Rahul Tewatia
-
శుబ్‌మన్ గిల్‌కు షాక్.. గుజరాత్ సీఐడీ సమన్లు!?
బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణం కేసులో నలుగురు భారత క్రికెటర్లకు గుజరాత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) సమన్లు పంపింది. వారిలో టీమిండియా ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, రాహుల్ తెవాటియా ఉన్నారు. వీరు నలుగురూ ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు గుజరాత్ సిఐడి సమన్లు పంపింది. త్వరలోనే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి కోటి మధ్య ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ముగిసిన అనంతరం గిల్ విచారణకు హాజరు కానున్నాడు. అయితే మిగితా ముగ్గురు ఆటగాళ్లు భారత్‌లోనే ఉండడంతో గిల్ కంటే ముందు విచారణకు హాజరు అయ్యే అవకాశముంది.ఏంటీ బీజడ్ గ్రూపు స్కామ్?గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ చెందిన భూపేంద్రసిన్హ్ జాలా.. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజడ్ ట్రేడర్స్ కంపెనీలను స్దాపించాడు. ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలను గుజరాత్‌లోని పలు జిల్లాల్లో విస్తరించాడు. ఈ కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రజలను నమ్మించారు.అంతేకాకుండా బహుమతులను ప్రకటించి పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించారు. ఉదాహరణకు వారి కంపెనీలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే 32 ఇంచ్ టీవీ, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్స్ వంటి గిప్ట్ ప్యాకేజిలను బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసింది. దీంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకమని, మోసపోయాయని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో భూపేంద్రసిన్హ్ జాలాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసును సిఐడీ అప్పగించారు.తొలుత భూపేంద్రసిన్హ్ రూ. 6000 కోట్ల చిట్-ఫండ్ మోసానికి పాల్పడ్డారని నివేదించిన గుజరాత్ సీఐడీ.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 450 కోట్లగా ఖారారు చేసింది. అయితే పోలీసుల విచారణలో గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, తెవాటియా సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నలుగురుకు సిఐడి సమన్లు పంపింది. -
అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్ కౌంటర్
ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్ భాయ్ వల్లే తమకు రాజస్తాన్ రాయల్స్‌పై గెలుపు దక్కిందని వైస్ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్ జైత్రయాత్రకు గుజరాత్ బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జైపూర్‌లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి టైటాన్స్ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్(11 బంతుల్లో 24*)తో గుజరాత్ శిబిరంలో ఆశలు నింపిన రషీద్ ఖాన్.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్ బాది గెలుపును ఖరారు చేశాడు. రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్‌కు కలిసి వచ్చింది. The elegance of the Prince 🤌#RRvGT #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/EzGEcv6Pk9 — JioCinema (@JioCinema) April 10, 2024 ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్‌ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు. మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్‌మన్ గిల్. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒక్కో బ్యాటర్ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్ ఫినిష్ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను. అయితే, రాహల్- రషీద్ భాయ్ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్ ఖాన్ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు. 𝘾𝙧𝙞𝙨𝙞𝙨 𝙈𝙖𝙣 delivered yet again 😎 🎥 Relive the thrilling end to a thrilling @gujarat_titans win! Recap the match on @starsportsindia & @Jiocinema 💻 📱#TATAIPL | #RRvGT pic.twitter.com/eXDDvpToZ0 — IndianPremierLeague (@IPL) April 10, 2024 IPL 2024: రాజస్తాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ స్కోర్లు ►రాజస్తాన్: 196/3 (20) ►గుజరాత్: 199/7 (20) ►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం ► ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్(ఒక వికెట్, 24 పరుగులు- నాటౌట్). చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..! #ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కొంపముంచిన స్లో ఓవర్ రేట్.. రాజస్థాన్‌పై గుజరాత్ సంచలన విజయం
ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ రాజస్థాన్ రాయల్స్ కొంపముంచింది. రాయల్స్ నిర్దిష్ట సమయానికి (ఓవర్ రేట్లో) ఐదు నిమిషాలు వెనుకబడి ఉండటంతో చివరి ఓవర్లో సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తక్కువగా ఉంచాల్సి వచ్చింది. ఇదే రాజస్థాన్ ఓటమికి కారణమైంది. 6 బంతుల్లో 15 పరుగులు అవసరమైన సందర్భంలో.. సర్కిల్ బయట ఓ ఫీల్డర్ తక్కువగా ఉండటంతో గుజరాత్ బ్యాటర్లు ఫ్రీగా షాట్లు ఆడి గెలుపుకు కావాల్సిన పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు సర్కిల్ పై నుంచి సులువుగా షాట్లు ఆడి మూడు బౌండరీలు సాధించారు. ఇన్నింగ్స్ చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు. దీనికి ముందు కుల్దీప్ సేన్ 19వ ఓవర్లో 20 పరుగులిచ్చి గుజరాత్‌ను గెలుపు లైన్లో నిలబెట్టాడు. మ్యాచ్ ఆరంభంలో ఇదే కుల్దీప్ 10 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను మ్యాచ్‌లోకి తెచ్చాడు. మొత్తంగా చూస్తే స్లో ఓవర్ రేటే రాజస్థాన్ పాలిట శాపంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో యశస్వి 24, బట్లర్ 8, హెట్‌మైర్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్‌ను రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లు ఆడి గెలిపించారు. ఈ ఇద్దరు ఆఖరి రెండు ఓవర్లలో 37 పరుగులు రాబట్టి రాజస్థాన్‌కు గెలుపును దూరం చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌కు తొలుత సాయి సుదర్శన్ (35), శుభ్‌మన్ గిల్ (72) గట్టి పునాది వేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ వేడ్ 4, అభినవ్ మనోహర్ 1, విజయ్ శంకర్ 16, షారుక్ ఖాన్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. కుల్దీప్ సేన్ (4-0-41-3), చహల్ (4-0-43-2) రాణించినప్పటికీ రాజస్థాన్‌కు ఓటమి తప్పలేదు. -
అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికిరాలేదు
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున రాహుల్ తెవాటియా సూపర్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్ వచ్చి సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ సిక్సర్ల తెవాటియాగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సిక్సర్ల తెవాటియా ఇషాంత్ అనుభవం ముందు తలవంచాల్సి వచ్చింది. అభినవ్ మనోహర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెవాటియా ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నోర్ట్జేకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మ్యాచ్‌ను దాదాపు లాగేసుకున్నంత పని చేశాడు. ఇక చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 12 పరుగులు అవసరమైన దశలో ఇషాంత్ శర్మ అద్బుతంగా బౌలింగ్ వేశాడు. ఒత్తిడిలో సూపర్‌గా బౌలింగ్ చేసిన ఇషాంత్ ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు. Photo: IPL Twitter తొలి బంతికి హార్దిక్ పాండ్యా రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీయడంతో తెవాటియా మరోసారి స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక మ్యాచ్ గుజరాత్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఇషాంత్ బౌలింగ్‌లో తన అనుభవాన్ని చూపించాడు. మూడో బంతిని తెలివిగా ఆన్ది లైన్ వేయడంతో డాల్బాల్ వచ్చింది. ఇక నాలుగో బంతిని తెవాటియా ఎక్స్ట్రా కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడాలనుకున్నాడు. కానీ ఇషాంత్ అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికి రాలేదు. బౌన్స్ అయిన బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. రిలీ రొసౌ పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకోవడంతో తెవాటియా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యాఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత రెండు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో మూడు పరుగులే తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. Ishant Sharma the champion - Delhi Capitals defended 130 at GT's home ground. What a bowling effort! pic.twitter.com/rWsTdbzoIE — Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2023 చదవండి: ఏడో నెంబర్లో వచ్చి అదరగొట్టాడు.. ఎవరీ అమన్ హకీమ్ ఖాన్? -
SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు!
