మరికొద్ది గంటల్లో టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్ ప్రారంభం కానుంది. బార్బడోస్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ (జూన్ 29) రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఈ టైటిల్ ఓ జట్టుకేమో (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక.
ఈ తుది సమరం కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలేలా ఉన్నాడు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ రద్దైనా రిజర్వ్ డే ఉంది. ఒకవేళ రిజర్వ్ డేలో కూడా మ్యాచ్ సాధ్యపడకపోతే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. సంయుక్త విజేతలుగా నిలవడం ఇరు జట్ల ఆటగాళ్లుకు, అభిమానులు ఇష్టం ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ జరగాలనే దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టు కూర్పులో ఓ తలనొప్పి ఉంది. వరుసగా విఫలమవుతున్న శివమ్ దూబేను ఫైనల్లో ఆడించాలా వద్దా అని మేనేజ్‌మెంట్ తలలు పట్టుకు కూర్చుంది. ఫామ్‌లోని లేని దూబేని ఫైనల్లో కూడా కొనసాగిస్తే.. టీమిండియా విజయావకాశాలను దెబ్బతినే ప్రమాదముందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ దూబేని తప్పిస్తే జట్టు లయ దెబ్బతీనే ప్రమాదం కూడా లేకపోలేదు.
ప్రస్తుతం భారత జట్టు బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, బౌలర్లతో సమతూకంగా ఉంది. ఒకవేళ దూబే స్థానంలో సంజూ శాంసన్ లేదా యశస్వి జైస్వాల్‌ను తుది జట్టులోకి తీసుకుంటే భారత్‌కు ఓ ఆల్‌రౌండర్ తక్కువ అవుతాడు. ఈ టోర్నీలో దూబేతో బౌలింగ్ చేయించనప్పటికీ అతన్ని ఆల్‌రౌండర్‌గానే పరిగణించాలి. బౌలర్‌గా అతనికి ఓ మోస్తరు ట్రాక్ రికార్డు ఉంది.
బార్బడోస్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో జట్టు మేనేజ్‌మెంట్ దూబేని తప్పించే సాహసం చేయకపోవచ్చు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్‌కు కూడా దూబేని మార్చడం ఇష్టం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో భారత తుది జట్టుపై మీ అంచాలనేమో కామెంట్ చేయండి. శివమ్ దూబేని ఆడిస్తే బాగుంటుందా లేక సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి అవకాశమిస్తే బాగుంటుందా..?
Comments
Please login to add a commentAdd a comment