కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.
చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.
విజయం పరిపూర్ణం.. వారే కారణం
ఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది.
క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్‌దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.
గంభీర్‌ను మెంటార్‌గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్‌లు కూడా ప్రధాన కారణం.
ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్
దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్‌వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.
ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్‌గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.
వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్
కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్‌కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.
‘‘అభిషేక్ నాయర్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్‌పై అభిమానం చాటుకున్నాడు.
ఆ శక్తి మరెవరో కాదు
ఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.
𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆
Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024
చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment