సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ డర్బన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టులో ఎవరెవరుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓపెనర్‌గా సంజూ శాంసన్ బరిలోకి దిగడం ఖాయమని తేలిపోయింది. సంజూతో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు.
ఇటీవలి కాలంలో పెద్దగా ఆకట్టుకోని అభిషేక్ శర్మకు ఈ సిరీస్ చాలా కీలకం. అభిషేక్ ఒకవేళ ఈ సిరీస్‌లో కూడా విఫలమైతే మరోసారి టీమిండియా తలుపులు తట్టడం దాదాపుగా అసాధ్యం. ఈ సిరీస్‌లో టీమిండియా సంజూపై కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. అతని నుంచి భారత అభిమానులు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు.
వన్‌డౌన్ కెప్టెన్ సూర్యకుమార్ బరిలోకి దిగనున్నాడు. అతని తర్వాత తిలక్ వర్మ ఎంట్రీ ఇస్తాడు. తిలక్ వర్మ చాలా రోజుల తర్వాత తుది జట్టులో ఆడే ఛాన్స్ దక్కించుకోనున్నాడు. తిలక్ వర్మ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ బరిలోకి దిగుతారు. వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి ఆసీస్ టూర్‌కు ఎంపిక కావడంతో ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్ పటేల్ బరిలో ఉంటాడు.
స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవి బిష్ణోయ్‌తో పోలిస్తే వరుణ్ చక్రవర్తికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవలికాలంలో వరుణ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. తొలి టీ20లో భారత్ ముగ్గురు పేస్లరలో బరిలోకి దిగే అవకాశం ఉంది. అర్షదీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌లతో పాటు ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్ తుది జట్టులో ఉండే ఛాన్స్ ఉంది. ఆఖరి నిమిషంలో ఎవరైనా గాయపడితే తప్ప ఈ జట్టు యధాతథంగా కొనసాగవచ్చు.
దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ వైషాక్, అవేష్ ఖాన్, యశ్ దయాల్
దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి భారత తుది జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment