రింకూతో గంభీర్ ముచ్చట (PC: IPL/ Gautam Gambhir)
IPL 2023- KKR- Rinku Singh: కోల్‌కతా నైట్ రైడర్స్ యువ సంచలనం రింకూ సింగ్ ఐపీఎల్-2023లో అరదగొట్టాడు. అద్భుత బ్యాటింగ్‌తో కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. జట్టు కష్టాల్లో కూరుకుపోయిన వేళ తానున్నానంటూ ముందుకు వచ్చి ఫినిషింగ్ టచ్‌తో విజయతీరాలకు చేర్చాడు.
ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో 5 సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలిపించడం సీజన్ హైలైట్లలో ఒకటిగా నిలిచిపోతుందడనం లో సందేహం లేదు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లోనూ రింకూ బ్యాట్ ఝులిపించాడు.
సంచలన ఇన్నింగ్స్
టపా టపా వికెట్లు పడుతున్నా.. సహచరుల నుంచి సహకారం లేకపోయినా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏమాత్రం బెదురు, బెరుకు లేకుండా మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఆఖరి వరకు రింకూ పోరాడినా ఒక్క పరుగు తేడాతో లక్నో చేతిలో కేకేఆర్ ఓటమి పాలైంది. ఈ విజయంలో లక్నో జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరింది.
రింకూ తుపాన్ ఇన్నింగ్స్ నేపథ్యంలో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది. ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి పాలైనా రింకూపై మాత్రం ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘‘కేకేఆర్‌కు దొరికిన ఆణిముత్యం. త్వరలోనే రింకూ టీమిండియా ఎంట్రీ ఖాయం’’ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
గంభీర్ ట్వీట్ వైరల్
ఇదిలా ఉంటే.. లక్నో మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సైతం రింకూ ఇన్నింగ్స్‌ను ఉద్దేశించి ప్రత్యేకంగా ట్వీట్ చేయడం వైరల్‌గా మారింది. కేకేఆర్- లక్నో మ్యాచ్ సందర్భంగా రింకూతో ముచ్చటిస్తున్న ఫొటో పంచుకున్న గౌతీ.. ‘‘రింకూ పోరాటం అద్భుతం. టాలెంటెడ్ రింకూ ఓ సంచలనం’’ అని పేర్కొన్నాడు.
కాగా లక్నోతో మ్యాచ్‌లో 33 బంతుల్లో 67 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు రింకూ. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇక సీజన్‌లో 14 ఇన్నింగ్స్ ఆడిన రింకూ మొత్తంగా 474 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయ. ఐపీఎల్-2023లో రింకూ అత్యధిక స్కోరు 67 నాటౌట్.
చదవండి: ఆ ఒక్క మాట.. మరోసారి అభిమానుల మనసు గెలిచాడు! విజయ రహస్యం?
What an effort by Rinku today! Sensational talent! pic.twitter.com/E2HmdeqiHJ
— Gautam Gambhir (@GautamGambhir) May 20, 2023
A breathtaking finish to a sensational encounter! 🔥@LucknowIPL clinch a victory by just 1 run after Rinku Singh's remarkable knock 🙌
— IndianPremierLeague (@IPL) May 20, 2023
Scorecard ▶️ https://t.co/7X1uv1mCyL #TATAIPL | #KKRvLSG pic.twitter.com/umJAhcMzSQ
Comments
Please login to add a commentAdd a comment