ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ఆదివారం చెపాక్ వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో రింకూ సింగ్ కీలక పాత్ర పోషించాడు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 33 పరుగులకే 3 వికెట్లు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్, నితీశ్ రాణాతో కలిసి 99 పరగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 43 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. ఇకఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రింకూపై కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడానికి రింకూకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అని అభిషేక్ నాయర్ అభిప్రాయపడ్డాడు.
"రింకూ సింగ్ స్పిన్‌కు అద్భుతంగా ఆడతాడు. ఫస్ట్-క్లాస్ సీజన్, దేశవాళీ టోర్నీలో రింకూ మంచి రికార్డు ఉంది. గత మూడు నాలుగు సీజన్లలో బాగా రాణించిన ఆటగాళ్లలో రింకూ ఒకడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. దేశవాళీ క్రికెట్ అత్యంత కఠినమైన పిచ్‌లో లక్నో ఒకటి.
అటువంటి పిచ్‌పై కూడా రింకూ చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడి ఉన్నాడు. అతడు బాగా కష్టపడతాడు. కాబట్టి రింకూ భారత జట్టు తరపున ఆడాలని నేను ఆశిస్తున్నాను. సరిగ్గా వాడుకుంటే రింకూ మూడు ఫార్మాట్లలో టీమిండియాకి మంచి ఫినిషర్‌గా మారతాడు అని మీడియా సమావేశంలో నాయర్ పేర్కొన్నాడు.
చదవండి: MS Dhoni: ధోనికి సీఎస్‌కే అంటే ప్రాణం! ఆ జట్టులో ఉన్నపుడు చెన్నై గురించి చెబుతూ ఉద్వేగానికి లోనయ్యేవాడు! ఈ దృశ్యాలు చూస్తుంటే!
Comments
Please login to add a commentAdd a comment