Chandrakant Pandit
-
గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది.క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్‌దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్‌ను మెంటార్‌గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్‌లు కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్‌వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్‌గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్ నాయర్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్‌పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన -
క్లిష్ట పరిస్థితుల్లో తానున్నాంటూ బాధ్యత తీసుకున్నాడు! అందరికీ సాధ్యం కాదు!
IPL 2023 KKR- Venkatesh Iyer: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రాణాపై ఆ జట్టు ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ప్రశంసలు కురిపించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ తానున్నానంటూ సారథిగా బాధ్యతలు భుజాన వేసుకున్నాడని కొనియాడాడు. కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల గౌరవం, అభిమానం పొందాడని.. అతడి విజయాల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నాడు. అయ్యర్ దూరం కావడంతో ఐపీఎల్-2023కు ముందు కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్ సందర్భంగా వెన్ను నొప్పి తిరగబెట్టడంతో టీమిండియాకు దూరమైన అతడు.. ఐపీఎల్ తాజా ఎడిషన్ మొత్తానికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ నేపథ్యంలో శ్రేయస్ స్థానంలో నితీశ్ రాణాకు కేకేఆర్ పగ్గాలు అప్పగిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన చేసింది. అతడెందుకని విమర్శలు కెప్టెన్సీ రేసులో సీనియర్ సునిల్ నరైన్, శార్దూల్ ఠాకూర్ పేర్లు వినిపించినప్పటికీ.. మేనేజ్మెంట్ రాణా వైపు మొగ్గు చూపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఈ క్రమంలో నరైన్, సౌథీ వంటి సీనియర్లను కాదని రాణాను సారథిగా నియమించడం సరికాదంటూ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే, దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపిస్తున్న నితీశ్ రాణాకు అతడి అభిమానులు మద్దతుగా నిలిచారు. కౌంటర్ అటాక్‌తో అతడిని విమర్శిస్తున్న వాళ్లకు సమాధానమిచ్చారు. ఇలాంటి పరిస్థితుల నడుమ కేకేఆర్ పగ్గాలు చేపట్టాడు నితీశ్ రాణా. బ్యాటర్‌గా రాణిస్తున్నాడు బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ.. కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌లలో కేకేఆర్ కేవలం నాలుగింట మాత్రమే గెలుపొంది పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో తప్పక గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కేకేఆర్ ప్లే ఆఫ్స్ చేరుకోలేదు. ఈ నేపథ్యంలో నితీశ్ రాణా గురించి ఆ జట్టు ఓపెనర్, సెంచరీ వీరుడు వెంకటేశ్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పంజాబ్ కింగ్స్‌తో మే 8 నాటి మ్యాచ్ నేపథ్యంలో ఇండియా టుడే ముచ్చటించాడు అయ్యర్. ఈ సందర్భంగా కెప్టెన్ నితీశ్ రాణా, కోచ్ చంద్రకాంత్ పండిట్ గురించి ప్రశ్న ఎదురైంది. చందూ సర్ కోచ్‌గా రావడం సంతోషం ఇందుకు బదులిస్తూ.. ‘‘గతంలో చందూ సర్‌తో మూడేళ్లపాటు కలిసి ప్రయాణం చేశాను. ఇప్పుడు ఆయనే ఐపీఎల్ కోచ్‌గానూ రావడం బాగుంది. ఈ విషయంలో నాకు సంతోషంగానూ.. గర్వంగానూ ఉంది. ఇక నితీశ్ రాణా విషయానికొస్తే.. శ్రేయస్ అయ్యర్ గాయపడిన సమయంలో జట్టును నడిపించేందుకు అతడు ముందుకు వచ్చాడు. శ్రేయస్ సేవలు కోల్పోయి జట్టు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ బాధ్యత తను తీసుకున్నాడు. అతడికి సాధ్యమైంది నా వరకు కెప్టెన్‌గా అతడు బాగానే రాణిస్తున్నాడు. డ్రెస్సింగ్ రూంలో ప్రతీ ఆటగాడితో మమేకం అవుతాడు. అందరూ అతడి పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. కెప్టెన్‌గా అందరితో కలిసిపోవడం కొంతమందికే సాధ్యమవుతుంది. రాణా కూడా వారిలో ఒకడు’’ అని మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీజన్లో వెంకటేశ్ ఇప్పటి వరకు 303 పరుగులు చేయగా.. నితీశ్ రాణా 275 పరుగులు సాధించాడు. చదవండి: సన్‌రైజర్స్ విజయంపై డేవిడ్ వార్నర్ ట్వీట్! మెచ్చుకున్నాడా? లేదంటే.. -
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. కార్తీక్కే చుక్కలు! ఎవరీ సుయాష్ శర్మ?
కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ స్పిన్నర్ సుయాష్ శర్మ తన ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సుయాష్ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాష్ తన బౌలింగ్ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్ దినేష్ కార్తీక్‌ను ఓ అద్భుతమైన బంతితో సుయాష్ ట్రాప్ చేశాడు. ప్లాన్ ప్రకారం ఔట్‌సైడ్ ఆఫ్ బంతిని బంతిని వేసి.. కార్తీక్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక తన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన సుయాష్ శర్మ గురుంచి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఎవరీ సుయాష్ శర్మ? 19 ఏళ్ల సుయాష్ శర్మ ఢిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు అతడు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాలేదు. అతడు ఇప్పటివరకు ఢిల్లీ అండర్-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాష్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. కాగా కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్ కావడం విశేషం. ఇక గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్-2023 మినీవేలంతో సుయాష్ శర్మను రూ.20లక్షల కనీస ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆర్సీబీతో మ్యాచ్‌లోకి వచ్చిన సుయాష్ శర్మ కేకేఆర్ మెన్‌జెమెంట్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కాగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సుయాష్ శర్మపై కేకేఆర్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక మిస్టరీ స్పిన్నర్ అని చంద్రకాంత్ కొనియాడాడు. చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌లోకి ఆస్ట్రేలియా స్టార్ బౌలర్.. ఎవరంటే? Anuj Rawat ☑️ Dinesh Karthik ☑️ Watch Suyash Sharma pick two quick wickets in his debut game. Live - https://t.co/V0OS7tFZTB #TATAIPL #KKRvRCB #IPL2023 pic.twitter.com/3igG1jDWb4 — IndianPremierLeague (@IPL) April 6, 2023 -
'ఆ ఐడియా నాదే.. బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపిస్తున్నా'
ఐపీఎల్లో రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్ బుధవారం తమ జట్టు కొత్త హెడ్‌కోచ్‌గా రంజీ దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆరుసార్లు రంజీ ట్రోపీ గెలిపించిన కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కొత్త చరిత్ర సృష్టించాడు. కోచ్‌గా సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడంతోనే కేకేఆర్ సగం సక్సెస్ అయిందని.. ఇక ఈసారి కచ్చితంగా కేకేఆర్ టైటిల్ కొట్టబోతుందని అభిమానులు పేర్కొన్నారు. కాగా చంద్రకాంత్ పండిట్ నియామకంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్న వేళ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మధ్య ఒక ఆసక్తికర సంభాషణ నడిచింది. విషయంలోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్ రంజీ ట్రోపీ-2022 విజేతగా అవతరించిన సంగతి తెలిసిందే. ఈ విజయం వెనుక మధ్యప్రదేశ్ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్ర కీలకం. ఒకప్పుడు కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్‌గా తన కలను నెరవేర్చుకున్నాడు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్ అభినందిస్తూ ఒక ట్వీట్ చేశాడు.'' కంగ్రాట్స్ మధ్యప్రదేశ్.. రంజీ ట్రోపీ గెలిచినందుకు. చంద్రకాంత్ పండిట్ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అతనికి ఐపీఎల్ కోచ్‌గా కాంట్రాక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది'' అని ట్వీట్ చేశాడు. తాజాగా కేకేఆర్ కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ ఎంపికైన నేపథ్యంలో ఆ జట్టు సీఈవో వెంకీ మైసూర్... ఇర్ఫాన్ పఠాన్ పాత ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. ''ఇర్ఫాన్ భయ్యా.. మీ మాటలు విన్నాం.. అందుకే'' అంటూ లాఫింగ్ ఎమోజీ షేర్ చేశాడు. దీనిపై ఇర్ఫాన్ స్పందిస్తూ.. ''హాహా.. వెంకీబాయ్ ఉన్నా.. మీకు(వెంకీ మైసూర్).. అలాగే కొత్త కోచ్‌గా వచ్చిన చందు భాయికి(చంద్రకాంత్ పండిట్) ఆల్ ది బెస్ట్. అలాగే చందు భయ్యాను కోచ్‌గా తీసుకోవాలనే ఐడియా నేనే ఇచ్చా.. అందుకే నా బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపతున్నా'' అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. చదవండి: Chandrakanth Pandit: కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా! IND vs ZIM: ఆరు నెలల తర్వాత రీ ఎంట్రీ.. బ్యాటర్లకు చుక్కలు చూపించిన చాహర్! -
కొత్త కోచ్‌గా రంజీ దిగ్గజం.. కేకేఆర్ దశ మారనుందా!
