Abhishek Nayar
-
Ind vs Aus: వ్యూహం మార్చిన టీమిండియా!.. అందుకే గిల్‌పై వేటు
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్థాయికి తగ్గట్లుగా రాణించడం లేదు. పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో భారీ విజయం సాధించినా.. ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. అడిలైడ్ పింక్ బాల్ మ్యాచ్‌లో పది వికెట్ల తేడాతో చిత్తైన రోహిత్ సేన.. బ్రిస్బేన్ టెస్టులో వర్షం వల్ల ఓటమి నుంచి తప్పించుకుందనే విమర్శలు మూటగట్టుకుంది.ఈ క్రమంలో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, తొలి రోజు ఆటలో మాత్రం టీమిండియాకు కలిసిరాలేదు. టాస్ ఓడి తొలుత బౌలింగ్‌కు దిగిన భారత్.. ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు ఆపసోపాలు పడాల్సి వచ్చింది.ఆఖరి సెషన్లో భారత బౌలర్లు ప్రభావం చూపినా.. అప్పటికే కంగారూలు పైచేయి సాధించారు. మెల్బోర్న్లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. గురువారం నాటి మొదటిరోజు ఆట ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో.. మెల్బోర్న్ టెస్టులో టీమిండియా తమ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.అందుకే గిల్‌పై వేటు..ఇప్పటికే శుబ్‌మన్ గిల్(Shubman Gill)పై వేటు వేసిన యాజమాన్యం.. రెగ్యులర్ ఓపెనింగ్ జోడీతోనే బరిలోకి దిగనుంది. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘‘పిచ్ పరిస్థితులకు అనుగుణంగానే శుబ్‌మన్ గిల్‌ను తప్పించి.. వాషింగ్టన్ సుందర్‌ను తుదిజట్టులోకి తీసుకున్నాం.ఓపెనర్‌గా మళ్లీ అతడేవాషీ కోసం గిల్ త్యాగం చేయాల్సి వచ్చింది. జట్టు ప్రయోజనాల కోసం మేము తీసుకున్న నిర్ణయాన్ని అతడు గౌరవించాడు. ఇక రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్లోనూ మార్పు ఉంటుంది. అతడు భారత్ తరఫున ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు’’ అని అభిషేక్ నాయర్ మీడియాతో పేర్కొన్నాడు.కాగా పితృత్వ సెలవుల కారణంగా రోహిత్ శర్మ(Rohit Sharma) తొలి టెస్టుకు దూరం కాగా.. బుమ్రా సారథ్యంలో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. అయితే, రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చినా అదే జోడీని కొనసాగించగా.. రోహిత్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడు.వ్యూహం మార్చిన టీమిండియాకానీ రెండు టెస్టుల్లోనూ రోహిత్(3, 6, 10) విఫలమయ్యాడు. కెప్టెన్‌గానూ అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో రోహిత్ మెల్బోర్న్లో తన రెగ్యులర్ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగనుండగా.. గిల్ ఆడే మూడో స్థానంలో కేఎల్ రాహుల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం.. ఆతిథ్య జట్టుతో కలిసి 1-1తో సమంగా ఉంది.చదవండి: గల్లీ క్రికెట్ ఆడుతున్నావా?.. చెప్పింది చెయ్: రోహిత్ శర్మ ఫైర్ -
అతడిని జట్టులోకి తీసుకున్నారా?.. టీమిండియా కోచ్ క్లారిటీ
న్యూజిలాండ్‌తో మూడో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ గురించి తాము ఆలోచించడం లేదని.. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ముంబై మ్యాచ్‌పైనే ఉందని తెలిపాడు. అదే విధంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల విషయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని సూచించాడు. రోహిత్ సేనకు ఊహించని షాకులుగొప్ప ఆటగాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో ఫామ్‌లేమితో సతమతమయ్యారన్న అభిషేక్ నాయర్.. రోహిత్- కోహ్లి తిరిగి పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో రోహిత్ సేనకు ఊహించని షాక్ తగిలింది.బెంగళూరులో కివీస్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన భారత్.. పుణెలో 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 0-2తో సిరీస్ కోల్పోయింది. ఫలితంగా స్వదేశంలో టీమిండియా పన్నెండేళ్ల టెస్టు సిరీస్ జైత్రయాత్రకు తెరపడింది. ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబై వేదికగా జరుగనున్న మూడో టెస్టు భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. వైట్‌వాష్ నుంచి తప్పించుకోవాలంటే గెలిచి తీరాలి లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలి.జట్టులో మార్పులేమీ లేవుఈ నేపథ్యంలో యువ పేసర్ హర్షిత్ రాణాను మూడో టెస్టులో బరిలోకి దించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వీటిని ఖండించాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జట్టులో మార్పులేమీ లేవు. ఎవరినీ కొత్తగా చేర్చడం లేదు. ప్రతీ వారం.. ప్రతీ రోజు మాకు కీలకమే. డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇప్పుడు మా దృష్టి మొత్తం ఈ మ్యాచ్ మీదే ఉంది’’ అని అభిషేక్ నాయర్ తెలిపాడు.ఫామ్‌లోకి వస్తారనే నమ్మకం ఉందిఅదే విధంగా.. కివీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్- కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘ప్రస్తుతం వాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఓపికపట్టాలి కూడా! గొప్ప గొప్ప ఆటగాళ్ల కెరీర్లో ఇలా జరిగింది. ఇప్పుడు వాళ్ల టైమ్ బాగా లేకపోవచ్చు. అయితే, త్వరలోనే తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉంది’’ అని అభిషేక్ నాయర్ విరాహిత్ ద్వయాన్ని సమర్థించాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన జట్టులో హర్షిత్ రాణాకు చోటు దక్కింది.చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్ టూర్‌కు ఎంపికైన పేసర్ -
ట్విస్ట్ ఇచ్చిన గంభీర్!.. ఆ విషయంలో నో క్లారిటీ
భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు పయనమైంది. టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్ తదితరులు సోమవారం ముంబై నుంచి విమానంలో బయల్దేరారు.ఇక లంకకు ప్రయాణమయ్యే ముందు టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోచింగ్ సహాయక సిబ్బంది గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.వారికే పెద్దపీటబ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాలకు వేర్వేరు కోచ్‌లు ఉన్నా.. అన్నింటిలోనూ ప్రావీణ్యం చూపగలిగే సిబ్బందికే తాను పెద్దపీట వేస్తానని పేర్కొన్నాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటేలను అసిస్టెంట్ కోచ్‌లుగా శ్రీలంకకు వస్తున్నట్లు గంభీర్ అధికారికంగా వెల్లడించాడు.‘‘నేను కోరుకున్నట్లుగానే బీసీసీఐ చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించినందుకు సంతోషంగా ఉంది. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే క్లారిటీఅయితే, శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాతే సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అభిషేక్ నాయర్, సాయిరాజ్ బహుతులే, దిలీప్ జట్టుతో పాటు శ్రీలంక వస్తున్నారు.డష్కాటే కొలంబోలో మాతో చేరతాడు. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లే. వీళ్లిద్దరు నా సహాయకులుగా ఉండటం మంచి విషయం. అయితే, వాళ్లు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారో శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే తేలుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా మెంటార్‌గా గౌతం గంభీర్ వ్యవహరించగా.. అభిషేక్ నాయర్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదేళ్ల తర్వాత ఆ జట్టు మరోసారి చాంపియన్‌గా నిలిచింది.ఈ విజయంలో కీలక పాత్ర గంభీర్దేనంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. శ్రీలంకతో జూలై 27న మొదలుకానున్న టీ20 సిరీస్‌తో కోచ్‌గా గంభీర్ తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు. చదవండి: అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు#WATCH | Mumbai | Indian Men's Cricket Team arrives at the Airport, they'll leave for Sri Lanka, shortly.Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/ZmBmBqLasH— ANI (@ANI) July 22, 2024 -
టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లు వీరే.. దిలీప్ రీఎంట్రీ!
టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్థానం మొదలుకానుంది. శ్రీలంక పర్యటనలో భాగంగా అతడు భారత జట్టుకు మార్గనిర్దేశనం చేయనున్నాడు.ఈనెల 27 నుంచి ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో గౌతీ సహాయక సిబ్బంది కూడా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ టెన్ డష్కాటే టీమిండియా అసిస్టెంట్ కోచ్‌లుగా పనిచేయనున్నట్లు తెలుస్తోంది.దిలీప్ రీఎంట్రీ!అదే విధంగా.. రాహుల్ ద్రవిడ్ హయాంలో ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన టి.దిలీప్ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, బౌలింగ్ కోచ్ విషయంలో మాత్రం ఇంకా చర్చలు కొలిక్కిరానట్లు సమాచారం.సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రిక్‌బజ్ కథనం ప్రచురించింది. బీసీసీఐ సన్నిహిత వర్గాల నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొంది.కాగా మోర్నే మోర్కెల్ సైతం గంభీర్‌తో గతంలో కలిసి పనిచేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గౌతీ రెండేళ్లు సేవలు అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోర్నే మోర్కెల్ కూడా లక్నో సిబ్బందిలో ఉండటం గమనార్హం.ఇక శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుతో గంభీర్‌తో పాటు దిలీప్, నాయర్ కూడా సోమవారం బయల్దేరనున్నట్లు సమాచారం. టెన్ డష్కాటే మాత్రం తర్వాత జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది.ఆరోజే గంభీర్ ప్రెస్మీట్టీ20, వన్డే సిరీస్‌ల కోసం టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబై నుంచి కొలంబోకు సోమవారం పయనం కానున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ సిరీస్‌తో గంభీర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టనుండగా.. లంకకు వెళ్లే ముందు అతడు మీడియా ముందుకు రానున్నాడని తెలిపింది.టీ20 కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా టీమిండియా శ్రీలంకతో మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. టీ20 జట్టుకు సూర్య, వన్డే జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నారు. -
రోహిత్ శర్మ పొట్ట.. మ్యాగీ మ్యాన్ అంటూ హేళనలు! కట్‌చేస్తే..
‘‘2011 ప్రపంచకప్ జట్టుకు రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. ఆ సమయంలో నేను తనతో మాట్లాడాను. అప్పటికి కాస్త అధిక బరువుతో ఉన్నాడు.ఓ యాడ్‌లో యువరాజ్ సింగ్‌తో కలిసి నటించాడు. టీవీలో చూసిన ఆ యాడ్‌ను నేను ఎప్పటికీ మర్చిపోను. అందులోని ఓ విజువల్ కట్ చేసి రోహిత్ టమ్మీ(పొట్ట) చుట్టూ ఓ గీత గీశారు. అప్పుడు రోహిత్‌తో నాతో పాటే ఉన్నాడు. ఫిట్నెస్ విషయంలో కాస్త హార్డ్‌వర్క్ చేయమని చెప్పాను. తాను కచ్చితంగా మారతానని బదులిచ్చాడు.ఆ తర్వాత కొన్నాళ్లకే రోహిత్ శర్మ హిట్‌మ్యాన్‌గా మారాడు. కెరీర్ పట్ల తన ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తను ఎలా అయితే ముందుకు సాగాలని అనుకున్నాడో అందుకు తగ్గట్లుగానే శ్రమించాడు.ఒక క్రికెటర్ ఇంతగా మారిపోవడం నేను అదే మొదటిసారి చూడటం. కేవలం మారిపోవడమే కాదు విజయవంతమైన ఆటగాడిగా ఎదిగాడతడు.చాలా మంది రోహిత్ శర్మను చాలా మంది చాలా రకాలుగా కామెంట్ చేశారు. రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్ అంటూ హేళన చేశారు. అయితే, తను వీటన్నిటినీ దాటుకుని పూర్తిగా మారిపోయి.. హిట్‌మ్యాన్ అయ్యాడు.నువ్వేం చెబితే అది చేస్తా. ఐపీఎల్ తర్వాత నువ్వు ఒక కొత్త రోహిత్ శర్మను చూస్తావని ఆరోజు నాతో అన్నాడు. అన్నట్లుగానే చేసి చూపించాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ప్రస్తావిస్తూ.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్లే రోహిత్ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడని ప్రశంసించాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ముంబైకి ఆడిన రోహిత్.. తన అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో అడుగుపెట్టాడు.టీ20 ప్రపంచకప్-2007 జట్టులో భాగమైన అతడు.. ఆ తర్వాత పేలవ ప్రదర్శన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2011 వన్డే వరల్డ్‌కప్ టీమ్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.ఈ క్రమంలో.. బొద్దుగా ఉన్న రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. మళ్లీ గాడిలో పడ్డాడు. నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనను ఓపెనర్‌గా ప్రమోట్ చేయగా.. అదే స్థానంలో పాతుకుపోయి.. కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.ఈ విషయాలను నెమరువేసుకున్న ముంబై మాజీ క్రికెటర్, కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రోహిత్ శర్మతో తన అనుబంధం గురించి రణ్వీర్ అల్హాబాదియా పాడ్‌కాస్ట్‌లో చెప్పుకొచ్చాడు. కాగా రోహిత్ శర్మ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్-2024తో బిజీగా ఉన్నాడు. అతడి సార థ్యంలో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. -
గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
కోల్‌కతా నైట్ రైడర్స్ పదేళ్ల తర్వాత మరోసారి ఐపీఎల్ చాంపియన్‌గా అవతరించింది. క్యాష్ రిచ్ లీగ్‌లో మూడోసారి టైటిల్ గెలిచి ట్రోఫీని ముద్దాడింది. పదిహేడో ఎడిషన్ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలిచిన శ్రేయస్ అయ్యర్ సేన.. ఫైనల్లోనూ సత్తా చాటింది.చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఐపీఎల్-2024 విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ క్యాంపు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లతో సహా ఫ్రాంఛైజీ యజమానులు షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా కుటుంబాలు ఈ సంతోషంలో పాలుపంచుకున్నాయి.విజయం పరిపూర్ణం.. వారే కారణంఇదిలా ఉంటే.. గతేడాది పేలవంగా ఆడి ఏడో స్థానానికి పరిమితమైన కేకేఆర్.. ఈసారి సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. సమిష్టి కృషితో టైటిల్ సాధించింది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ తొమ్మిది విజయాలు సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది.క్వాలిఫయర్-1లో సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్.. ఆఖరి మెట్టుపై అదే ప్రత్యర్థిని మరోసారి బోల్తా కొట్టించి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. అయితే, కేకేఆర్ సక్సెస్ వెనుక మెంటార్ గౌతం గంభీర్‌దే కీలక పాత్ర అని ఆటగాళ్లతో పాటు మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు.గంభీర్‌ను మెంటార్‌గా రప్పించడం ద్వారా ఆటగాళ్ల ఆలోచనా తీరులో మార్పు వచ్చిందని.. గెలుపునకు బాట వేసిందని కొనియాడుతున్నారు. ఇది కొంతవరకు వాస్తవమే. అయితే, గంభీర్ ఒక్కడే కాదు కేకేఆర్ విజయానికి ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో పాటు అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, భరత్ అరుణ్‌లు కూడా ప్రధాన కారణం.ఆరు రంజీ ట్రోఫీలు.. ఇప్పుడిలా మరో టైటిల్దేశవాళీ క్రికెట్ జట్లకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్ పండిట్.. శిక్షణ విషయంలో చాలా కఠినంగా ఉంటారని పేరు. అనుకున్న ఫలితాలను రాబట్టేందుకు ఆటగాళ్లతో ఎంత హార్డ్‌వర్క్ చేయించడానికైనా ఆయన వెనుకాడరని ప్రతీతి.