
PC: BCCI
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెట్ జట్టు కోచింగ్ స్టాప్‌లో మార్పులు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ స్టాఫ్‌లో భాగమైన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌పై వేటు వేసేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు దైనిక్ జాగరణ్ తమ కథనంలో పేర్కొంది.
బ్యాటింగ్ కోచ్‌గా ఇప్పటికే సితాన్షు కోటక్ ఉండగా అభిషేక్ అవసరం లేదన్న భావనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ 1-3 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ యూనిట్ ఘోరంగా విఫలమైంది.
ఈ క్రమంలోనే బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన నాయర్‌కు ఉద్వాసన పలకాలని బీసీసీఐ పెద్దలు నిర్ణయించకున్నట్లు దైనిక్ జాగరణ్ తెలిపింది. అదేవిధంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ స్దానంలో మరో సహాయక కోచ్ ర్యాన్ డస్కటే బాధ్యతలు నిర్వర్తించే అవకాశమున్నట్టు సమాచారం. అయితే బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎటవంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కాగా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన తర్వాత గౌతమ్ గంభీర్ భారత కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. కోచింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్‌కు బీసీసీఐ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు తనతో కలిసి పనిచేసిన నాయర్, ర్యాన్ డస్కటే, మోర్నే మోర్కెల్‌లను సపోర్ట్ స్టాప్‌లోకి తీసుకువచ్చాడు. అయితే ఈ కోచింగ్ స్టాప్‌లో ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు వరుసగా ఘోర పరాభావాలు ఎదురయ్యాయి.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్, ఆస్ట్రేలియాతో బీజీటీని భారత్ కోల్పోయింది. దీంతో కోచింగ్ స్టాప్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో గంభీర్ అండ్ కో కాస్త ఉపశమనం పొందారు. కానీ బీసీసీఐ మాత్రం కోచింగ్ స్టాప్‌ను కుదించాలని పట్టుదలతో ఉంది.
చదవండి: అతడు చేసిన తప్పేంటి?.. మీకసలు తెలివి ఉందా?: షేన్ వాట్సన్ ఫైర్