Nobody In GT Gave Yash Dayal Sympathy: Told Him This Is Worst, You Cant Go Any Lower: Tewatia - Sakshi
Sakshi News home page

Rahul Tewatia: జట్టులో ఒక్కరూ తన పట్ల సానుభూతి చూపించలేదు.. నేను మాత్రం: రాహుల్‌ తెవాటియా సంచలన వ్యాఖ్యలు

Published Fri, Apr 14 2023 4:14 PM | Last Updated on Fri, Apr 14 2023 4:58 PM

Nobody In GT Gave Yash Dayal Sympathy: Told Him This Is Worst: Tewatia - Sakshi

గుజరాత్‌ టైటాన్స్‌ (PC: IPL/BCCI)

Gujarat Titans- Rahul Tewatia- Yash Dayal: ‘‘అతడు మా ప్రధాన బౌలర్లలో ఒకడు. గతేడాది మేము చాంపియన్లుగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త బంతి చేతికి ఇచ్చినప్పుడల్లా తనదైన శైలిలో దూసుకుపోయాడు. గతేడాది డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 

అలాంటిది ఒక్క మ్యాచ్‌లో ఫలితం వల్ల.. అతడు మా జట్టుకు చేసిన మేలును ఎలా మర్చిపోతాం. కానీ నాకు తెలిసి జట్టులో ఒక్కరు కూడా అతడికి పట్ల సానుభూతితో వ్యవహరించినట్లు కనబడలేదు. నేను మాత్రం తనతో మాట్లాడాను.

నీదైన రోజున తప్పకుండా
‘‘ఒక్క మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఎదురు దెబ్బలు తగిలితేనే మరింత వేగంగా పుంజుకోగలవు. జట్టులో ఎవరూ నిన్ను ఏమీ అనరు. ఏదేమైనా ప్రాక్టీసును వదలకు.

నీ వ్యూహాలను మైదానంలో పక్కాగా అమలు చేస్తూ ఉండు. నీదైన రోజు తప్పకుండా విమర్శకులకు ఆటతోనే సమాధానం చెబుతావు. ఇదే అత్యంత గడ్డుకాలం.. ఇంతకు మించిన కఠిన పరిస్థితులు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు’’ అని ధైర్యం చెప్పాను’’ అని గుజరాత్‌ టైటాన్స్‌ ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియా అన్నాడు. 

అదో పీడకల
తోటి ఆటగాడు, యశ్‌ దయాల్‌ గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్‌-2023లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ యశ్‌ దయాల్‌కు పీడకలగా మిగిలిపోయిన విషయం తెలిసిందే. యశ్‌ బౌలింగ్‌లో కేకేఆర్‌ హిట్టర్‌ రింకూ సింగ్‌ ఆఖరి ఓవర్లో 5 బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు సంచలన విజయం అందించాడు.

ఈ క్రమంలో ఐపీఎల్‌లో చెత్త రికార్డు నమోదు చేసిన యశ్‌ దయాల్‌.. ముఖం చేతుల్లో దాచుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక గురువారం నాటి పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు.

మరోసారి బెస్ట్‌ ఫినిషర్‌గా
ఈ మ్యాచ్‌లో బౌండరీ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చి మరోసారి బెస్ట్‌ ఫినిషర్‌ అనిపించుకున్న రాహుల్‌ తెవాటియా .. యశ్‌ దయాల్‌కు అండగా నిలబడ్డాడు. అదే విధంగా తన విజయ రహస్యం గురించి చెబుతూ.. గత మూడు- నాలుగేళ్లుగా అవిరామంగా ప్రాక్టీసు చేస్తున్నానని వెల్లడించాడు.

క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి  ముందుకు సాగాలంటే సానుకూల దృక్పథం ఉండాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. గతేడాది యశ్‌ దయాల్‌.. గుజరాత్‌ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. 

చదవండి: IPL 2023: హార్దిక్‌ పాండ్యాకు షాక్‌! ఈ సీజన్‌లో..
వాళ్లదే పైచేయి; డెత్‌ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement