
ఐపీఎల్-2025 సీజన్‌కు రంగం సిద్దమైంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం కోల్‌కతా నగరం "ఆరెంజ్ అలర్ట్"లో ఉంది. ఈ క్యాష్‌రిచ్ లీగ్ ప్రారంభం రోజున, అంటే మార్చి 22 (శనివారం) గరిష్టంగా 80 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అక్కడి వాతవారణ శాఖ పేర్కొంది. శనివారం ఉదయం నుంచి పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచే ఛాన్స్ ఉంది.
ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అంతకంటే ముందు అక్కడ వర్షం కురిసే సూచనలు కన్పిస్తున్నాయి. అదేవిధంగా ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీకి కూడా ఆటంకం కలిగే అవకాశముంది.
కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ రోజున వర్ష శాతం అంచనా(అక్యూ వెదర్ ప్రకారం)
7-8PM- 10%
8-9 PM- 50%
9-10PM-70%
10-11 PM- 70%
కేకేఆర్: అజింక్యా రహానే (కెప్టెన్), రింకు సింగ్, క్వింటన్ డి కాక్, రహ్మానుల్లా గుర్బాజ్, అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, అన్రిచ్ నార్ట్జే, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, స్పెన్సర్ జాన్సన్, లవ్‌నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్, మొయిన్ అలీ, చేతన్ సకారియా
ఆర్సీబీ: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భాండాగే, జాకబ్ బెతేల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికార, లుంగి ఎన్గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ
చదవండి: IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. బౌలర్లకు పండగే?
Comments
Please login to add a commentAdd a comment