ఇక గంభీర్ రూపంలో మరో దిగ్గజం చంద్రకాంత్ పండిట్‌కు తోడు కావడంతో ఆయన పని మరింత సులువైంది. మూడు వేర్వేరు జట్లకు కోచ్‌గా వ్యహరించి.. ఆరు రంజీ ట్రోఫీలు గెలిచిన శిక్షకుడిగా పేరొందిన చంద్రకాంత్ ఖాతాలో తొలిసారి ఐపీఎల్ టైటిల్ కూడా చేరింది.వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన అభిషేక్ నాయర్కేకేఆర్ గెలుపులో టీమిండియా మాజీ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అభిషేక్ నాయర్‌ది కూడా కీలక పాత్ర. ముఖ్యంగా ఇండియన్ కోర్కు సంబంధించి అతడే పూర్తి బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువ ప్లేయర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారు తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా అభిషేక్ తీర్చిదిద్దాడు. ఫైనల్ తర్వాత కేకేఆర్ స్టార్లు లీడింగ్ వికెట్ టేకర్ వరుణ్ చక్రవర్తి, ఫైనల్ టాప్ స్కోరర్ వెంకటేశ్ అయ్యర్ చెప్పిన మాటలే ఇందుకు నిదర్శనం.‘‘అభిషేక్ నాయర్‌కు కచ్చితంగా క్రెడిట్ దక్కాల్సిందే. కొంతమంది పేర్లు పెద్దగా వెలుగులోకి రావు. కానీ.. నా వరకు అభిషేక్ విషయంలో అలా జరగకూడదనే కోరుకుంటా. ఈ ప్రపంచంలోని అన్ని రకాల ప్రశంసలకు అతడు అర్హుడు’’ అని వెంకటేశ్ అయ్యర్ అభిషేక్ నాయర్‌పై అభిమానం చాటుకున్నాడు.ఆ శక్తి మరెవరో కాదుఇక కేకేఆర్ విజయాల్లో బౌలింగ్ విభాగానిదే ప్రధాన పాత్ర అనడంలో సందేహం లేదు. ఫైనల్లో సన్‌రైజర్స్‌ను 113 పరుగులకే ఆలౌట్ చేసి సరికొత్త రికార్డులు సృష్టించారు కేకేఆర్ బౌలర్లు. స్పిన్నర్లు, పేసర్లు కలిసి ఈ సీజన్ ఆద్యంతం అద్భుతంగా రాణించారు. వారి వెనుక ఉన్న శక్తి పేరు భరత్ అరుణ్.𝙏𝙝𝙚 𝙛𝙚𝙚𝙡𝙞𝙣𝙜 𝙤𝙛 𝙀𝙪𝙥𝙝𝙤𝙧𝙞𝙖 🏆Celebrating @KKRiders' triumph in 𝙎𝙍𝙆 style ⭐️😎#TATAIPL | #KKRvSRH | #Final | #TheFinalCall | @iamsrk pic.twitter.com/OmvXa9GtJx— IndianPremierLeague (@IPL) May 27, 2024చదవండి: BCCI- IPL 2024: వారికి భారీ మొత్తం.. బీసీసీఐ కీలక ప్రకటన -
MI: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై?.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా? వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తనకు జరిగిన అవమానం పట్ల ఆవేదన చెందుతున్నాడా?తాను నిర్మించిన సామ్రాజ్యం నుంచి తానే బయటకు వెళ్లే సమయం వచ్చిందా? అంటే అవుననే మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ- కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన తాజా ‘సంభాషణ’కు సంబంధించిన దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఐపీఎల్-2024 కంటే ముందే కెప్టెన్‌గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అపఖ్యాతిఅయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్, హార్దిక్‌లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే విధంగా.. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్- కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్‌తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అది నా ఇల్లు బ్రదర్ఇందులో.. ‘‘ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్’’ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ తదుపరి కేకేఆర్‌లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్ లెజెండరీ పేసర్, గతంలో కోల్‌కతా ఫ్రాంఛైజీతో పనిచేసిన వసీం అక్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్‌తో హిట్‌మ్యాన్ సంభాషణ మరింత హైలైట్ అవుతోంది.చదవండి: KL Rahul- Sanjeev Goenka: జట్టు గెలవాలన్న తపనే అది: బ్రెట్ లీClear audio of Rohit Sharma and Abhishek Nayar's conversation, he didn't said that it's his last IPL.Please don't make any conclusions on half said words.🙏pic.twitter.com/9lbtZRQvQB— Aryan 🇮🇳 (@Iconic_Hitman) May 10, 2024... That chat. Rohit to Nayar "Ek ek cheez change ho rha hai!,, Wo unke upar hai,,, Jo bhi hai wo mera ghar hai bhai, wo temple mene banwaya hai" Last line - "Bhai mera kya mera to ye last hai" And now KKR deleted that chatting video of Rohit Sharma and Nayar#RohitSharma pic.twitter.com/4BiQzutQdH— HitMan 🖤 (@Sachin__i) May 11, 2024 -
