భారత క్రికెట్ జట్టు శ్రీలంకకు పయనమైంది. టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, వన్డే వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్ తదితరులు సోమవారం ముంబై నుంచి విమానంలో బయల్దేరారు.
ఇక లంకకు ప్రయాణమయ్యే ముందు టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతం గంభీర్.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కోచింగ్ సహాయక సిబ్బంది గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
వారికే పెద్దపీట
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు విభాగాలకు వేర్వేరు కోచ్‌లు ఉన్నా.. అన్నింటిలోనూ ప్రావీణ్యం చూపగలిగే సిబ్బందికే తాను పెద్దపీట వేస్తానని పేర్కొన్నాడు.
ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డష్కాటేలను అసిస్టెంట్ కోచ్‌లుగా శ్రీలంకకు వస్తున్నట్లు గంభీర్ అధికారికంగా వెల్లడించాడు.
‘‘నేను కోరుకున్నట్లుగానే బీసీసీఐ చాలా విషయాల్లో సానుకూలంగా స్పందించినందుకు సంతోషంగా ఉంది. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లు అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే క్లారిటీ
అయితే, శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాతే సపోర్టింగ్ స్టాఫ్ విషయంలో స్పష్టత వస్తుంది. ప్రస్తుతం అభిషేక్ నాయర్, సాయిరాజ్ బహుతులే, దిలీప్ జట్టుతో పాటు శ్రీలంక వస్తున్నారు.
డష్కాటే కొలంబోలో మాతో చేరతాడు. అభిషేక్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌లే. వీళ్లిద్దరు నా సహాయకులుగా ఉండటం మంచి విషయం. అయితే, వాళ్లు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించనున్నారో శ్రీలంక టూర్ ముగిసిన తర్వాతే తేలుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2024లో కోల్‌కతా మెంటార్‌గా గౌతం గంభీర్ వ్యవహరించగా.. అభిషేక్ నాయర్, డష్కాటే అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదేళ్ల తర్వాత ఆ జట్టు మరోసారి చాంపియన్‌గా నిలిచింది.
ఈ విజయంలో కీలక పాత్ర గంభీర్‌దేనంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. శ్రీలంకతో జూలై 27న మొదలుకానున్న టీ20 సిరీస్‌తో కోచ్‌గా గంభీర్ తన ప్రస్థానం మొదలుపెట్టనున్నాడు.
చదవండి: అందుకే కెప్టెన్సీ ఇవ్వలేదు: అగార్కర్ ఘాటు వ్యాఖ్యలు
#WATCH | Mumbai | Indian Men's Cricket Team arrives at the Airport, they'll leave for Sri Lanka, shortly.
Indian Cricket Team will play the ODI and T20I series, 3 matches each, against Sri Lanka, starting on July 27 and ending on August 7. pic.twitter.com/ZmBmBqLasH— ANI (@ANI) July 22, 2024
Comments
Please login to add a commentAdd a comment