‌లపై అతనికి సరైన అవగాహన ఉంది. అప్పుడప్పుడు నిలకడ లోపించినా తుది ఎలెవన్ జట్టులో ఆడే సత్తా అతనికి ఉందని, ముగ్గురికి మించి పేసర్ల అవసరం లేకే అతను తుది జట్టుకు దూరమవుతున్నాడనేది కోచ్ అభిప్రాయం. -
బుమ్రాకు సర్జరీ అవసరం లేదు
బెంగళూరు: వెన్నుగాయంతో ఆటకు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. కోలుకునేందుకు చాలా సమయం పట్టదని, సాధ్యమైనంత త్వరలోనే అతను బరిలోకి దిగే అవకాశముందని చెప్పారు. ఈ నెల ఆరంభంలో బుమ్రా జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ ఫిజియో ఆశిష్ కౌషిక్‌తో కలిసి ఇంగ్లండ్ వెళ్లాడు. అక్కడ స్పెషలిస్ట్ వైద్యులను సంప్రదించిన అనంతరం వెన్ను గాయం అంతతీవ్రమైంది కాదని, సర్జరీ అక్కర్లేదని వైద్యులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. ‘ఫాస్ట్ బౌలింగ్ అనేదే అసహజమైన క్రియ. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గాయపడమనే గ్యారంటీ ఉండదు. ఇప్పుడు సర్జరీ అవసరం లేకపోవడంతో బుమ్రా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కల్లా కోలుకుంటాడని ఆశిస్తున్నాం’ అని భరత్ అరుణ్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా లేని లోటే కనబడలేదు. పేసర్లు షమీ, ఉమేశ్ యాదవ్‌లిద్దరూ భారత గడ్డపై స్పిన్నర్లను మించి వికెట్లను పడగొట్టిన సంగతి తెలిసిందే. -
ఆశ్చర్యం.. జాంటీ రోడ్స్‌కు నో ఛాన్స్?
హైదరాబాద్ : క్రికెట్లో ఫీల్డింగ్‌కు పర్యాయ పదంగా చెప్పుకునే దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కు తీవ్ర నిరాశే ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం రోడ్స్ దరఖాస్తు చేసుకోవడంతో అతడి ఎంపిక దాదాపు ఖాయమని అందరూ భావించారు. అయితే ఇటీవలే ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి మరల నియామకమైన తర్వాత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. సహాయక సిబ్బంది ఎంపిక విషయంలో రవిశాస్త్రి వెనక్కి తగ్గటం లేదని, తనకు నచ్చిన వారినే నియమించుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతమున్న సిబ్బందే కొనసాగుతారని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సపోర్టింగ్ స్టాఫ్‌ను ఎంపిక చేసేందుకు గురువారం భేటీ కానుంది. ఆదే రోజున సహాయక సిబ్బంది పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్ శ్రీధర్ కోచింగ్ పర్యవేక్షణలో టీమిండియా ఫీల్డింగ్ మరింత బలపడిందని, ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగుపడిందని రవిశాస్త్రి వాదిస్తున్నాడు. దీంతో శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా మరోసారి కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచంలోనే దిగ్గజ ఫీల్డర్‌గా కీర్తింపబడే జాంటీ రోడ్స్‌కు నిరాశ ఎదురవక తప్పదు. భారత్‌పై తనకున్న ప్రేమ, గౌరవాన్ని అనేకమార్లు చాటిన రోడ్స్.. ఫీల్డింగ్ కోచ్‌గా టీమిండియాకు సేవలందించాలని తెగ ఆరాటపడ్డాడు. అయితే ఆశ్చర్యకరంగా రోడ్స్‌ను పక్కకు పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్ పనిచేసిన విషయం తెలిసిందే. ఇక దాదాపుగా బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత బౌలింగ్‌లో ఎలాంటి సమస్యలు లేనందున భరత్ అరుణ్ వైపే కమిటీ మొగ్గు చూపుతోంది. అయితే బ్యాటింగ్ కోచ్‌ను తప్పకుంగా మార్చాలనే ఆలోచనలో బీసీసీఐతో పాటు ప్రసాద్ కమిటీ ఉన్నట్లు సమాచారం. బ్యాటింగ్‌లో నాలుగో స్థానంతోపాటు, మిడిలార్డర్ సమస్యను పరిష్కరించలేకపోయిన ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేయడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త బ్యాటింగ్ కోచ్ కోసం భారత మాజీ ఆటగాళ్లు ప్రవీణ్ ఆమ్రే, విక్రమ్ రాథోర్లు రేసులో ముందున్నారు. చదవండి: ఎగేసికుంటూ పోయి.. ఉట్టి చేతులతోనే! ఫీల్డింగ్ కోచ్ బరిలో జాంటీ రోడ్స్ -
సచిన్ సూచనకు ఓటేసిన బౌలింగ్ కోచ్
న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ‘బౌండరీలు’ ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై దిగ్గజ క్రికెటర్లు సైతం విమర్శలు గుప్పించారు. దీనిలో భాగంగా ఈ రూల్‌ను పునః పరిశీలించాల్సిన అవసరముందంటూ సూచనలు కూడా చేశారు. మెగా ఫైట్‌లో విజేతను తేల్చేక్రమంలో సూపర్ ఓవర్ సైతం టైగా ముగిస్తే, మరొక సూపర్ ఓవర్‌ను వేయిస్తే బాగుంటుందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనికి తాజాగా భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మద్దతు ప్రకటించాడు. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లో బౌండరీల లెక్కన విజేతను నిర్ణయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. సచిన్ సూచించిన మరొక సూపర్ ఓవర్ సూచనతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపాడు. ‘ అసలు అత్యధిక బౌండరీల గెలిచిన జట్టు విజేత అనే నిబంధనను ఎందుకు ప్రవేశపెట్టారో తెలియదు. విజేతను నిర్ణయించడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఇక్కడ బౌండరీల ఆధారంగా జట్టును గెలిచినట్లు ప్రకటించేకంటే, వికెట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం సమంజసంగా ఉంటుందనేది నా అభిప్రాయం. అదే సమయంలో మరొక సూపర్ ఓవర్‌తో విజేతను తేల్చినా ఫర్వాలేదు’ అని భరత్ అరుణ్ తెలిపాడు. ఇక ప్రపంచకప్‌లో గ్రూప్ స్టేజ్‌లో ‘టాప్’లో నిలిచిన జట్టుకు మరొక అవకాశం ఉంటే బాగుంటుందన్నాడు. ఇందుకు ఐపీఎల్ తరహా నిబంధనను తీసుకురావాలని పేర్కొన్నాడు. -
కోహ్లితో ఎలా పోల్చుతారు?
మాంచెస్టర్ : టీమిండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోని మరోసారి తన పేలవ ప్రదర్శనతో విమర్శల పాలవుతున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ మ్యాచ్‌లో స్లాగ్ ఓవర్లలో స్లో బ్యాటింగ్ చేయడంతో టీమిండియా స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. దీంతో ధోని బ్యాటింగ్ తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ధోని పరుగులు చేయడానికి ఇబ్బందులు పడిన మ్యాచ్‌లోనే సారథి విరాట్ కోహ్లి వందకు పైగా స్ట్రైకే రేట్‌తో అర్దసెంచరీ సాధించాడని క్రీడా విశ్లేషకులు పోలుస్తున్నారు. అయితే ఈ విషయంలో ధోనికి టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మద్దతుగా నిలుస్తున్నాడు. ‘ఒక ఆటగాడిని మరొక ఆటగాడితో ఎలా పోల్చుతారు?విరాట్ కోహ్లి ప్రస్తుతం అన్ని ఫార్మట్లలో నంబర్ వన్ బ్యాట్స్‌మన్. అతడితో ఇంకొక ఆటగాడిని పోల్చడం తప్పు. ఇక అఫ్గాన్ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ వైఫల్యంపై మీరందరూ మాలో ఎవరిని ప్రశ్నించినా తమది ఒకటే సమాధానం.. పొరపాట్లను గుర్తించాం.. మెరుగుపర్చుకుంటాం. ఒక మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన విమర్శించడం తగదు. ప్రపంచకప్ తొలి మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా భారీ స్కోర్లు సాధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అఫ్గాన్ మ్యాచ్‌లో పరిస్థితులు, వాతావరణం, పిచ్ ఇవన్నీ చూడాలి కదా. అయితే ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా బ్యాట్స్‌మెన్ రాణించగలగాలి. కచ్చితంగా మిగతా మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన ఇస్తాం’అంటూ భరత్ అరుణ్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్ గురువారం వెస్టిండీస్‌తో తలపడనుంది. -
సిరాజ్ త్వరగా నేర్చుకుంటాడు
సాక్షి, హైదరాబాద్: పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించారు. సొంతగడ్డపై శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న రెండో టెస్టులో అతడిని ఆడించే విషయమై స్పష్టత ఇవ్వకున్నా... ఈ హైదరాబాదీ బౌలర్ ఏ విషయాన్నైనా వెంటనే నేర్చుకునే రకమని కొనియాడారు. ‘గతంలో హైదరాబాద్ రంజీ కోచ్‌గా పనిచేసిన నా అనుభవంతో, భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇటీవలి సిరాజ్ ప్రదర్శన చూసి చెబుతున్నా. అతడు చాలాచాలా త్వరగా నేర్చుకునే క్రికెటర్’ అని భరత్ అరుణ్ అన్నారు. బుధవారం టీమిండియా ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆటతీరు, జట్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంపైనా స్పందించారు. రాహుల్ గొప్ప ప్రతిభావంతుడని భవిష్యత్‌లో మనకు అద్భుత బ్యాట్స్‌మన్ అవుతాడని పేర్కొన్నారు. సాంకేతిక లోపాలపై కోచ్‌లు రవిశాస్త్రి, సంజయ్ బంగర్లు రాహుల్‌తో మాట్లాడుతున్నట్లు తెలిపారు.‘రొటేషన్ విధానం, మిగతా బౌలర్లు రాణిస్తుండటంతోనే ఉమేశ్ యాదవ్‌ను తప్పించాల్సి వస్తోంది. అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని వివరించారు. కూర్పులో ప్రయోగాల గురించి పెద్దగా ఆలోచించడం లేదని... అందరికీ అవకాశాలిస్తూ, మంచి బృందాన్ని మైదానంలో దింపడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జట్టులోని 16 మందిలో ఎవరైనా ఆడగలరని అన్నారు. గత మ్యాచ్‌లో పృథ్వీ షాకు అవకాశం ఇచ్చినట్లు ప్రతి టెస్టుకు కొత్త ఆటగాళ్లను దింపగల వనరులు మనకు ఉన్నాయని అన్నారు. -
ధోని రిటైర్మెంట్పై కోచ్ క్లారిటీ!
లీడ్స్: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అప్పట్లో సినిమా అభిమానులను వేధించిన ప్రశ్న.. ధోని అంపైర్ల నుంచి బంతి ఎందుకు తీసుకున్నాడు? ఇప్పుడు క్రీడా అభిమానులను గురి చేస్తున్న గందరగోళం. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో టీమిండియా వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు. దీంతో ఈ జార్ఖండ్ డైనమెట్ క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికినట్లు తీవ్రస్థాయిలో ఊహాగానాలకు తెరలేచాయి. ప్రస్తుతం ఈ సీనియర్ ఆటగాడి ఫామ్ కలవరపెట్టడం.. 2014లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్కు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్న టాపిక్ ఈ విన్నింగ్ కెప్టెన్ రిటైర్మెంట్ గురించే కావడం గమనార్హం. రవిశాస్త్రి క్లారిటీ.. ధోని రిటైర్మెంట్ ఊహాగానాలకు భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి చెక్ పెట్టాడు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్ వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెంట్ ఉద్దేశం లేదు’ అంటూ రవిశాస్త్రి ‘ధోని-బంతి’ మిస్టరీపై వివరణ ఇచ్చారు. చదవండి: ధోని రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? -
పేస్ దళాన్ని పటిష్టం చేయడమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత సీమర్ల సత్తా పెంచిన బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇప్పుడు రిజర్వ్ బెంచ్ బలగాన్ని పెంచే పనిలో పడ్డారు. వచ్చే ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్ నాటికి పటిష్ట బౌలింగ్ దళాన్ని అందుబాటులో ఉంచడమే తన లక్ష్యమని అరుణ్ చెప్పారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, విరాట్ కోహ్లిలు కూడా ప్రత్యామ్నాయాలపైనే దృష్టిపెట్టారని తెలిపారు. ప్రస్తుతం వన్డేల్లో భువనేశ్వర్, బుమ్రాలతో భారత పేస్ విభాగం పటిష్టంగానే ఉందన్నారు. అయితే ఇప్పుడు శ్రీలంకకు వెళ్లనున్న సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ఉనాద్కట్లకు నిరూపించుకునేందుకు చక్కని అవకాశం లభించిందని భరత్ చెప్పుకొచ్చారు. శార్దుల్ దక్షిణాఫ్రికాలో ఆకట్టుకున్నాడని... ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలు దేవధర్ ట్రోఫీలో ఆడుతుండటం వాళ్లకు మంచి ప్రాక్టీస్ కాగలదని తెలిపారు. ‘ఇప్పుడు సక్సెస్ అయిన వీళ్లందరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మెరుగులు దిద్దుకున్నవారే. తమ బౌలింగ్‌లో లైన్ అండ్ లెంత్‌తో పాటు నిలకడగా రాణిస్తుండటం శుభపరిణామం. ఎంత మెరుగైన ప్రదర్శన చేసినా టెస్టుల్లో తమ బౌలర్లు 20 వికెట్లు తీసినపుడే ఆ కోచ్‌కు పూర్తి సంతృప్తి కలుగుతుంది’ అని అరుణ్ అన్నారు. క్రికెట్ బాక్సింగ్ లాగే ఉంటుందని... రింగ్‌లో పంచ్‌లకు, ప్రత్యర్థులకు భయపడితే ఎప్పటికీ ఎదురీదలేమన్నారు. ‘క్రికెట్ కూడా బాక్సింగ్లాగే! భయాన్ని పక్కనబెట్టి విజయంపైనే దృష్టి పెడితే ముందడుగు వేస్తాం. మా కోచింగ్ బృందం నుంచి కేవలం సూచనలు, సలహాలే వెళతాయి. కానీ బరిలో వాటిని ఆచరించి విజయవంతమవడం ఆ బౌలర్ల చేతిలోనే ఉంటుంది’ అని అరుణ్ పేర్కొన్నారు. -
భారత ఆటగాళ్లు ఎందుకు మాస్కులు ధరించలేదు.?
