అక్టోబర్ 8 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | October 8 to celebrate the birthdays of celebrities buying | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 8 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Published Wed, Oct 7 2015 10:24 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

అక్టోబర్  8  పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 8 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు:
లక్ష్మీ ప్రసన్న మంచు, (నటి), అభిషేక్ నాయర్ (క్రికెటర్)

 
ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 8. పుట్టిన తేదీ కూడా 8. ఇది కూడా శనికి సంబంధించిన సంఖ్యే కావడం వల్ల వీరిపై శని ప్రభావం మరింత బలంగా ఉంటుంది. దీనికి అధిపతి అయిన శనైశ్చరుడు వృత్తికారకుడు కావడం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి, కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. మనీ మేనేజ్‌మెంట్ వీరికి బాగా తెలియడం వల్ల వీరు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. క్రమశిక్షణకు కట్టుబడి, న్యాయం, ధర్మం, సమానత్వం అనే గుణాలను కలిగి ఉండటం వల్ల ఆదర్శభావాలతో సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లలకు వివాహాది శుభకార్యలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా బలపడతారు.

మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. అయితే అందరూ క్రమశిక్షణతో ఉండాలని కోరుకోవడం వల్ల బీపీ, గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. యోగ, మెడిటేషన్ చేస్తూ వైద్య సలహాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఐ.ఎ.ఎస్‌లు, ఐపీఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి.

 లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం, పిల్లులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement