గెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఐదు పరుగులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన సంజూ శాంసన్ మూడు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరగా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 5 బంతుల్లో బౌండరీ సాయంతో నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. సంజూ శాంసన్‌కు మార్కో జన్సెన్ క్లీన్ బౌల్డ్ చేయగా.. గెరాల్డ్ కొయెట్జీ బౌలింగ్‌లో మార్కో జన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ శర్మ ఔటయ్యాడు.
నిరాశపరిచిన స్కై..
తొలి టీ20లో ఓ మోస్తరు స్కోర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో దారుణంగా నిరుత్సాహపరిచాడు. స్కై తొమ్మిది బంతులు ఎదర్కొని కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. స్కై.. సైమ్‌లేన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
12 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 70/5గా ఉంది. సంజూ శాంసన్ (0), అభిషేక్ శర్మ (4, సూర్యకుమార్‌యాదవ్ (4), తిలక్ వర్మ (20), అక్షర్ పటేల్ (27) ఔట్ కాగా.. హార్దిక్ పాండ్యా (7), రింకూ సింగ్ (0) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో జన్సెన్, కొయెట్జీ, సైమ్‌లేన్, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు.
తీరు మార్చుకోని అభిషేక్..
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అందివస్తున్న వరుస అవకాశాలను ఒడిసి పట్టుకోలేకపోతున్నాడు. నిర్లక్ష్యంగా షాట్లు ఆడుతూ వికెట్ పారేసుకుంటున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అభిషేక్ ఆతర్వాత వరుసగా వైఫల్యాల బాట పట్టాడు. ఈ సిరీస్‌లో రాణించకపోతే అవకాశాలు రావని తెలిసినా అభిషేక్ బ్యాటింగ్ తీరులో ఏమాత్రం మార్పు లేదు. తొలి టీ20లో ఏడు పరుగులు చేసిన అభిషేక్ ఈ మ్యాచ్‌లో నాలుగు పరుగులకు ఔటయ్యాడు.
టీ20 కెరీర్‌లో అభిషేక్ శర్మ స్కోర్లు ఇలా ఉన్నాయి..!
0, 100, 10, 14, 16, 15, 4, 7, 4
తుది జట్లు..
భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చకరవర్తి, అవేష్ ఖాన్
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఎయిడెన్ మార్క్రమ్(కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, న్కాబయోమ్జి పీటర్
Comments
Please login to add a commentAdd a comment