ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా మెకల్లమ్ ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. కాగా ఇంగ్లండ్ కోచ్‌గా ఎంపికైన మెకల్లమ్‌పై కేకేఆర్ ఆస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. మెకల్లమ్‌కు రెడ్-బాల్ కోచ్‌గా అనుభవం లేదని, రాబోయే రోజుల్లో ఇంగ్లండ్ టెస్ట్ ఫార్మాట్‌లో టీ20లా దూకుడుగా ఆడుతుందని నాయర్ అభిప్రాయపడ్డాడు.
"బెన్ స్టోక్స్, బ్రెండన్ నేతృత్వంలో ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో దూకుడుగా ఆడుతుందని నేను భావిస్తున్నాను. వీరిద్దరి కలియికలో ఇంగ్లండ్ జట్టు వైట్‌బాల్ ఫార్మాట్‌లా ఆడుతుంది. టెస్టుల్లో బ్యాటర్‌లు భారీ షాట్‌లు, రిస్క్ తీసుకుని ఆడటం చూస్తాం. రాబోయే రోజుల్లో ఇంగ్లండ్‌ను అత్యుత్తమ జట్టుగా తీర్చుదిద్దుతాడన్న నమ్మకం నాకు ఉంది. అతడు ముందుగా ఆటగాళ్ల బలాలు, బలహీనతలను గుర్తించి ఆపై తన సలహాలు ఇస్తాడు" అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్.. యువ ఆటగాడు వచ్చేశాడు..!
Comments
Please login to add a commentAdd a comment