
క్రికెట్ ప్రేమికులు ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్(IPL 2025) 18వ సీజన్ షెడ్యూల్‌ను పాలక మండలి ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ప్రారంభం కానునున్నట్లు సమాచారం. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ మొదటి మ్యాచ్‌లో మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. అదే రోజు ఆదివారం చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరుగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది.
మే 25న ఫైనల్‌కు కూడా కోల్‌కతానే వేదిక కానుండగా... క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో పది టీమ్‌ల సొంత మైదానాలతో పాటు రెండు ఇతర వేదికలు (ధర్మశాల, గువహటి) కలిపి మొత్తం 12 చోట్ల లీగ్‌ను నిర్వహిస్తారు.
రాజస్తాన్ రాయల్స్ టీమ్‌కు గువహటి తమ రెండో సొంత వేదిక కాగా...ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడుతుంది. అయితే ఐపీఎల్ వర్గాల నుంచి మాత్రం అధికారికంగా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారింగా షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.
ఆర్సీబీ కెప్టెన్‌గా పాటిదార్..
తాజాగా ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్‌గా మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌ను ఎంపిక చేసింది. అంతా విరాట్ కోహ్లి తిరిగి ఆర్సీబీ పగ్గాలు చేపడతాడని భావించారు. కానీ అందుకు కోహ్లి సముఖత చూపలేదని, పాటిదార్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు చేపడతారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రెండు ఫ్రాంచైజీలు గత సీజన్‌లో తమ కెప్టెన్‌లగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్‌ను మెగా వేలంలోకి విడిచిపెట్టాయి. అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా నియమితుడయ్యాడు.
చదవండి: ఆఖరి బంతికి ఢిల్లీ గెలిచింది
Comments
Please login to add a commentAdd a comment