Who is Suyash Sharma, KKR Coach Chandrakant Pandit Impressed With Mystery Spinner - Sakshi
Sakshi News home page

IPL 2023: తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు.. కార్తీక్‌కే చుక్కలు! ఎవరీ సుయాష్‌ శర్మ?

Published Fri, Apr 7 2023 10:58 AM | Last Updated on Fri, Apr 7 2023 11:49 AM

Who is Suyash Sharma,Chandrakant Pandit impressed with mystery spinner  - Sakshi

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ స్పిన్నర్‌ సుయాష్‌ శర్మ తన ఐపీఎల్‌లో అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సుయాష్‌ శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సుయాష్‌ తన బౌలింగ్‌ స్కిల్స్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.

ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటర్ దినేష్‌ కార్తీక్‌ను ఓ అద్భుతమైన బంతితో సుయాష్‌ ట్రాప్‌ చేశాడు. ప్లాన్‌ ప్రకారం ఔట్‌సైడ్‌ ఆఫ్‌ బంతిని బంతిని వేసి.. కార్తీక్‌ను పెవిలియన్‌కు పంపాడు.  ఇక తన తొలి మ్యాచ్‌లో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించిన సుయాష్‌ శర్మ గురుంచి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.
ఎవరీ సుయాష్ శర్మ?
19 ఏళ్ల సుయాష్ శర్మ ఢిల్లీలో జన్మించాడు. ఇప్పటివరకు అతడు ఏ దేశవాళీ జట్టుకు ఎంపిక కాలేదు. అతడు ఇప్పటివరకు ఢిల్లీ అండర్‌-25 పురుషుల స్టేట్-ఎ ట్రోఫీలో మాత్రమే ఆడాడు. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన సుయాష్ కేవలం 2వికెట్లు పడగొట్టాడు. కాగా కేకేఆర్‌తో ఆడిన మ్యాచే అతడికి తొలి ప్రొఫెషనల్ గేమ్‌ కావడం విశేషం. ఇక గతేడాది ఆఖరిలో జరిగిన ఐపీఎల్‌-2023 మినీవేలంతో సుయాష్ శర్మను రూ.20లక్షల కనీస ధరకు కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఆర్సీబీతో మ్యాచ్‌లోకి వచ్చిన సుయాష్ శర్మ కేకేఆర్‌ మెన్‌జెమెంట్‌ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. కాగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన సుయాష్ శర్మపై కేకేఆర్‌ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ సైతం ప్రశంసల వర్షం కురిపించాడు. అతడొక మిస్టరీ స్పిన్నర్‌ అని చంద్రకాంత్ కొనియాడాడు.
చదవండిIPL 2023: ముంబై ఇండియన్స్‌లోకి ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌.. ఎవరంటే?


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement