Yash Dayal
-
సౌతాఫ్రికాతో మూడో టీ20.. రెండు మార్పులు చేయనున్న టీమిండియా..?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో టీమిండియా గెలువగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా జయభేరి మోగించింది. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు (నవంబర్ 13) జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది.రెండో టీ20లో టీమిండియా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చివరి నిమిషం వరకు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. అయితే ట్రిస్టన్ స్టబ్స్, గెరాల్డ్ కొయెట్జీ చివర్లో సూపర్‌గా బ్యాటింగ్ చేసి భారత్ చేతుల నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత యూనిట్లో పలు లోపాలు స్పష్టంగా కనిపించాయి.మూడో మ్యాచ్‌లో ఈ లోపాలను సరిదిద్దుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని యోచిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టీ20ల్లో అతను దారుణంగా నిరాశపరిచాడు.వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ అభిషేక్‌ను పక్కకు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అభిషేక్ స్థానంలో తిలక్ వర్మ, రమన్‌దీప్ సింగ్‌లలో ఎవరో ఒకరితో ఓపెనింగ్ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తిలక్ వర్మతో పోలిస్తే రమన్‌దీప్‌కు ఓపెనర్‌గా బరిలోకి దిగే ఛాన్స్‌లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రమన్‌దీప్‌కు హార్డ్ హిట్టింగ్తో పాటు బౌలింగ్ చేయగల సామర్థ్యం కూడా ఉంది. తిలక్ వర్మ మిడిలార్డర్లో ఎలాగూ సెట్ అయ్యాడు కాబట్టి టీమిండియా యాజమాన్యం అతన్ని కదిపే సాహసం చేయకపోవచ్చు. మూడో టీ20లో అభిషేక్‌తో పాటు అర్షదీప్ సింగ్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అర్షదీప్ గత రెండు టీ20ల్లో చెప్పుకోదగ్గ ప్రదదర్శనలు చేయకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ కారణంగా అతన్ని పక్కకు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్షదీప్‌ను తుది జట్టు నుంచి తప్పిస్తే, అతని స్థానంలో యశ్ దయాల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. మూడో టీ20లో రమన్‌దీప్, యశ్ దయాల్ ఇద్దరూ బరిలోకి దిగితే వారిద్దరికి అది అరంగేట్రం మ్యాచ్ అవుతుంది.భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్. -
సౌతాఫ్రికాతో తొలి టీ20.. ఓపెనర్‌గా సంజూ, ఆర్సీబీ ఆటగాడికి కూడా ఛాన్స్..!
సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్‌గా సంజూ శాంసన్ బరిలోకి దిగడం ఖాయమని తేలిపోయింది. సంజూతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని అభిషేక్ శర్మకు ఈ సిరీస్ చాలా కీలకం. అభిషేక్ ఒకవేళ ఈ సిరీస్‌లో కూడా విఫలమైతే మరోసారి టీమిండియా తలుపులు తట్టడం దాదాపుగా అసాధ్యం. ఈ సిరీస్‌లో టీమిండియా సంజూపై కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. అతని నుంచి భారత అభిమానులు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు.వన్‌డౌన్ కెప్టెన్ సూర్యకుమార్ బరిలోకి దిగనున్నాడు. అతని తర్వాత తిలక్ వర్మ ఎంట్రీ ఇస్తాడు. తిలక్ వర్మ చాలా రోజుల తర్వాత తుది జట్టులో ఆడే ఛాన్స్ దక్కించుకోనున్నాడు. తిలక్ వర్మ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ బరిలోకి దిగుతారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఆసీస్ టూర్‌కు ఎంపిక కావడంతో ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ బరిలో ఉంటాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌తో పోలిస్తే వరుణ్ చక్రవర్తికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవలికాలంలో వరుణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తొలి టీ20లో భారత్ ముగ్గురు పేస్లరలో బరిలోకి దిగే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లతో పాటు ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఆఖరి నిమిషంలో ఎవరైనా గాయపడితే తప్ప ఈ జట్టు యధాతథంగా కొనసాగవచ్చు.దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, యశ్ దయాల్ -
అందుకే వాళ్లిద్దరికి టీమిండియాలో చోటు దక్కలేదు!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా వరుస మ్యాచ్‌లతో బిజీ కానుంది. చివరిసారిగా.. శ్రీలంక పర్యటన సందర్భంగా ఆగష్టు 7న వన్డే మ్యాచ్ ఆడిన రోహిత్ సేన.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ మొదలుపెట్టనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనున్న బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారమే తొలి టెస్టుకు జట్టును కూడా ప్రకటించింది.ఈ సిరీస్ ద్వారా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ పునరాగమనం చేయనుండగా.. కేఎల్ రాహుల్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సైతం టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్ యువ పేసర్ యశ్ దయాల్‌కు సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు.ఐపీఎల్ టీమ్‌ను చాంపియన్‌గా నిలిపిఅయితే, ఈ జట్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మాత్రం చోటు దక్కలేదు. రంజీల్లో ఆడాలన్న ఆదేశాలను బేఖాతరు చేశాడంటూ క్రమశిక్షణ చర్యల కింద గతంలో అతడిపై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్టు నుంచి కూడా తప్పించింది. అయితే, ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ జట్టును చాంపియన్‌గా నిలిపిన ఈ ముంబై ప్లేయర్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా బీసీసీఐ అవకాశమిచ్చింది.ఈ క్రమంలో రెడ్‌బాల్ జట్టులో కూడా చోటు దక్కించుకోవాలన్న లక్ష్యంతో బుచ్చిబాబు టోర్నమెంట్లోనూ శ్రేయస్ అయ్యర్ ఆడాడు. అయితే, అక్కడ ఆశించిన మేర రాణించలేకపోయాడు. అనంతరం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఇండియా- డి కెప్టెన్‌గా వ్యవహరించాడు.సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశంఇండియా-సితో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్‌లో 39 బంతుల్లోనే అర్ధ శతకం బాది ఫామ్‌లోకి వచ్చినట్లే కనిపించాడు. అయితే, సెలక్టర్లు మాత్రం అతడిపై నమ్మకం ఉంచలేదు. శ్రేయస్ అయ్యర్ ఆటలో నిలకడలేని కారణంగా అతడిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మరో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు పిలుపునివ్వడం విశేషం. కాగా కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఈ రంజీ వీరుడు వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే.అందుకే షమీని కూడా తీసుకోలేదు!ఇక అయ్యర్‌తో పాటు బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీని కూడా ఎంపికచేయలేదు సెలక్టర్లు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత చీలమండ గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షమీ ప్రస్తుతం ఫిట్‌గానే ఉన్నాడు. అయితే, అతడిని హడావుడిగా జట్టుకు ఎంపిక చేసి రిస్క్ తీసుకోవడం ఎందుకని బీసీసీఐ భావించినట్లు సమాచారం. ప్రధాన పేసర్ బుమ్రా అందుబాటులో ఉండటం, సొంతగడ్డపై అదీ బంగ్లాదేశ్ వంటి జట్టుతో సిరీస్ నేపథ్యంలో షమీని వెంటనే పిలిపించాల్సిన అవసరం లేదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే అతడి స్థానంలో యశ్ దయాల్‌కు చోటిచ్చినట్లు సమాచారం. ఇక రంజీల్లో బెంగాల్ తరఫున షమీ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని న్యూజిలాండ్‌తో సిరీస్ నాటికి పిలిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్. చదవండి: Duleep Trophy: రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు? -
అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ?
బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాజాగా ప్రకటించింది. ఈ సిరీస్‌తో భారత డైనమిక్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.ఈ జట్టులో పంత్‌కు సెలక్టర్లు అవకాశమిచ్చారు. మరోవైపు శ్రేయస్ అయ్యర్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అతడి స్ధానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు కొనసాగించారు. అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా సైతం తిరిగొచ్చాడు.యశ్‌దయాల్ ఎంట్రీ..అయితే ఎవరూ ఊహించని విధంగా యువ పేసర్ యశ్ దయాల్‌కు తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది. అందరూ అర్ష్‌దీప్ సింగ్‌కు చోటు దక్కుతుందని భావించంగా.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ దయాల్ వైపు మొగ్గు చూపింది. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అతడు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ వంటి స్టార్ పేసర్లతో భారత జట్టు తరపున బంతిని పంచుకునే అవకాశముంది.జోరో టూ హీరో..ఇక యశ్ దయాల్ క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచియం అక్కర్లేని పేరు. ఐపీఎల్-2023 సీజన్ సగటు క్రికెట్ అభిమానికి గుర్తిండే ఉంటుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసానికి దయాల్ బలైపోయాడు.దయాల్ వేసిన ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్సర్లు బాది తన జట్టుకు సంచలనం విజయం అందించిన సీజన్ ఇది. గతేడాది సీజన్లో దయాల్‌కు రింకూ కాలరాత్రిని మిగిల్చాడు. వరుసగా 5 సిక్స్‌లు సమర్పించుకున్న దయాల్.. విమర్శలకు కేంద్రంగా నిలిచాడు. రింకూ దెబ్బకు అతడు తీవ్ర అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో సీజన్ మధ్యలోనే అతడు వైదొలిగాడు.అయితే ఆ రోజు అతడు కాస్త వెనకడుగు వేసిన దయాల్.. పడిలేచిన కేరటంలా తిరిగి వస్తాడని ఎవరూ ఊహించలేదు. ఆ రోజును పీడకలలా మర్చిపోయిన యశ్.. ఇప్పుడు సంచలన ప్రదర్శనలు కనబరుస్తూ ఏకంగా భారత జట్టులోఎంట్రీ ఇచ్చాడు. అతడి పట్టుదల పట్ల సర్వత్రా ప్రశంసల వర్షం కురిస్తోంది.2018లో గుజరాత్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన దయాల్.. ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడి 76 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా-ఎకు అతడు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. ఇండియా-బితో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా దయాల్ పర్వాలేదన్పించాడు. ఆర్సీబీ తరపున 14 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. -
Duleep Trophy: ఈ ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లపైనే అందరి దృష్టి!
శ్రీలంక పర్యటన తర్వాత.. సుదీర్ఘ విరామం అనంతరం టీమిండియా క్రికెటర్లు దులిప్ ట్రోఫీ బరిలో దిగనున్నారు. సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న ఈ రెడ్‌బాల్ టోర్నీ బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. సుమారుగా యాభై మందికి పైగా ఆటగాళ్లు ఈ టోర్నమెంట్లో భాగం కానున్నారు.ఈ టోర్నీకి సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే నాలుగు జట్ల వివరాలను వెల్లడించింది. ఆటగాళ్లను టీమ్-ఏ, టీమ్-బి, టీమ్-సి, టీమ్-డిగా విభజించింది. టీమిండియా స్టార్లు శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ తదితరులు పాల్గొననున్న ఈ టోర్నీలో.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లు కూడా హైలైట్‌గా నిలవనున్నారు.అభిమన్యు ఈశ్వరన్బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ దులిప్ ట్రోఫీ-2024లో టీమ్-బి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 28 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఇప్పటి వరకు 94 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఏడు వేలకు పైగా పరుగులు సాధించాడు.ఇప్పుడు ఈ టోర్నీలో గనుక ఈశ్వరన్ సత్తా చాటితే.. బంగ్లాతో సిరీస్‌లో టీమిండియా బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.యశ్ దయాల్దులిప్ ట్రోఫీ-2024లో లెఫ్టార్మ్ పేసర్ యశ్ దయాల్ టీమ్-బికి ఆడనున్నాడు. 26 ఏళ్ల ఈ యూపీ బౌలర్ ఇప్పటి వరకు 23 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు తీశాడు. ఐపీఎల్-2024లో ఆర్సీబీ తరఫున కూడా సత్తా చాటాడు. దులిప్ టోర్నీలో యశ్ దయాల్ ఆకట్టుకుంటే బంగ్లాతో సిరీస్ నేపథ్యంలో అతడి పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంటుంది.హర్షిత్ రాణాఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో తన వంతు పాత్ర పోషించాడు హర్షిత్ రాణా. తద్వారా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఈ ఢిల్లీ బౌలర్ జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. అదే విధంగా.. శ్రీలంక పర్యటనలో వన్డే జట్టులోనూ స్థానం సంపాదించాడు. అయితే, ఈ 22 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్‌కు అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు.ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు తీసిన హర్షిత్ రాణా.. దులిప్ ట్రోఫీలో టీమ్-డికి ఆడనున్నాడు. మెరుగైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాలని పట్టుదలగా ఉన్నాడు.నితీశ్‌కుమార్ రెడ్డిఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆంధ్ర క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డి. ఈ క్రమంలో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా తొలిసారి టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ దురదృష్టవశాత్తూ గాయపడి.. జింబాబ్వే టూర్‌కు వెళ్లలేకపోయాడు. అయితే, దులిప్ ట్రోఫీ(టీమ్-బి)లో సత్తా చాటితే మాత్రం.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.ముషీర్ ఖాన్టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ముషీర్ ఖాన్. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మిడిలార్డర్లో రాణించగల సత్తా ఉన్న ఆల్‌రౌండర్. దేశవాళీ క్రికెట్లో ముంబైకివ ఆడుతున్న ముషీర్.. గత రంజీ సీజన్లో ఓవరాల్‌గా 529 పరుగులు సాధించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. కేవలం ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలోనే ఈ మేర స్కోరు చేశాడు. పందొమిదేళ్ల ముషీర్ ఖాన్ దులిప్ ట్రోఫీలో టీమ్-బికి ఆడనున్నాడు. అన్నకు పోటీగా బ్యాట్‌తో రంగంలోకి దిగనున్నాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అనుహ్యంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కావడంలో ఆ జట్టు పేసర్ యష్ దయాల్‌ది కీలక పాత్ర. చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన డూ ఆర్‌డై మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో గుజరాత్ తరపున జీరోగా మారిన దయాల్ ఇప్పుడు ఆర్సీబీ తరపున హీరోగా మారాడు. సీఎస్కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను యశ్ దయాల్‌కు ఇచ్చాడు. క్రీజులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా వంటి డెంజరస్ ఆటగాళ్లు ఉండడంతో సీఎస్కే విజయం ఖాయమని అందరూ భావించారు. కానీ అందరని అంచనాలను దయాల్ తారుమారు చేశాడు. తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టినా.. ఏమాత్రం భయపడకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మొత్తం ఏడు పరుగులే ఇచ్చి తన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు.ఈ మ్యాచ్‌లో దయాల్ సంచలన ప్రదర్శనతో అతని తండ్రి చంద్రపాల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకును ఆర్సీబీ రూ.5 కోట్లకు కొనుగోలు చేయడాన్ని చాలా మంది తప్పుబట్టారని చంద్రపాల్ చెప్పుకొచ్చాడు.'నేను ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్‌లో ఓ వ్యక్తి యష్‌ని ఎగతాళి చేస్తూ ఓ మీమ్‌ను షేర్ చేశాడు. యశ్ ఇచ్చిన ఐదు సిక్సర్లను ప్రస్తావిస్తూ హేళన చేసేలా ఆ మీమ్ ఉంది. అది నాకు ఇప్పటికి బాగా గుర్తు ఉంది. ఆ మీమ్‌లో 'ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ కథ ప్రారంభం కాకముందే ముగిసింది'అని రాసుకొచ్చారు. ఆ ఆన్లైన్ ట్రోలింగ్ అంతటితో అగిపోలేదు. మేము ఆ ట్రోలింగ్ చూడలేక మా ఫ్యామిలీ గ్రూప్ మినహా అన్ని వాట్సాప్ గ్రూప్‌ల్లో నుంచి నిష్క్రమించాం. ఈ ఏడాది సీజన్ వేలంలో ఆర్సీబీ రూ. 5 కోట్లకు యశ్‌ను సొంతం చేసుకున్నాక కూడా ట్రోలు చేయడం మొదలెట్టారు.ఆర్సీబీ ఫ్రాంచైజీ డబ్బును చెత్తలో పడేసిందంటూ విమర్శించారని" ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దయాల్ తండ్రి చంద్రపాల్ పేర్కొన్నాడు. -
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్‌డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024 -
‘వదిలేసిన చెత్త’ అంటూ ఓవరాక్షన్.. పాపం అతడి పరిస్థితి ఇదీ!
‘‘ఒకరు వదిలేసిన చెత్త.. మరొకరికి విలువైన ఖజానా’’.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నయా పేసర్ యశ్ దయాల్ గురించి టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మురళీ కార్తిక్ చేసిన వ్యాఖ్య ఇది. తమ ఆటగాడిని పట్టుకుని ‘ట్రాష్’ అన్నందుకు అతడికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ఆర్సీబీ. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో యశ్ దయాళ్ ప్రదర్శనను కొనియాడుతూ.. ‘‘అవును.. అతడొక విలువైన ఖజానా’’ అంటూ మురళీ కార్తిక్ స్టైల్లోనే అతడికి దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. గతేడాది ఐపీఎల్ సీజన్లో యశ్ దయాళ్ గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ ఫ్రాంఛైజీ తరఫున ఆడిన ఐదు మ్యాచ్‌లలో కలిపి రెండు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. గుజరాత్ తనకోసం వెచ్చించిన రూ. 3.2 కోట్లకు ఆ స్థాయిలో న్యాయం చేయలేకపోయాడీ యూపీ బౌలర్. అయితే, ఆ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం యశ్ దయాళ్‌కు పీడకలను మిగిల్చింది. అతడి బౌలింగ్‌లో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది తమ జట్టును గెలిపించాడు. దీంతో యశ్ దయాళ్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. విపరీతపు కామెంట్లతో యశ్‌పై విరుచుకుపడ్డారు కొంతమంది నెటిజన్లు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024కు ముందు గుజరాత్ యశ్ దయాళ్ను వదిలివేయగా.. ఆర్సీబీ ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఒక వికెట్ తీసిన యశ్ దయాళ్.. సోమవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సత్తా చాటాడు. పవర్ ప్లేలో తాను వేసిన మూడు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. డెత్ ఓవర్లో సామ కర్రన్‌ను బౌన్సర్‌తో బోల్తా కొట్టించి ఒక వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆర్సీబీ విజయంలో తానూ భాగమయ్యాడు. అయితే, మురళీ కార్తిక్ మాత్రం యశ్ దయాళ్ను ఉద్దేశించి ఈ మేరకు కామెంట్ చేయడం గమనార్హం. ఫలితంగా అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం యశ్ దయాళ్ మాట్లాడుతూ.. నాటి చేదు ఘటన(రింకూ సిక్సర్లు)ను గుర్తు చేసుకున్నాడు. ‘‘ఆరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత నేను మైదానం వీడి వెళ్లిపోయాను. సోషల్ మీడియా అస్సలు చూడొద్దని నాకు చెప్పారు. అయినా నేను వినలేదు. ఓపెన్ చేశాను.ఆ తర్వాత నా కుటుంబంతో మాట్లాడాను. చాలా మంది నా బ్యాగ్రౌండ్ గురించి.. నేను ఎక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చాను అన్న విషయాల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రెండు- మూడు రోజుల పాటు ఆ కామెంట్లు నన్ను వెంటాడాయి. ఆ తర్వాత క్రమక్రమంగా నేను కోలుకున్నాను’’ అని యశ్ దయాళ్ చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2024: మళ్లీ ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ?!.. అంతకంటే సర్ప్రైజ్? He’s treasure. Period. ❤🔥 pic.twitter.com/PaLI8Bw88g — Royal Challengers Bengaluru (@RCBTweets) March 25, 2024 -
RCB Vs PBKS: వారెవ్వా అనూజ్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా బెంగళూరు వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ వికెట్ కీపర్ అనూజ్ రావత్ సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అనూజ్ అద్బుతమైన క్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సామ్ కుర్రాన్ పెవిలియన్ పంపాడు. పంజాబ్ ఇన్నింగ్స్ 18 ఓవర్ వేసిన యశ్ దయాల్ ఐదో బంతిని సామ్ కుర్రాన్‌కు బౌన్సర్‌గా సంధించాడు. ఈ క్రమంలో కుర్రాన్ హుక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ పై నుంచి వెళ్లింది. ఈ క్రమంలో అనూజ్ రావత్ అద్బుతంగా జంప్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరి బ్యాటర్ సామ్ కుర్రాన్ సైతం నేను ఔటా అన్నట్లు రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో రావత్ ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. Athletic Anuj! A sharp catch behind the stumps from @RCBTweets wicketkeeper-batter as #PBKS reach 154/6 with 8 balls to go Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RCBvPBKS pic.twitter.com/3snw3syupr — IndianPremierLeague (@IPL) March 25, 2024 -
IPL 2024: 5 సిక్సర్లు బాదించుకున్న వ్యక్తికి 5 కోట్లు, కొట్టిన వ్యక్తికి 50 లక్షలు
ఐపీఎల్ 2024లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌కు 5 కోట్ల భారీ మొత్తం దక్కనుండగా.. ఆ ఐదు సిక్సర్లు బాదిన బ్యాటర్‌కు మాత్రం కేవలం 50 లక్షలే లభించనున్నాయి. ఈపాటికి విషయం అర్థమయ్యే ఉంటుంది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్‌లో కేకేఆర్ తురుపుముక్క రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో చివరి ఐదు బంతులకు ఐదు భారీ సిక్సర్లు బాది తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇది జరిగి ఏడు నెలల కాలం అయిపోయింది. ఈ విషయాన్ని దాదాపుగా అందరూ మర్చిపోయారు. అయితే నిన్న జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత ఈ టాపిక్ మళ్లీ నెట్టింట హల్చల్ చేస్తుంది. pic.twitter.com/wCHjXTmZ2S — Out Of Context Cricket (@GemsOfCricket) December 20, 2023 ఎందుకుంటే.. నిన్న జరిగిన వేలంలో గుజరాత్ విడిచపెట్టిన యశ్ దయాల్‌ను ఆర్సీబీ 5 కోట్ల ఊహించని ధరకు కొనుగోలు చేసింది. యశ దయాల్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోతాడని అతనితో సహా ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఆర్సీబీ మాత్రం యశ్‌పై భారీ విశ్వాసం ఉంచి, ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి మరీ అతన్ని దక్కించుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. సిక్సర్లు బాదించుకున్నవ్యక్తికే ఇంత భారీ మొత్తం లభిస్తున్నప్పుడు, ఆ సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్‌కు మాత్రం ఎందుకు అంత తక్కువ మొత్తమని అతని అభిమానులు సోషల్‌మీడియాలో గగ్గోలుపెడుతున్నారు. కేకేఆర్.. రింకూని కేవలం 50 లక్షలకే దక్కించుకుని, అతన్ని తిరిగి రీటెయిన్ చేసుకుని, అతన్ని ఆర్ధికంగా ఎదగకుండా కట్టిపడేసిందని అతని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మనమన్నా, ఐపీఎల్ అన్నా గిట్టని ఆస్ట్రేలియన్లకు కోట్లకు కోట్లు కుమ్మరించిన ఫ్రాంచైజీలు, అత్యంత ప్రతిభావంతుడైన రింకూ సింగ్ విషయంలో ఒక్కసారి పునరాలోచన చేసి అతని ప్రతిభకు తగ్గ మొత్తాన్ని ఫిక్స్ చేయాలని సగటు భారత క్రికెట్ అభిమాని ఆకాంక్షిస్తున్నాడు. ఇదే సమయంలో కొందరు హర్షల్ పటేల్ (11.75 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు), షారుక్ ఖాన్ (7.4 కోట్లు), శివమ్ మావీ (6.4 కోట్లు) లాంటి ఆటగాళ్ల పేర్లను ప్రస్తావిస్తూ జస్టిస్ ఫర్ రింకూ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. -
వివాదంలో గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ యష్ దయాల్
గుజరాత్ టైటాన్స్ పేసర్ యశ్ దయాల్ వివాదంలో చిక్కుకున్నాడు. సోమవారం తన సోషల్ మీడియా ఖాతాలో వివాదాస్పద కథనం పోస్టు చేశాడు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో యశ్ దయాల్ వెంటనే పోస్టు డిలీట్ చేశాడు. విషయంలోకి వెళితే.. లవ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని యశ్ దయాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. యువతి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా ఓ వ్యక్తి తన వీపు వెనుక చాకును దాచి పెట్టుకుని ఆమెకు ప్రపొజ్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ పక్కనే సమాధులు ఉండగా మరో మహిళ మృతదేహం ఉంది. ఆ మృతదేహం పై సాక్షి అని పేరు రాసి ఉంది. కానీ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను కావాలని ఆ పోస్ట్ ను చేయలేదని పొరబాటు జరిగినట్లు ఒప్పుకుంటూ తన తప్పును క్షమించాలంటూ పోస్ట్ పెట్టాడు. ''పొరబాటున ఆ కథనాన్ని పోస్ట్ చేశాను దయచేసి క్షమించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు. థ్యాంక్యూ.. సొసైటీలోని ప్రతి సంఘం, కమ్యూనిటీ పట్ల నాకు గౌరవం ఉంది.'' అంటూ రాసుకొచ్చాడు. ఐపీఎల్లో యశ్ దయాల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఒక మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో యశ్ దయాల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు. ఈ దెబ్బతో మానసికంగా ఒత్తిడికి గురైన యష్ దయాల్.. ఫైనల్‌కు ముందు బరిలోకి దిగాడు. చదవండి: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్‌భూషణ్ ఇంటికి పోలీసులు -
అప్పటి నుంచి అందరూ గుర్తు పడుతున్నారు.. ఆరోజు ఒక్క బాల్ మిస్ చేసినా!
IPL 2023- KKR- Rinku Singh: ‘‘నా ఆటతీరు పట్ల నా కుటుంబం చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడాను. అప్పటి నుంచి ప్రజలు నన్ను గుర్తుపట్టడం ఆరంభించారు. అయితే, ఎప్పుడైతే ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సర్లు బాదానో అప్పటి నుంచి నన్ను ఆదరించే వాళ్లు, నా పట్ల గౌరవం చూపేవారు మరింతగా పెరిగారు. ఇప్పుడు నన్ను గుర్తుపట్టే వాళ్ల సంఖ్య పెరిగింది. ఈ భావన అద్భుతంగా అనిపిస్తోంది’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. అద్భుతంగా సాగింది ఐపీఎల్-2023లో రింకూ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 14 ఇన్నింగ్స్‌లో కలిపి 474 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఈ ఎడిషన్‌లో రింకూ అత్యధిక స్కోరు 67 నాటౌట్. అన్నిటికంటే ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో రింకూ రాణించిన తీరు అద్భుతం. టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్లో 29 పరుగులు అవసరమైన వేళ వరుసగా ఐదు సిక్సర్లు బాది జట్టుకు విజయం అందించాడు రింకూ. ఈ ఘటనతో ఆ ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ చెత్త రికార్డు మూటగట్టుకుంటే.. రింకూ పేరు మారుమ్రోగిపోయింది. సర్వత్రా అతడిపై ప్రశంసలు కురిశాయి. ఒంటరి పోరాటం వృథా ఇక ఐపీఎల్-2023 లీగ్ దశలో కేకేఆర్ ఆఖరి మ్యాచ్‌లోనూ రింకూ తుపాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం నాటి మ్యాచ్‌లో 33 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒక్క పరుగు తేడాతో లక్నో చేతిలో కేకేఆర్ ఓడటంతో రింకూ ఒంటరి పోరాటం వృథాగా పోయింది. ఒక్క బాల్ మిస్ చేసినా అయితే, మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడంటూ అభిమానులు రింకూపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో లక్నోతో మ్యాచ్ అనంతరం రింకూ మాట్లాడుతూ.. బ్యాటర్‌గా ఈ సీజన్ సంతృప్తికరంగా ముగిసిందని పేర్కొన్నాడు. ఇక వరుస సిక్సర్ల ఇన్నింగ్స్ గురించి ప్రస్తావిస్తూ... ‘‘ఆరోజు నేను బ్యాటింగ్ చేస్తున్నపుడు చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. కచ్చింతగా వరుస షాట్లు బాదాలని నిర్ణయించుకున్నాను. ఆఖరి ఓవర్లో మాకు 21 పరుగులు కావాలి. నేను ఒక్క బాల్ మిస్ చేసినా ఓడిపోయేవాళ్లం’’ అని తెలిపాడు. నాటి ఆ ఇన్నింగ్స్ కారణంగా తనకు మరింత గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చిన రింకూ.. క్రికెటర్ కావాలన్న ఆశయంతో ఎన్నో కష్టాలకోర్చి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. కేకేఆర్ ఈ సీజన్లో పద్నాలుగింటికి ఆరు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. చదవండి: MI Vs SRH: ముంబైకి చావోరేవో.. యువ బ్యాటర్ రీఎంట్రీ! ఉమ్రాన్‌కు ‘లాస్ట్’ ఛాన్స్! IPL 2023: ఎవరు బాగా చేశారు? పాపం మధ్యలో అంపైర్ పిచ్చోడయ్యాడు! -
'ఒక్క ఓవర్ జీవితాన్ని తలకిందులు చేసింది.. త్వరగా కోలుకో'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్ గుర్తుందిగా. ఒక్క ఓవర్లో ఐదు సిక్సర్లు బాది రింకూ సింగ్ కేకేఆర్‌కు సంచలన విజయం అందించాడు. కానీ ఆ ఓవర్ వేసిన గుజరాత్ బౌలర్ యష్ దయాల్‌కు మాత్రం అది ఒక పీడకలగా మిగిలిపోయింది. ఒక ఓవర్ ఒకరిని హీరో చేస్తే.. మరొకరిని జీరో చేసింది. ఒక్కో ఓవర్‌తో యష్ జీవితం తలకిందులు రింకూ సింగ్ దెబ్బకు యష్ దయాల్ ఈ సీజన్లో మరొక మ్యాచ్ ఆడలేకపోయాడు. అందుకు వేరే కారణం కూడా ఉంది. ఆ ఒక్క ఓవర్ యష్ దయాల్ జీవితాన్ని తలకిందులు చేసింది. తనవల్లే గుజరాత్ ఓడిందని మానసికంగా బాగా దెబ్బతిన్న యష్దయాల్ అనారోగ్యం బారిన పడ్డాడు. దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలలో బరువు తగ్గిన యష్ దయాల్ వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌పై విజయం అనంతరం మాట్లాడిన పాండ్యా యష్ దయాల్ పరిస్థితిని వివరించాడు. Photo: IPL Twitter మళ్లీ ఆడతాడో లేదో! "ఈ సీజన్ లో అతడు మళ్లీ ఆడతాడో లేదో చెప్పలేను. ఆ మ్యాచ్ తర్వాత అతడు అనారోగ్యానికి గురయ్యాడు. 7-8 కిలోల బరువు తగ్గాడు. ఆ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇక అదే సమయంలో అతడు ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అతడు బరిలోకి దిగే పరిస్థితి కూడా లేదు. అతన్ని మళ్లీ ఫీల్డ్ లో చూడటానికి చాలా సమయమే పడుతుంది" అని హార్దిక్ పేర్కొన్నాడు. ఇక ఒక్క మ్యాచ్ కాదు ఒక్క ఓవర్‌తో యశ్ దయాల్ కెరీర్ తలకిందులైంది. జట్టు అతనికి అండగా నిలిచిందని సహచర ప్లేయర్స్ చెబుతున్నా.. దాని తాలూకు షాక్ నుంచి యశ్ ఇప్పటికీ కోలుకోలేకపోయాడని అర్థమవుతోంది. అటు యశ్ దయాల్ కుటుంబం కూడా చాలా బాధపడ్డారు. ఏది ఏమైనా యష్ దయాల్ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుందాం. Hardik Pandya revealed big news about Yash Dayal.#HardikPandya #YashDayal #GujaratTitans #News #Cricketfans #GTvsKKR #RinkuSingh #NewsUpdate #CricketTwitter #IPL #IPL2023 pic.twitter.com/rCqQu7oGcT— CricInformer (@CricInformer) April 26, 2023 చదవండి: Yash Dayal: అత్యంత చెత్త రికార్డు.. పాపం మొహం చూపించలేక అదో కాలరాత్రి, అతని తల్లి అన్నం ముట్టట్లేదు.. యశ్ దయాల్ తండ్రి ఆవేదన 'అర్జున్ను తిడుతున్నావా? చావ్లా విషయంలో నువ్వు చేసిందేంటి!' -
జట్టులో ఒక్కరూ తన పట్ల సానుభూతి చూపించలేదు.. నేను మాత్రం: రాహుల్ తెవాటియా
Gujarat Titans- Rahul Tewatia- Yash Dayal: ‘‘అతడు మా ప్రధాన బౌలర్లలో ఒకడు. గతేడాది మేము చాంపియన్లుగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త బంతి చేతికి ఇచ్చినప్పుడల్లా తనదైన శైలిలో దూసుకుపోయాడు. గతేడాది డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాంటిది ఒక్క మ్యాచ్‌లో ఫలితం వల్ల.. అతడు మా జట్టుకు చేసిన మేలును ఎలా మర్చిపోతాం. కానీ నాకు తెలిసి జట్టులో ఒక్కరు కూడా అతడికి పట్ల సానుభూతితో వ్యవహరించినట్లు కనబడలేదు. నేను మాత్రం తనతో మాట్లాడాను. నీదైన రోజున తప్పకుండా ‘‘ఒక్క మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఎదురు దెబ్బలు తగిలితేనే మరింత వేగంగా పుంజుకోగలవు. జట్టులో ఎవరూ నిన్ను ఏమీ అనరు. ఏదేమైనా ప్రాక్టీసును వదలకు. నీ వ్యూహాలను మైదానంలో పక్కాగా అమలు చేస్తూ ఉండు. నీదైన రోజు తప్పకుండా విమర్శకులకు ఆటతోనే సమాధానం చెబుతావు. ఇదే అత్యంత గడ్డుకాలం.. ఇంతకు మించిన కఠిన పరిస్థితులు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు’’ అని ధైర్యం చెప్పాను’’ అని గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా అన్నాడు. అదో పీడకల తోటి ఆటగాడు, యశ్ దయాల్ గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ యశ్ దయాల్‌కు పీడకలగా మిగిలిపోయిన విషయం తెలిసిందే. యశ్ బౌలింగ్‌లో కేకేఆర్ హిట్టర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో 5 బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు సంచలన విజయం అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో చెత్త రికార్డు నమోదు చేసిన యశ్ దయాల్.. ముఖం చేతుల్లో దాచుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక గురువారం నాటి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోసారి బెస్ట్ ఫినిషర్‌గా ఈ మ్యాచ్‌లో బౌండరీ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చి మరోసారి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్న రాహుల్ తెవాటియా .. యశ్ దయాల్‌కు అండగా నిలబడ్డాడు. అదే విధంగా తన విజయ రహస్యం గురించి చెబుతూ.. గత మూడు- నాలుగేళ్లుగా అవిరామంగా ప్రాక్టీసు చేస్తున్నానని వెల్లడించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగాలంటే సానుకూల దృక్పథం ఉండాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. గతేడాది యశ్ దయాల్.. గుజరాత్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2023: హార్దిక్ పాండ్యాకు షాక్! ఈ సీజన్లో.. వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ "Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX — JioCinema (@JioCinema) April 9, 2023 -
రింకు సింగ్ దెబ్బకు.. బాధతో యశ్ దయాల్ తల్లి ఏం చేసిందో చూడండి
-
అదో కాలరాత్రి, అతని తల్లి అన్నం ముట్టట్లేదు.. యశ్ దయాల్ తండ్రి ఆవేదన
గుజరాత్ బౌలర్ యశ్ దయాల్ బౌలింగ్ కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలిచి తన జట్టుకు అపురూప విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ ఉదంతం జరిగిన మూడు రోజులు గడిచిపోయాయి. ఆతర్వాత మరో రెండు మ్యాచ్‌లు కూడా ఓ రేంజ్లో సాగాయి. రింకూ సింగ్-యశ్ దయాల్ ఉదంతాన్ని దాదాపుగా అందరూ మరిచిపోయారు. క్రికెట్లో ఇవన్నీ సర్వ సాధారణమేనని అందరూ సర్దుకుపోయారు. "Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX — JioCinema (@JioCinema) April 9, 2023 అయితే బాధిత బౌలర్ (యశ్ దయాల్) తల్లి రాధా దయాల్ మాత్రం ఆ ఉదంతాన్నే తలచుకుంటూ ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతూ అన్నం తినట్లేదట. కుటుంబ సభ్యులందరూ ఆమెను ఎంత ఓదార్చాలని ప్రయత్నించినా ఆమె ఏడుపు ఆగట్లేదట. ఆ ఉదంతం జరిగి మూడు రోజులు గడుస్తున్నా రాధా దయాల్ అదే తలుచుకుంటూ ఆవేదన చెందుతుందట. తన కొడుకుకు కెరీర్ ఆరంభంలో ఇలాంటి అనుభవం (5 సిక్సర్లు) ఎదురుకావడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుందట. ఈ విషయాన్ని యశ్ దయాల్ తండ్రి చంద్రపాల్ దయాల్ మీడియాకు వివరించాడు. కొడుకు ఎదుర్కొన్న అనుభవాన్ని తలుచుకుంటూ చంద్రపాల్ యాదవ్ సైతం ఆవేదన వ్యక్తం చేశాడు. అదో కాలరాత్రి, మా జీవితంలో ఎప్పటికీ దాన్ని మరువలేమని తెలిపాడు. క్రికెట్లో ఇలాంటి అనుభవాలు సాధారణమే అయినప్పటికీ, మనవరకు వచ్చే సరికి దాన్ని అంత ఈజీగా తీసుకోలేమని అన్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో గుజరాత్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, జట్టు సహచరులు తమ కుమారుడికి అండగా నిలిచి, అతనిలో ధైర్యం నింపారని చంద్రపాల్ దయాల్ మీడియాకు తెలిపాడు. దయాల్‌ను ఆ మూడ్‌లో నుంచి బయటకు తెచ్చేందుకు జీటీ మేనేజ్మెంట్ పాటలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసిందని పేర్కొన్నాడు. కాగా, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపుకు చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా, యశ్ దయాల్ బౌలింగ్‌లో రింకూ సింగ్ ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలిచి, తన జట్టుకు చారిత్రక విజయాన్ని, బౌలర్ యశ్ దయాల్‌కు చిరకాలం గుర్తుండిపోయే విషాదాన్ని మిగిల్చాడు. -
రింకూ సింగ్ గొప్ప మనసు.. తన చేతిలో బలైపోయిన యశ్ దయాల్‌కు ఓదార్పు
GT VS KKR: ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో ఏరకంగా చెలరేగిపోయాడు యావత్ క్రీడా జగత్తు వీక్షించి ఉంటుంది. కేకేఆర్ గెలుపుకు చివరి ఓవర్లో 29 పరుగులు చేయాల్సిన తరుణంలో రింకూ సింగ్ ఎవరూ ఊహించని విధంగా ఆఖరి 5 బంతులను సిక్సర్లుగా మలచి, మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. రింకూ విధ్వంసం చూసి అతన్ని ప్రశంసించని వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి లాస్ట్ ఓవర్ చూడలేదని అభిమానులతో పాటు దిగ్గజ క్రికెటర్లు కొనియాడుతున్నారు. ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్లు సైతం రింకూ ఊచకోత చూసి ముగ్దులైపోయారు. కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా అయితే మ్యాచ్ అనంతరం ఉద్వేగం తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంది. రింకూ బ్యాటింగ్‌ను చూసి ఇది కలనా నిజమా అన్న డైలమాలో ఉండిపోయింది. ప్రస్తుతం యావత్ సోషల్‌మీడియా రింకూ నామస్మరణతో మార్మోగిపోతుంది. అంతలా రింకూ ఒక్క ఇన్నింగ్స్‌తో క్రికెట్ ఫెటర్నిటిని మొత్తాన్ని ప్రభావితం చేశాడు. ఇంత చేసి, ఒక్క రాత్రిలో జీవితానికి సరిపడా స్టార్ డమ్ సంపాదించిన రింకూ సింగ్‌లో ఏమాత్రం గర్వం కనపడకపోవడం క్రికెట్ ప్రపంచాన్ని మరింతగా ఆకర్శిస్తుంది. చారిత్రక ఇన్నింగ్స్ అనంతరం రింకూ బిహేవియర్ చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. రింకూ సింప్లిసిటి, అమాయకత్వం ఫ్యాన్స్‌ను ఈ యువ ఆటగాడికి మరింత దగ్గరకు చేసింది. మ్యాచ్ అనంతరం రింకూ చేసిన ఓ పని, అప్పటివరకు ఎవరైనా అతన్ని మెచ్చుకోని వారుంటే వారిని కూడా ఫ్యాన్స్ జాబితాలో చేరిపోయేలా చేసింది. ఇంతకు రింకూ ఏం చేశాడంటే.. తన చేతిలో బలైపోయిన యశ్ దయాల్‌ను మ్యాచ్ అనంతరం ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వల్లే జట్టు ఓడిందన్న బాధతో ముఖం చూపించుకోలేకపోయిన యశ్‌కు మద్దతుగా నిలిచి తన గొప్ప మనసు చాటుకున్నాడు. మనసును హత్తుకునే మెసేజ్‌తో యశ్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు. యశ్‌ను మోటివేట్ చేసేందుకు తనవంతు ప్రయత్నాలన్నీ చేశాడు. టార్గెట్‌ను డిఫెండ్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశావు.. నువ్వు చాలా బాగా బౌలింగ్ చేశావు.. నిరాశ చెందకు.. క్రికెట్లో ఇది సర్వసాధారణం అంటూ మెసేజ్ చేశాడు. రింకూ యశ్‌కు మెసేజ్ చేసిన విషయాన్ని ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ వెల్లడించింది. -
4 ఓవర్లలో 69 పరుగులు; తలెత్తుకో చాంపియన్.. కేకేఆర్ ట్వీట్ వైరల్! ఎవరీ యశ్ దయాల్?
IPL 2023- GT Vs KKR: ‘‘తలెత్తుకో.. ఒక్కోసారి అత్యుత్తమ క్రికెటర్ల విషయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. ఈరోజు నీది కాదంతే! నువ్వు ఎల్లప్పుడూ చాంపియన్‌వే యశ్. ఇంతకంటే గొప్పగా.. మరింత వేగంగా పుంజుకుని నువ్వేంటో నిరూపించుకుంటావు’’ అంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ క్రీడాస్ఫూర్తిని చాటుకుంది. గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌ను ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేసింది. అతడికి అండగా నిలిచి నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఐపీఎల్-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్- కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అదరగొట్టిన అయ్యర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆరంభంలో తడబడ్డా.. వెంకటేశ్ అయ్యర్(83), నితీశ్ రాణా(45) రాణించి గెలుపుపై ఆశలు చిగురింపజేశారు. 5 సిక్సర్లతో దుమ్ములేపిన రింకూ ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రింకూ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి కేకేఆర్‌కు మర్చిపోలేని విజయం అందించాడు. కాగా రింకూ ఊచకోతకు బలైపోయిన బౌలరే యశ్ దయాల్. రింకూ, యశ్ ఒకే జట్టుకు ఆడతారు! ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశ్ లెఫ్టార్మ్ మీడియం పేసర్. దేశవాళీ క్రికెట్లో రింకూతో కలిసి ఆడాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న యశ్.. ఆదివారం నాటి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు పూర్తి చేసి ఏకంగా 69 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ట్వీట్ వైరల్ ముఖ్యంగా ఆఖరి ఓవర్లో ఏకంగా 31 పరుగులు ఇచ్చి తమ జట్టు ఓటమి కారణమయ్యాడు. దీంతో ముఖం చేతుల్లో దాచుకుంటూ యశ్ దయాల్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో కేకేఆర్ దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న యశ్‌ను ఉద్దేశించి చాంపియన్ అంటూ ట్వీట్ చేసింది. బాధ పడొద్దంటూ ధైర్యం చెప్పింది. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరీ యశ్ దయాల్? ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 1997 డిసెంబరు 13న యశ్ దయాల్ జన్మించాడు. 2018లో యూపీ తరఫున లిస్ట్ ఏక క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్, 14 లిస్ట్ ఏ మ్యాచ్. 33 టీ20లు ఆడిన యశ్ దయాల్ మూడు ఫార్మాట్లలో వరుసగా 58, 23, 29 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ఈ పేస్ బౌలర్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-2022 వేలంలో 3.2 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు టైటాన్స్ తరఫున యశ్ దయాల్ 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో టీమిండియా వన్డే సిరీస్‌కు ఎంపికైన యశ్.. దురదృష్టవశాత్తూ.. గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. చదవండి: అలా చేయడం సరికాదని తెలుసు.. కానీ తప్పలేదు.. అయితే: మార్కరమ్ IPL 2023: అవును.. బిగ్ ప్లేయర్.. కానీ పాపం నువ్వే బలైపోయావు! Chin up, lad. Just a hard day at the office, happens to the best of players in cricket. You’re a champion, Yash, and you’re gonna come back strong 💜🫂@gujarat_titans pic.twitter.com/M0aOQEtlsx — KolkataKnightRiders (@KKRiders) April 9, 2023 𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌 Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 - By @Moulinparikh Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
IPL 2023: అవును.. బిగ్ ప్లేయర్.. కానీ పాపం నువ్వే బలైపోయావు!
IPL 2023- Rinku Singh- Yash Dayal: ఆఖరి ఓవర్.. నువ్వా- నేనా అన్నట్లు హోరాహొరీ.. నరాలు తెగే ఉత్కంఠ.. యశ్ దయాల్ రంగంలోకి దిగాడు. అప్పటికి రింకూ సింగ్ 16 బంతుల్లో 18 పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశ్ దయాల్ బౌలింగ్ మొదలుపెట్టగానే.. క్రీజులో ఉన్న ఉమేశ్ యాదవ్ సింగిల్ తీసి రింకూకు స్ట్రైక్ ఇచ్చాడు. ఇక తర్వాత సంగతి చెప్పేదేముంది.. రింకూ దెబ్బకు యశ్ దయాల్‌కు దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది. దయాల్ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ.. చివరి ఓవర్లో అద్భుతాలు చేసే డిపెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు పీడకల మిగులుస్తూ.. వరుసగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను విజయతీరాలకు చేర్చి.. చిరస్మరణీయ గెలుపు అందించాడు. ఈ దెబ్బతో రింకూ సింగ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగి పోతుండగా.. చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన యశ్ దయాల్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. బిగ్ ప్లేయర్ అంటూ ఈ క్రమంలో వీరి మధ్య ఇటీవల జరిగిన జరిగిన చాట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా ఆదివారం నాటి గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ కంటే ముందు ఏప్రిల్ 6న కేకేఆర్ సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో రింకూ సింగ్ 33 బంతులు ఎదుర్కొని 46 పరుగులు చేశాడు. ఇక శార్దూల్ ఠాకూర్ అద్భుత ఇన్నింగ్స్‌కు బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సూయశ్ శర్మ విజృంభించిన నేపథ్యంలో ఆర్సీబీపై కేకేఆర్ 81 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. ఈ గెలుపై హర్షం వ్యక్తం చేస్తూ రింకూ సింగ్.. ‘‘చిరస్మరణీయ విజయం.. మమ్మల్ని ప్రోత్సహిస్తూ అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు’’ అని ఫొటోలు పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా.. యశ్ దయాల్.. ‘‘బిగ్ ప్లేయర్ భాయ్’’ అంటూ రింకూకు శుభాకాంక్షలు తెలిపాడు. పాపం నువ్వే బలైపోయావు కట్‌చేస్తే.. తాజా మ్యాచ్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లోనే ఆదివారం రింకూ సింగ్ చితక్కొట్టాడు. దీంతో యశ్ దయాల్ పాత కామెంట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘‘అవును.. పవర్ హిట్టర్.. నువ్వన్నట్లు బిగ్ ప్లేయర్.. కానీ అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌కు నువ్వే బలైపోయావు పాపం’’ అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో.. ‘‘పర్వాలేదు. క్రీడాస్ఫూర్తి ఉండాలి. నీకింకా చాలా భవిష్యత్తు ఉంది యశ్ దయాల్. ఒక్క మ్యాచ్‌తో ఏం కాదు. లోపాలు సవరించుకుని ముందుకు సాగిపో’’ అని అండగా నిలుస్తున్నారు. కాగా ఆదివారం నాటి మ్యాచ్‌లో రింకూ సింగ్ 21 బంతుల్లో ఒక ఫోర్, ఆరు సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేశాడు. అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయాన్ని ఖరారు చేసిన ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే యశ్ దయాల్ ఈ మ్యాచ్‌లో4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 69 పరుగులు సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. కాగా యూపీకి చెందిన రింకూ, యశ్ దేశవాళీ క్రికెట్లో తమ జట్టుకు కలిసే ఆడుతున్నారు. చదవండి: SRH Vs PBKS: అద్భుత ఇన్నింగ్స్.. త్రిపాఠి- మార్కరమ్ అరుదైన ఘనత.. View this post on Instagram A post shared by Rinku 🧿 (@rinkukumar12) Rinku Singh's recent interaction with Yash Dayal before doing the unthinkable at IPL 2023 #RinkuSingh #YashDayal #GTvsKKR #KKRvsGT #IPL2023 pic.twitter.com/3UxgM1Zjmg — Siddharth Thakur (@fvosid) April 10, 2023 𝗗𝗲𝘁𝗲𝗿𝗺𝗶𝗻𝗮𝘁𝗶𝗼𝗻, 𝗘𝘅𝗰𝗲𝗹𝗹𝗲𝗻𝗰𝗲, 𝗖𝗹𝗮𝘀𝘀: All captured in a moment to savour 🙌 Seek your Monday Motivation from this conversation ft. man of the moment @rinkusingh235 & @NitishRana_27 👏👏 - By @Moulinparikh Full Interview🔽 #TATAIPLhttps://t.co/X0FyKmIjAD pic.twitter.com/FtVgYQJQ5H — IndianPremierLeague (@IPL) April 10, 2023 -
అత్యంత చెత్త రికార్డు.. పాపం మొహం చూపించలేక
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ యష్ దయాల్‌కు ఈరోజు ఒక పీడకలగా మిగిలిపోనుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రింకూ సింగ్ యష్ దయాల్‌కు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసిన యష్ దయాల్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు సహా మొత్తం 31 పరుగులు సమర్పించుకున్నాడు. Photo: IPL Twitter ఓవరాల్‌గా 4 ఓవర్లు వేసి 69 పరుగులిచ్చుకొని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఈ క్రమంలోనే యష్ దయాల్ అత్యంత చెత్త రికార్డు నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్ల జాబితాలో యష్ దయాల్ రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో బాసిల్ థంపి(4 ఓవర్లలో 70 పరుగులు, 2018లో ఆర్సీబీతో మ్యాచ్‌లో) ఉన్నాడు. ఇక మూడో స్థానంలో ఇషాంత్ శర్మ( 2013లో సీఎస్కేతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 66 పరుగులు), ముజీబ్ ఉర్ రెహమాన్(2019లో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 66 పరుగులు), ఉమేశ్ యాదవ్( 2013లో ఆర్సీబీతో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 65 పరుగులు) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: #RinkuSingh: ఊహించని మలుపులు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వేళ Got up from the seat and shouted when this happened Unbelievable chase by #RinkuSingh 🔥 Bad luck #yashdayal #KKRvGT pic.twitter.com/I5OLsHFd00 — Albert Einstein Jr (@iEinsteinJr) April 9, 2023