టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికి అంతుచిక్కడం లేదు. ఈ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ ఓ మ్యాచ్‌లో సెంచరీ చేస్తే.. మరుసటి మ్యాచ్‌లో డకౌటవుతున్నాడు. సౌతాఫ్రికా టూర్‌కు ముందు బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన సంజూ.. ఆతర్వాత సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో మరో సెంచరీతో మెరిశాడు. ఈ రెండు సెంచరీల అనంతరం సంజూ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు.
తాజాగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో సంజూ రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. దీనికి ముందు మ్యాచ్‌లో కూడా సంజూ డకౌటయ్యాడు. వరుస సెంచరీలు చేసి మాంచి జోష్ మీద కనిపించిన సంజూ.. ఆతర్వాత వరుసగా రెండు డకౌట్లై ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సార్లు డకౌటైన భారత ప్లేయర్‌గా తన చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు.
సంజూ ఈ ఏడాది టీ20ల్లో ఐదోసారి డకౌటయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌటైన సంజూ.. ఆతర్వాత శ్రీలంకపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. తాజాగా సౌతాఫ్రికాపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. సంజూకు ముందు ఓ క్యాలెండర్ ఇయర్‌లో (టీ20ల్లో) అత్యధిక సార్లు డకౌటైన చెత్త రికార్డు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యూసఫ్ పఠాన్ పేరిట ఉండేది. ఈ ముగ్గురు ఓ క్యాలెండర్ ఇయర్‌లో మూడు సార్లు డకౌటయ్యారు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఖాతా తెరవకుండానే సంజూ శాంసన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు. వీరిద్దరి ధాటికి భారత్ స్కోర్ 7 ఓవర్లలో 83/1గా ఉంది. అభిషేక్ 19 బంతుల్లో 42.. తిలక్ 22 బంతుల్లో 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సంజూ వికెట్ మార్కో జన్సెన్‌కు దక్కింది. సంజూ రెండో టీ20లోనూ జన్సెన్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment