ఐపీఎల్-2023లో అదరగొట్టిన రింకూ సింగ్ (PC: IPL)
IPL 2023- KKR- Rinku Singh: ‘‘నా ఆటతీరు పట్ల నా కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాను. అప్పటి నుంచి ప్రజలు నన్ను గుర్తుపట్టడం ఆరంభించారు.
అయితే, ఎప్పుడైతే ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదానో అప్పటి నుంచి నన్ను ఆదరించే వాళ్లు, నా పట్ల గౌరవం చూపేవారు మరింతగా పెరిగారు. ఇప్పుడు నన్ను గుర్తుపట్టే వాళ్ల సంఖ్య పెరిగింది. ఈ భావన అద్భుతంగా అనిపిస్తోంది’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.
అద్భుతంగా సాగింది
ఐపీఎల్-2023లో రింకూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 14 ఇన్నింగ్స్‌లో కలిపి 474 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ ఎడిషన్‌లో రింకూ అత్యధిక స్కోరు 67 నాటౌట్. అన్నిటికంటే ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రింకూ రాణించిన తీరు అద్భుతం.
టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరమైన వేళ వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయం అందించాడు రింకూ. ఈ ఘటనతో ఆ ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ చెత్త రికార్డు మూటగట్టుకుంటే.. రింకూ పేరు మారుమ్రోగిపోయింది. సర్వత్రా అతడిపై ప్రశంసలు కురిశాయి.
ఒంటరి పోరాటం వృథా
ఇక ఐపీఎల్-2023 లీగ్ దశలో కేకేఆర్ ఆఖరి మ్యాచ్‌లోనూ రింకూ తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక్క పరుగు తేడాతో లక్నో చేతిలో కేకేఆర్ ఓడటంతో రింకూ ఒంటరి పోరాటం వృథాగా పోయింది.
ఒక్క బాల్ మిస్ చేసినా
అయితే, మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడంటూ అభిమానులు రింకూపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్నోతో మ్యాచ్ అనంతరం రింకూ మాట్లాడుతూ.. బ్యాటర్‌గా ఈ సీజన్ సంతృప్తికరంగా ముగిసిందని పేర్కొన్నాడు. ఇక వరుస సిక్సర్ల ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ... ‘‘ఆరోజు నేను బ్యాటింగ్ చేస్తున్నపుడు చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నాను.
కచ్చింతగా వరుస షాట్లు బాదాలని నిర్ణయించుకున్నాను. ఆఖరి ఓవర్లో మాకు 21 పరుగులు కావాలి. నేను ఒక్క బాల్ మిస్ చేసినా ఓడిపోయేవాళ్లం’’ అని తెలిపాడు. నాటి ఆ ఇన్నింగ్స్ కారణంగా తనకు మరింత గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ.. క్రికెటర్ కావాలన్న ఆశయంతో ఎన్నో కష్టాలకోర్చి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. కేకేఆర్ ఈ సీజన్‌లో పద్నాలుగింటికి ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది.
చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్‌కు ‘లాస్ట్’ ఛాన్స్!
IPL 2023: ఎవరు బాగా చేశారు? పాపం మధ్యలో అంపైర్ పిచ్చోడయ్యాడు!
Comments
Please login to add a commentAdd a comment