న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్‌లు ధరించడంపై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తనదైన శైలిలో స్పందించారు. ఒకే మైదానంలో ఆడుతున్న ఇరు జట్లలో టీమిండియా ప్లేయర్లు ఎందుకు మాస్కులు ధరించలేదని పరోక్షంగా లంక ప్లేయర్ల డ్రామాను ప్రస్తావించారు. రెండో రోజు ఆటలో కాలుష్యంతో మైదానంలో గాలి పీల్చుకోలేకపోతున్నామని, మ్యాచ్ నిలిపివేయాలని పదేపదే లంక ఆటగాళ్లు అంపైర్లకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం భరత్ అరుణ్ మీడియాతో ముచ్చటించారు.‘ భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి రెండు రోజులుగా మాస్క్ లేకుండానే బ్యాటింగ్ చేశాడు. మ్యాచ్‌పై దృష్టి సారించి తమ జట్టు పట్టు సాధించింది. మైదానంలో ఇరు జట్లకు ఒకే పరిస్థితి ఉంది. అయినా లంక ప్లేయర్లు మాత్రమే మాస్కులు ధరించి మ్యాచ్ నిలిపేయాలని కోరారు. కాలుష్యం ఎక్కడైనా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేయదు. ఆటపై దృష్టి పెట్టడమే ఆటగాళ్ల బాధ్యత. వేదికలతో ఆటగాళ్లకు సంబంధంలేదు.’అని పరోక్షంగా లంక ఆటగాళ్లకు చరకలంటించారు. ఈ ఘటనపై లంక బోర్డు బీసీసీఐని వివరణ కోరినట్లు.. కాలుష్యం ఎక్కువగా ఉన్న ఢిల్లీని షెడ్యూల్లో ఎందుకు చేర్చినట్లు ప్రశ్నించిందని వార్తలొచ్చాయి. ఇక అంతకు ముందు లంక ప్లేయర్లు పదేపదే మ్యాచ్‌కు అంతరాయం కలిగించడంతో చిరాకెత్తిన కోహ్లి భారత ఇన్నింగ్స్‌ను 536 పరుగుల వద్ద డిక్లెర్ ఇచ్చి లంకను బ్యాటింగ్ ఆహ్వానించాడు. అయితే భారత ఆటగాళ్లు మాస్క్‌లు ధరించకుండా ఫీల్డింగ్ చేయడం గమనార్హం. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. భారీ స్కోరు దిశగా దూసుకుపోతున్న భారత్‌ను నిలువరించలేక లంక ఈ డ్రామాకు తెరలేపిందని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. -
ద్రవిడ్, జహీర్లకు షాక్!
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లకు గట్టి షాక్ తగిలింది. ఇటీవల బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లుగా నియమించబడ్డ ద్రవిడ్, జహీర్లకు అది మూన్నాళ్ల ముచ్చెటే అయ్యింది. టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి కోరినట్లే అసిస్టెంట్ కోచ్ గా సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ లను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. వీరిద్దరూ వచ్చే వరల్డ్ కప్ వరకూ కొనసాగుతారని స్పష్టం చేసింది. మరొకవైపు ఫీల్డింగ్ కోచ్ గా ఆర్ శ్రీధర్ నియామకం కూడా దాదాపు ఖరారైనట్లే కనబడుతోంది. ముందుగా సచిన్ , గంగూలీ, లక్ష్మణ్ లతో కూడిన బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్ లను రవిశాస్త్రికి సహాయకులు నియమించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రవిశాస్త్రి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనకు పెద్దగా అనుభవం లేని జహీర్ ఖాన్ వద్దంటూ పట్టుబట్టాడు. అదే సమయంలో వినోద్ రాయ్ నేతృత్వంలోని సీవోఏ కూడా ద్రవిడ్, జహీర్ ల ఎంపికపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ప్రధాన కోచ్ బాధ్యతను సీఏసీకి అప్పచెబితే, మరో ఇద్దర్ని తెరపైకి తీసుకురావడాన్ని తప్పుబట్టింది. మరొకవైపు ప్రధాన కోచ్ కే సహాయక సిబ్బందిని నియమించుకునే స్వేచ్ఛ ఉందంటూ రవిశాస్త్రికి అండగా నిలిచింది. దాంతో అనేక తర్జన భర్జనల తరువాత సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీ.. రవిశాస్త్రి కోరినట్లే భరత్ అరుణ్, సంజయ్ బంగర్‌లను ఎంపిక చేసింది. అయితే రాహుల్, ద్రవిడ్ లను విదేశీ కన్సల్టెంట్లుగా కొనసాగించాలనుకుంటే దానికి తాను అభ్యంతర చెప్పనని రవిశాస్త్రి తెలిపాడు. తనకు ఏమి కావాలో బుర్రలో ఉందన్నాడు. అయితే, ద్రవిడ్, జహీర్ లకు ఏమైనా బాధ్యతలు అప్పచెబుతారనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు. -
బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్?
న్యూఢిల్లీ: గతంలో భారత క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా పని చేసిన భరత్ అరుణ్ కు మరోసారి ఆ బాధ్యతల్ని అప్పజెప్పేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఇటీవల భారత జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రిని నియమించిన తరువాత భరత్ అరుణ్ పేరు ప్రధానంగా వినిపించింది. బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ఎంపికపై రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) సైతం దిగివచ్చింది. జహీర్ పూర్తిస్థాయి కోచ్ కాదని, కేవలం 150 రోజుల పాటు మాత్రమే బౌలింగ్ కన్సల్టెంట్ గా సేవలందిస్తాడని మాట మార్చింది. మరొకవైపు విదేశాల్లో మాత్రమే జహీర్ సేవల్ని ఉపయోగించుకుంటామని కూడా తెలిపింది. ఇందుకు కారణం బీసీసీఐ పాలకుల కమిటీ(సీవోఏ)నే. భారత ప్రధాన కోచ్ ఎంపిక బాధ్యతల్ని మాత్రమే సచిన్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీకి అప్పచెపితే, బౌలింగ్, బ్యాటింగ్ కన్సల్టెంట్ ను సైతం ప్రకటించడంపై వినోద్ రాయ్ నేతృత్వంలో సీవోఏ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో ఆ ఇద్దరి ఎంపికపై నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. ఇక్కడ కేవలం రవిశాస్త్రి ఎంపికను మాత్రమే సీవోఏ పూర్తిస్థాయి సమర్ధించింది. సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకునే బాధ్యతను ప్రధాన కోచ్ కు అప్పచెప్పాలంటూ సీఏసీకి సూచించింది. మరొకవైపు జహీర్ పూర్తిస్థాయిలో బౌలింగ్ సేవల్ని అందించడానికి కూడా సుముఖంగా లేడు. కాగా, రవిశాస్త్రి మాత్రం తనకు ఫుల్ టైమ్ కోచ్ కావాలంటూ పట్టుబడుతున్నాడు. దాంతో బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ఎంపిక ఖాయమైనట్లే కనబడుతోంది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ పాలకుల కమిటీతో రవిశాస్త్రి సమావేశమై తన నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసే అవకాశాలు కనబడుతున్నాయి.మరి రవిశాస్త్రి పంతం నెగ్గుతుందో లేదో చూడాలి. -
బౌలింగ్ కోచ్‌గా జహీర్ సరిపోడు: రవిశాస్త్రి
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కోచ్‌ల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బౌలింగ్ కోచ్ ఎంపిక పట్ల హెడ్ కోచ్ రవిశాస్త్రి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. తనకు మద్దతుగా ఉండే వ్యక్తిని బౌలింగ్ కోచ్‌గా తీసుకోవాలని రవిశాస్త్రి భావిస్తున్నాడు. గతంలో భారత బృందానికి బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్ అరుణ్‌ను తీసుకోవాలనే పట్టుపడుతున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడటానికి హెడ్ కోచ్‌గా ఎన్నికైన తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి బౌలింగ్ కోచ్ పట్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గురువారం జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో రవిశాస్త్రి మాట్లాడారు. 'జహీర్ ఉత్తమైన బౌలర్. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ బౌలింగ్ కోచ్‌గా పనిచేయడానికి కావాల్సినంత అనుభవం మాత్రం లేదని' అన్నారు. అనుభవం లేకపోతే ఏంజరుగుతుందో కోచ్‌గా పనిచేసిని కుంబ్లే విషయంలో చూశాం' అని పేర్కొన్నాడు. కానీ భరత్ అరుణ్ విషయంలో అలా కాదని విదేశాల్లో అపార అనుభవం ఉందన్నాడు. జహీర్ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుంది. అది సాధ్యపడుతుందా? అని ప్రశ్నించాడు. ఒక వేళ కోచ్‌గా పనిచేసే ఉద్దేశం ఉంటే అరుణ్‌తో కలిసి సలహాదారుడిగా పనిచేయాలని సూచించాడు. అదే విధంగా జహీర్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తన బాధ్యతలనుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను బీసీసీఐ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇదంతా బోర్డుకు వృధా ఖర్చు అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. భారత జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ఖాన్ ఎంపికైన విషయం తెలిసిందే. -
హైదరాబాద్ కెప్టెన్‌గా బద్రీనాథ్
భరత్ అరుణ్‌కు కోచ్ బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ’సి’ గ్రూప్‌లో ఉన్న హైదరాబాద్ జట్టు కొత్త ఏడాది కొత్త కెప్టెన్ నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. భారత జట్టు మాజీ ఆటగాడు, తమిళనాడు వెటరన్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ 2015-16 సీజన్లో హైదరాబాద్ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు. 136 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనుభవం ఉన్న 36 ఏళ్ల బద్రీనాథ్ ప్లేయర్ కం మెంటర్‌గా వ్యవహరించనున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్‌గా ఉన్న హనుమ విహారి ఈసారి ఆంధ్రాకు తరలి వెళ్లిపోయాడు. అయితేమరో రాష్ట్రానికి చెందిన ఆటగాడిని ఇలా మెంటర్ పేరుతో నాయకత్వ బాధ్యతలు అప్పగించడం హైదరాబాద్ జట్టుకు ఇదే మొదటిసారి. ఆంధ్రా జట్టు కూడా వరుసగా రెండు సీజన్లు సీనియర్లు అమోల్ మజుందార్, మొహమ్మద్ కైఫ్‌లను ఇలాగే తీసుకుంది. అనుభవం తక్కువగా ఉన్న తమ యువ క్రికెటర్లను నడిపించేందుకు సీనియర్ ఆటగాడి అవసరం ఉందంటూ హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ విజ్ఞప్తి చేయడంతో అతను హైదరాబాద్ తరఫున ఆడేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తమిళనాడు జట్టు తర్వాత గత రెండేళ్లు విదర్భ తరఫున ఆడిన బద్రీనాథ్... వాస్తవానికి తమిళనాడు బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పోటీ పడినా అవకాశం దక్కలేదు. భారత్ తరపున బద్రీనాథ్ 2 టెస్టులు, 7 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. 136 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 56.19 సగటుతో 9,778 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నారుు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతను కరైకుడి కాలై జట్టు తరఫున ఆడుతున్నాడు. అరుణ్‌కు అవకాశం... జట్టు కోచ్ పదవి కోసం కూడా హెచ్‌సీఏ పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇంటర్వ్యూల అనంతరం భరత్ అరుణ్‌ను ఎంపిక చేసినట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు అయూబ్ వెల్లడించారు. మీడియం పేస్ బౌలర్ అరుున అరుణ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ వరకు భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించారు. భారత్ తరఫున 2 టెస్టులు, 4 వన్డేలు ఆడిన ఆయన 48 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 110 వికెట్లు పడగొట్టారు. -
బరిందర్‌కు భలే చాన్స్.. తొలి వన్డేలో చోటు!
పెర్త్: ఫాస్ట్ బౌలర్ బరిందర్ స్రాన్ భలే చాన్స్ కొట్టేశాడు. ఈ నెల 12న పెర్త్‌లో జరుగనున్న భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా మారింది. లెఫ్ట్ ఆర్మర్ అయిన ఈ 23 ఏళ్ల బౌలర్ టీమిండియాకు అదనపు బలం కానున్నాడని, స్రాన్ను మంగళవారం జరిగే తొలి వన్డేలో ఆడించే అవకాశముందని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపారు. 'అతను మంచి శక్తిసామర్థ్యాలున్న బౌలర్. ఆడిన రెండు వార్మప్ మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతను లెఫ్ట్ ఆర్మర్ కావడం జట్టుకు అదనపు బలం. భవిష్యత్తులో ఓ మంచి బౌలర్‌ను తయారుచేయడానికి అవసరమైన వ్యక్తి దొరికాడని మేం భావిస్తున్నాం' అని అరుణ్ విలేకరులకు తెలిపారు. శుక్రవారం, శనివారం వెస్ట్రర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ట్వంటీ-20, వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయాలు సాధించి.. ఇనుమడించిన ఉత్సాహంతో వన్డేలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారత జట్టులో కీలక బౌలర్‌గా భావిస్తున్న మొహమ్మద్ షమీ గాయం కారణంగా వైదొలగడం.. కూడా బరిందర్ స్రాన్‌కు బాగా కలిసి వచ్చింది. -
ఇద్దరు మనోళ్లే!