తిలక్ గోల్డెన్ డక్! ఎందుకు అతడిని ప్రమోట్ చేశారు?: మాజీ క్రికెటర్ ఫైర్
Tilak Varma would be disappointed for sure: ‘‘టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. బ్యాటింగ్ ఆర్డర్లో నాలుగో స్థానంలో తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో సరిగ్గా సరిపోతాడు. వీళ్లు లెఫ్టాండర్లా, రైట్హ్యాండర్లా అన్న అంశంతో అసలు సంబంధమే లేదు. నిజానికి జట్టులో ఏకంగా ఐదుగురు లెఫ్టాండ్ బ్యాటర్లు ఉన్నారు. తిలక్‌ను ఎందుకు ప్రమోట్ చేశారు? ప్రత్యర్థి జట్టులో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉన్నాడు. పాల్ స్టిర్లింగ్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. అయితే, ఇలాంటి పిచ్‌పై బాల్ టర్న్ అవ్వదు కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి కాంబినేషన్ల పేరిట తిలక్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపాల్సిన అవసరం లేదు. నాలుగో స్థానంలో అతడి ప్రదర్శన మెరుగ్గా ఉంది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్నాడు. మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో తిలక్ వర్మ చక్కగా సరిపోతాడని సహచర హైదరాబాదీకి అండగా నిలిచాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున సత్తా చాటుతున్న తెలుగు తేజం తిలక్ వర్మ.. వెస్టిండీస్ పర్యటన సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అరంగేట్రంలో సత్తా చాటిన హైదరాబాదీ కరేబియన్ జట్టుతో టీ20 సిరీస్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్టాండర్.. ఐదు మ్యాచ్‌లలో కలిపి 173 పరుగులు చేశాడు. 140.65 స్ట్రైక్‌రేటుతో సగటున 57.67 పరుగులు సాధించి సత్తా చాటాడు. దీంతో అతడిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో తొలి టీ20లో తిలక్ అవుటైన తీరు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. పాపం.. గోల్డెన్ డకౌట్ లక్ష్య ఛేదనలో భాగంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ హైదరాబాదీ బ్యాటర్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రైటార్మ్ పేసర్ క్రెయిగ్ యంగ్ బౌలింగ్‌లో టకర్‌కు క్యాచ్ ఇచ్చి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్ జియో సినిమా షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తిలక్ కూడా నిరాశకు లోనై ఉంటాడు తిలక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తేనే మంచి ఫలితాలు రాబట్టవచ్చని చెప్పుకొచ్చాడు. ఇక తాను అవుటైన తీరుకు తిలక్ వర్మ కూడా తీవ్ర నిరాశకు లోనై ఉంటాడని నాయర్ అభిప్రాయపడ్డాడు. యంగ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చదవండి: ధోని, యువరాజ్ తర్వాత అలాంటి వాళ్లు రాలేదు.. ఇప్పుడు ఇతడు! ఐర్లాండ్‌తో రెండో టీ20.. కీలక ఆటగాడిపై వేటు! అతడికి ఛాన్స్ Yashasvi Jaiswal and Tilak Varma departed on back-to-back deliveries of Craig Young! Golden duck for Tilak Varma 👀#IREvsIND #TilakVarma #CricketTwitter pic.twitter.com/cvA3TSNWMC — OneCricket (@OneCricketApp) August 18, 2023 -
అలా అనుకుంటే సంజూను తీసిపడేయండి.. అతడికి ఛాన్స్ ఇవ్వండి!