రెండుసార్లు ఐపీఎల్ విజేత అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) తమ కొత్త కోచ్‌గా దిగ్గజ రంజీ కోచ్ చంద్రకాంత్ పండిట్‌ను ఎంపిక చేసింది. ఈ మేరకు నైట్‌రైడర్స్ యాజమాన్యం బుధవారం ట్విటర్ వేదికగా ప్రకటన చేసింది. కేకేఆర్ రెగ్యులర్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెక్కల్లమ్.. ఈ ఏడాది ఇంగ్లండ్ హెడ్ కోచ్‌గా వెళ్లిపోవడంతో అప్పటినుంచి నిఖార్సైన కోచ్ గురించి వెతుకులాటలో ఉంది కేకేఆర్. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోపీలో మధ్యప్రదేశ్ తొలిసారి రంజీ విజేతగా అవతరించడంలో కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు రంజీ క్రికెట్లో అత్యంత సూపర్ సక్సెస్ కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ప్రస్తుత తరుణంలో హెడ్‌కోచ్‌గా చంద్రకాంత్ పండిట్ సరైనవాడని కేకేఆర్ అభిప్రాయపడుతోంది. అందుకే చంద్రకాంత్ పండిట్‌ను ఏరికోరి కేకేఆర్ కోచ్‌గా తీసుకొచ్చింది. ఇదే విషయమై కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. '' దేశవాలీ దిగ్గజ కోచ్ చంద్రకాంత్ కేకేఆర్ ఫ్యామిలీలోకి రావడం మమ్మల్ని ఉత్సాహపరిచింది. కోచ్ పాత్రలో మా జట్టును విజయవంతంగా నడిపించాలని.. జర్నీ సాఫీగా సాగిపోవాలని కోరకుంటున్నా. ఆట పట్ల అతనికున్న అంకితభావం, నిబద్ధత.. మరెవరికి లేదు. అందుకే దేశవాలి క్రికెట్లో దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. మా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు విలువైన సలహాలు ఇస్తూ ఐపీఎల్ టైటిల్ అందించాలని కోరుతున్నా అంటూ తెలిపాడు. ఇక చంద్రకాంత్ పండిట్ టీమిండియా తరపున 1986-92 వరకు ప్రాతినిధ్యం వహించాడు. భారత్ తరపున చంద్రకాంత్ 5 టెస్టులు, 23 వన్డేలు ఆడాడు. టీమిండియా ఆటగాడిగా అంతగా సక్సెస్ కాలేకపోయిన చంద్రకాంత్ పండిట్ రంజీ కోచ్‌గా సూపర్ సక్సెస్ అయ్యాడు. చంద్రకాంత్ రంజీ కోచ్‌గా అడుగుపెట్టాకా ముంబైని(2002-03, 2003-04,2015-16) మూడుసార్లు, విదర్భను(2017-18, 2018-19) రెండుసార్లు రంజీ చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా మధ్యప్రదేశ్‌ను తొలిసారి రంజీ విజేతగా నిలిపి చంద్రకాంత్ దిగ్గజ కోచ్‌గా అవతరించాడు. ఇక గౌతమ్ గంభీర్ నేతృత్వంలో 2012, 2014లో చాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. మరోసారి కప్ కొట్టడంలో విఫలమైంది. అయితే 2021లో ఇయాన్ మోర్గాన్ సారధ్యంలో ఫైనల్ చేరినప్పటికి.. సీఎస్కే చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఇక 2022 ఐపీఎల్ సీజన్లో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్లేఆఫ్ చేరడంలో విఫలమైన కేకేఆర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. 🚨 We have a new HEAD COACH! Welcome to the Knight Riders Family, Chandrakant Pandit 💜👏🏻 pic.twitter.com/Eofkz1zk6a — KolkataKnightRiders (@KKRiders) August 17, 2022 చదవండి: Ranji Trophy 2022 Final: కెప్టెన్‌గా సాధించలేనిది కోచ్ పాత్రలో.. అందుకే ఆ కన్నీళ్లు