భరత్ అరుణ్... రామకృష్ణన్ శ్రీధర్... భారత్‌కు అండర్-19 ప్రపంచకప్‌ను గెలిపించిన కోచ్‌లు. ఇప్పుడు ఈ సక్సెస్ఫుల్ జోడీని సీనియర్ జట్టుకు అండగా నిలిచేందుకు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ ఇద్దరికీ యాదృచ్ఛికంగా తెలుగు రాష్ట్రాలతో అనుబంధం ఉంది. కెరీర్ ఆసాంతం తమిళనాడుకే ఆడినా... అరుణ్ పుట్టింది విజయవాడలో. అలాగే మైసూర్లో పుట్టినా... శ్రీధర్ తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్ మొత్తం హైదరాబాద్ తరఫునే ఆడి ప్రస్తుతం ఆంధ్ర జట్టుకు కోచ్‌గా ఎంపికయ్యాడు. 2012లో అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టుకు అరుణ్ చీఫ్ కోచ్ కాగా, శ్రీధర్ అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు. - సాక్షి క్రీడావిభాగం ఆర్. శ్రీధర్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 44 ఏళ్ల ఆర్. శ్రీధర్ హైదరాబాద్ తరఫున దాదాపు 12 ఏళ్ల కెరీర్లో 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 91 వికెట్లు పడగొట్టాడు. 15 లిస్ట్ ‘ఎ’ మ్యాచుల్లో 14 వికెట్లు తీశాడు. ఆటగాడిగా ఉన్న సమయంలో దేశవాళీలో అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001నుంచే కోచింగ్ వైపు మళ్లి, సుదీర్ఘ కాలం పాటు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచ్‌లలో ఒకడిగా శ్రీధర్ పని చేశాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన అతను, ఈ ఏడాది కూడా అదే బాధ్యత నిర్వర్తించాడు. ఐపీఎల్-7లో పంజాబ్ ఫీల్డింగ్ కోచ్‌గా పని చేసిన తర్వాత శ్రీధర్‌కు ఒక్కసారిగా ప్రత్యేక గుర్తింపు దక్కింది. అనంతరం ఈ సీజన్ కోసం ఆంధ్ర జట్టు కోచ్‌గా కూడా ఎంపిక చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా బీసీసీఐ నుంచి పిలుపు రావడంతో తొలిసారి భారత సీనియర్ జట్టుతో కలిసి పని చేసే అవకాశం లభించింది. భరత్ అరుణ్ పేస్ బౌలర్ అయిన అరుణ్ 1979లో రవిశాస్త్రి కెప్టెన్సీలో శ్రీలంకలో పర్యటించిన అండర్-19 జట్టు సభ్యుడిగా తొలిసారి గుర్తింపు తెచ్చుకున్నాడు. 1986-87లో భారత్ తరఫున కేవలం 2 టెస్టులు ఆడిన అతను 4 వికెట్లు తీశాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 48 మ్యాచ్‌ల్లో 110 వికెట్లు పడగొట్టాడు. లోయర్ ఆర్డర్లో మంచి బ్యాట్స్‌మన్‌గా కూడా గుర్తింపు ఉన్న అరుణ్ 1987-88లో రంజీ ట్రోఫీ గెలిచిన తమిళనాడు జట్టులో సభ్యుడు. ఆ తర్వాత దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో సౌత్‌జోన్ తరఫున సెంచరీ (149) చేయడంతో పాటు డబ్ల్యూవీ రామన్‌తో కలిసి 221 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం అతని కెరీర్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన. 2008నుంచి ఇటీవలి వరకు ఎన్సీఏలో కోచ్‌గా ఉన్న అరుణ్... ప్రస్తుతం తమిళనాడు క్రికెట్ అకాడమీ కోచింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. 2012లో అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు కోచ్‌గా ఉన్న అతను ఈ ఏడాది కూడా టీమ్‌కు కోచ్‌గా వ్యవహరించాడు.