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. అతడిని జట్టు నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కాగా కరేబియన్ పర్యటనలో సంజూ తీవ్ర నిరాశపరిచాడు. వన్డే సిరీస్‌లో ఒక హాఫ్ సెంచరీతో కాస్త పర్వాలేదనపించిన శాంసన్.. టీ20లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శాంసన్.. 32 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 13 పరుగులు అత్యధిక స్కోర్‌గా ఉండటం గమానార్హం. ఈ నేపథ్యంలో జట్టు మెన్జ్మెంట్ను ఉద్దేశించి భారత మాజీ ఆటగాడు అభిషేక్ నాయర్ కీలక వాఖ్యలు చేశాడు. శాంసన్‌ను లోయార్డర్‌లో బ్యాటింగ్ పంపడాన్ని అభిషేక్ నాయర్ తప్పుబట్టాడు. కాగా సాధారణంగా ఐపీఎల్లో సంజూ 3 లేదా 4 స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చేవాడు. "సంజూ శాంసన్‌ని సేవలను ఉపయోగించుకోవాలనుకుంటే అతడికి మూడో స్ధానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వండి. అతడు ఆ బ్యాటింగ్ పొజిషన్‌కు బాగా అలవాటు పడ్డాడు. అతడు ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు కూడా. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లను ఎటాక్ చేసే సత్తా సంజూకు ఉంది. ఆ స్ధానంలో అతడిని పంపకపోతే పూర్తిగా జట్టులోనే ఛాన్స్ ఇవ్వవద్దు. సంజూని ఐదు లేదా ఆరో స్ధానంలో ఆడించాలనుకుంటే, అతడికి బదలుగా రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వండని జియో సినిమాతో నాయర్ అన్నాడు. చదవండి: ODI WC 2023: ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. ! -
అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు
ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 33 పరుగులకే 3 వికెట్లు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, నితీశ్ రాణాతో కలిసి 99 పరగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. ఇకఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రింకూపై కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రింకూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అని అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు. "రింకూ సింగ్ స్పిన్‌కు అద్భుతంగా ఆడతాడు. ఫస్ట్-క్లాస్ సీజన్, దేశవాళీ టోర్నీలో రింకూ మంచి రికార్డు ఉంది. గత మూడు నాలుగు సీజన్లలో బాగా రాణించిన ఆటగాళ్లలో రింకూ ఒకడు. దేశవాళీ క్రికెట్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. దేశవాళీ క్రికెట్ అత్యంత కఠినమైన పిచ్‌లో లక్నో ఒకటి. అటువంటి పిచ్‌పై కూడా రింకూ చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఉన్నాడు. అతడు బాగా కష్టపడతాడు. కాబట్టి రింకూ భారత జట్టు తరపున ఆడాలని నేను ఆశిస్తున్నాను. సరిగ్గా వాడుకుంటే రింకూ మూడు ఫార్మాట్లలో టీమిండియాకి మంచి ఫినిషర్‌గా మారతాడు అని మీడియా సమావేశంలో నాయర్ పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: ధోనికి సీఎస్కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు చెన్నై గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యేవాడు! ఈ దృశ్యాలు చూస్తుంటే! -
'ఇక ఇంగ్లండ్ జట్టు టీ20లా టెస్టు క్రికెట్ ఆడనుంది'
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా మెకల్లమ్ ప్రస్తుతం ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. కాగా ఇంగ్లండ్ కోచ్‌గా ఎంపికైన మెకల్లమ్‌పై కేకేఆర్ ఆస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మెకల్లమ్‌కు రెడ్-బాల్ కోచ్‌గా అనుభవం లేదని, రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ టెస్ట్ ఫార్మాట్లో టీ20లా దూకుడుగా ఆడుతుందని నాయర్ అభిప్రాయపడ్డాడు. "బెన్ స్టోక్స్, బ్రెండన్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడుతుందని నేను భావిస్తున్నాను. వీరిద్దరి కలియికలో ఇంగ్లండ్ జట్టు వైట్‌బాల్ ఫార్మాట్‌లా ఆడుతుంది. టెస్టుల్లో బ్యాటర్లు భారీ షాట్లు, రిస్క్ తీసుకుని ఆడటం చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్‌ను అత్యుత్తమ జట్టుగా తీర్చుదిద్దుతాడన్న నమ్మకం నాకు ఉంది. అతడు ముందుగా ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ఆపై తన సలహాలు ఇస్తాడు" అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..! -
క్రికెట్‌కు అభిషేక్ నాయర్ వీడ్కోలు
ముంబై: భారత వన్డే జట్టు మాజీ సభ్యుడు, ముంబై క్రికెటర్ అభిషేక్ నాయర్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నానని బుధవారం ప్రకటించాడు. 1983లో సికింద్రాబాద్‌లో జన్మించిన 36 ఏళ్ల నాయర్ 2009లో భారత్ తరఫున మూడు వన్డేల్లో పాల్గొన్నాడు. రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా... మూడో మ్యాచ్‌లో క్రీజులోకి వచ్చిన అతను ఏడు బంతులు ఆడి పరుగులేమీ చేయకుండా నాటౌట్‌గా నిలిచాడు. ముంబై తరఫున 103 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నాయర్ 5,749 పరుగులు చేసి, 173 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో నాయర్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్, పుణే వారియర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల తరఫున ఆడాడు. -
దినేశ్ కార్తీక్ ఫినిషర్ కూడా
కోల్‌కతా: ప్రపంచ కప్ జట్టులోకి రెండో వికెట్ కీపర్‌గా ఎంపికైన దినేశ్ కార్తీక్... అవసరమైతే ఓపెనింగ్‌తో పాటు ఫినిషర్‌గానూ పనికొస్తాడని అతని మెంటార్ అభిషేక్ నాయర్ వ్యాఖ్యానించాడు. క్రికెట్లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం వస్తుందో చెప్పలేమన్న నాయర్... ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకునేలా సంసిద్ధమై ఉండాలని అన్నారు. ధోని గాయపడితేనే రెండో వికెట్ కీపర్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందన్న ఎమ్కెస్కే వ్యాఖ్యల నేపథ్యంలో నాయర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ‘కార్తీక్ కేవలం వికెట్ కీపింగ్ మాత్రమే కాదు. నంబర్ 4 స్థానంలోనూ ఆడగలడు. అవసరమైతే ఓపెనింగ్ చేయగలడు. ఫినిషర్‌గానూ పనికొస్తాడు. అతన్ని బ్యాకప్‌గానే జట్టులోకి ఎంపిక చేశారు. కానీ ఎవరైనా ఫామ్ కోల్పోతే స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ కోసం మేనేజ్మెంట్ అతని వైపే చూస్తుందని నా నమ్మకం. ఎప్పుడు అవకాశం వస్తుందో తెలీదు కానీ వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా కార్తీక్ అందిపుచ్చుకోవాలి’ అని నాయర్ అన్నాడు. -
అక్టోబర్ 8 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: లక్ష్మీ ప్రసన్న మంచు, (నటి), అభిషేక్ నాయర్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 8. పుట్టిన తేదీ కూడా 8. ఇది కూడా శనికి సంబంధించిన సంఖ్యే కావడం వల్ల వీరిపై శని ప్రభావం మరింత బలంగా ఉంటుంది. దీనికి అధిపతి అయిన శనైశ్చరుడు వృత్తికారకుడు కావడం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి, కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ వీరికి బాగా తెలియడం వల్ల వీరు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. క్రమశిక్షణకు కట్టుబడి, న్యాయం, ధర్మం, సమానత్వం అనే గుణాలను కలిగి ఉండటం వల్ల ఆదర్శభావాలతో సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లలకు వివాహాది శుభకార్యలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా బలపడతారు. మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. అయితే అందరూ క్రమశిక్షణతో ఉండాలని కోరుకోవడం వల్ల బీపీ, గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. యోగ, మెడిటేషన్ చేస్తూ వైద్య సలహాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఐ.ఎ.ఎస్‌లు, ఐపీఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం, పిల్లులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్