టీమిండియా హెడ్ కోచ్ హోదాలో గౌతం గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటకు వెళ్లనున్న నేపథ్యంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడాడు.
జై షాతో నా రిలేషన్ బాగుంది
ఈ సందర్భంగా.. ‘‘టీ20 వరల్డ్ చాంపియన్స్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్ రన్నరప్స్.. అత్యంత విజయవంతమైన జట్టుకు కోచ్‌గా నేను బాధ్యతలు స్వీకరించబోతున్నాను.
ఆటే ముఖ్యం
జై షాతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మా మధ్య విభేదాలు అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. గౌతం గంభీర్ వ్యక్తిగా మెరుగుపడాలన్నది పెద్ద విషయం కాదు. భారత క్రికెట్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యం’’ అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.
కాగా జూలై 27 నుంచి శ్రీలంక- టీమిండియా మధ్య మొదలుకానున్న టీ20 సిరీస్‌తో గంభీర్ అధికారికంగా కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇక ఈ టూర్ తర్వాత తమకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుందని.. 10 టెస్టు మ్యాచ్‌ల షెడ్యూల్ ఖరారైందని తెలిపాడు.
ఆ పది మ్యాచ్‌లలోనూ తాము రాణించగలమనే నమ్మకం ఉందని గౌతీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌లలో కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
కోహ్లి, రోహిత్‌ల భవిష్యత్తుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఇక స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల భవిష్యత్తు గురించి ఎదురైన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘‘‘వాళ్లిద్దరిలోనూ ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది.
ఇటీవలి వన్డే, టీ20 ప్రపంచకప్ ఈవెంట్లలో వాళ్లిద్దరు రాణించారు. చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా పర్యటనలోనూ వాళ్లిద్దరు కీలకం. మరికొన్నాళ్లు కొనసాగాలా లేదా అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత నిర్ణయం.
ఏదేమైనా జట్టు ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యం. విరాట్, రోహిత్ ఇప్పటికీ వరల్డ్‌క్లాస్ క్రికెటర్లుగా కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్లు ఫిట్‌గా ఉన్నంత కాలం వాళ్ల సేవలను ఉపయోగించుకుంటాం.
ఫిట్‌గా ఉంటేనే
ఫిట్‌నెస్ కాపాడుకుంటే గనుక వరల్డ్‌కప్-2027 వరకు వాళ్లు ఆడగలరు. జట్టుకు వాళ్లు ఏమేరకు ఉపయోగపడరన్న అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
కాగా ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వన్డే, టెస్టుల్లో వారు కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్‌గా ఉంటేనే ఆ అవకాశం ఉంటుందని గౌతీ కుండబద్దలు కొట్టాడు.
చదవండి: ENG VS WI: టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా..!
Comments
Please login to add a commentAdd a comment