IPL 2023 SRH Vs MI- Brian Lara Comments: తమ జట్టు మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాల్సి ఉందని.. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చగల ఫినిషర్ల అవసరం ఉందని పేర్కొన్నాడు. తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు సన్‌రైజర్స్‌లో కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అలా కథ ముగిసింది టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. దీంతో 14 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో రైజర్స్ గెలుపొందాలంటే 20 పరుగులు అవసరమైన వేళ.. రోహిత్ శర్మ..అర్జున్ టెండుల్కర్ చేతికి బంతినిచ్చాడు. అప్పటికి భువనేశ్వర్ కుమార్‌తో పాటు క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్.. చివరి ఓవర్ రెండో బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మయాంక్ మార్కండే క్రీజులోకి రాగా.. రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు రాగా.. మరుసటి బంతికి అర్జున్.. భువీని పెవిలియన్‌కు పంపడంతో సన్‌రైజర్స్ కథ ముగిసింది. వాళ్లలాంటి ఆటగాళ్లు కావాలి ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రైజర్స్ కోచ్ లారా మాట్లాడుతూ.. ‘‘మేము ఆ విషయం(మిడిలార్డర్)లో ఇంకా కసరత్తులు చేస్తున్నాం. మ్యాచ్ చివరి వరకు ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో ఉండాలి. తెవాటియా, మిల్లర్ లాంటి ప్లేయర్ల అవసరం మాకు ఉంది. ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేయాలో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్లను తయారు చేసుకోగలగాలి. మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈరోజైతే మేము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడిపోయాం అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు. కాగా 2022లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఫినిషర్లుగా అద్భుత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో సన్‌రైజర్స్ పరాజయాల సంఖ్య మూడుకు చేరగా 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదోస్థానానికి పడిపోయింది. చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్ SRH Vs MI: టెస్టు ప్లేయర్‌తో ఇట్లనే ఉంటది మరి! ‘టాప్ స్కోరర్’ అయితే ఏంటి? Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally. Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS — IndianPremierLeague (@IPL) April 18, 2023 -
జట్టులో ఒక్కరూ తన పట్ల సానుభూతి చూపించలేదు.. నేను మాత్రం: రాహుల్ తెవాటియా
Gujarat Titans- Rahul Tewatia- Yash Dayal: ‘‘అతడు మా ప్రధాన బౌలర్లలో ఒకడు. గతేడాది మేము చాంపియన్లుగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. కొత్త బంతి చేతికి ఇచ్చినప్పుడల్లా తనదైన శైలిలో దూసుకుపోయాడు. గతేడాది డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అలాంటిది ఒక్క మ్యాచ్‌లో ఫలితం వల్ల.. అతడు మా జట్టుకు చేసిన మేలును ఎలా మర్చిపోతాం. కానీ నాకు తెలిసి జట్టులో ఒక్కరు కూడా అతడికి పట్ల సానుభూతితో వ్యవహరించినట్లు కనబడలేదు. నేను మాత్రం తనతో మాట్లాడాను. నీదైన రోజున తప్పకుండా ‘‘ఒక్క మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైనంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. ఎదురు దెబ్బలు తగిలితేనే మరింత వేగంగా పుంజుకోగలవు. జట్టులో ఎవరూ నిన్ను ఏమీ అనరు. ఏదేమైనా ప్రాక్టీసును వదలకు. నీ వ్యూహాలను మైదానంలో పక్కాగా అమలు చేస్తూ ఉండు. నీదైన రోజు తప్పకుండా విమర్శకులకు ఆటతోనే సమాధానం చెబుతావు. ఇదే అత్యంత గడ్డుకాలం.. ఇంతకు మించిన కఠిన పరిస్థితులు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు’’ అని ధైర్యం చెప్పాను’’ అని గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా అన్నాడు. అదో పీడకల తోటి ఆటగాడు, యశ్ దయాల్ గురించి చెబుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ యశ్ దయాల్‌కు పీడకలగా మిగిలిపోయిన విషయం తెలిసిందే. యశ్ బౌలింగ్‌లో కేకేఆర్ హిట్టర్ రింకూ సింగ్ ఆఖరి ఓవర్లో 5 బంతులను సిక్సర్లుగా మలిచి జట్టుకు సంచలన విజయం అందించాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో చెత్త రికార్డు నమోదు చేసిన యశ్ దయాల్.. ముఖం చేతుల్లో దాచుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక గురువారం నాటి పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. మరోసారి బెస్ట్ ఫినిషర్‌గా ఈ మ్యాచ్‌లో బౌండరీ బాది గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చి మరోసారి బెస్ట్ ఫినిషర్ అనిపించుకున్న రాహుల్ తెవాటియా .. యశ్ దయాల్‌కు అండగా నిలబడ్డాడు. అదే విధంగా తన విజయ రహస్యం గురించి చెబుతూ.. గత మూడు- నాలుగేళ్లుగా అవిరామంగా ప్రాక్టీసు చేస్తున్నానని వెల్లడించాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగాలంటే సానుకూల దృక్పథం ఉండాలని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. గతేడాది యశ్ దయాల్.. గుజరాత్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. చదవండి: IPL 2023: హార్దిక్ పాండ్యాకు షాక్! ఈ సీజన్లో.. వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ "Because he's the Knight #KKR deserves and the one they need right now" - Rinku Singh 😎#GTvKKR #TATAIPL #IPLonJioCinema | @KKRiders pic.twitter.com/b1QrN3fLjX — JioCinema (@JioCinema) April 9, 2023 -
'ఫినిష్ చేయాలనుకున్నా.. కానీ తెవాటియాకు రాసిపెట్టుంది'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శుబ్‌మన్ గిల్(49 బంతుల్లో 67, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్ విజయంలో గిల్ కీలకపాత్ర పోషించాడు. ఇక మ్యాచ్ విజయం అనంతరం గిల్ మాట్లాడుతూ.. ''ఈ వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలెంజింగ్‌గా అనిపించింది. పాత బంతితో సిక్సర్లు కొట్టడం అంత తేలికైన విషయం కాదు. అందునా ఇది చాలా పెద్ద గ్రౌండ్. గ్యాప్ చూసి పరుగులు చేయడం కష్టంగా అనిపించింది. మ్యాచ్ నేనే ఫినిష్ చేయాలనుకున్నాకానీ కుదరలేదు. పంజాబ్ కింగ్స్‌తో ఉన్న అనుబంధం అనుకుంటా తెవాటియాకు మ్యాచ్ గెలిపించాలని రాసిపెట్టి ఉంది. ఇక ఇలాంటి మ్యాచ్‌ల్లో ఇరుజట్లపై ఒత్తిడి ఉంటుంది. చేధించాల్సింది పెద్ద స్కోరు కానప్పటికి పిచ్ కాస్త కఠినంగా ఉంది. ఇక మోహిత్ శర్మ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన యార్కర్ డెలివరీలతో పంజాబ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. నిజంగా గుజరాత్ తరపున మోహిత్‌కు ఇది గొప్ప డెబ్యూట్‌గా నిలిచిపోనుంది'' అని చెప్పుకొచ్చాడు. WHAT A SHOT, SHUBMAN GILL 🔥pic.twitter.com/8oPJcUZfAQ — Johns. (@CricCrazyJohns) April 13, 2023 -
తెవాటియా స్టన్నింగ్ క్యాచ్.. బ్యాటర్‌కు మైండ్‌బ్లాక్
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ వేసిన బౌన్సర్‌ను ఆడే ప్రయత్నంలో భుజం ఎత్తులో బ్యాట్‌కు తగిలి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. 24 మీటర్ల దూరంలో ఉన్న తెవాటియా కొంచెం ముందుకు పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అయితే బంతి కింద పడిందేమోనన్న అనుమానంతో రివ్యూకు వెళ్లిన రొసౌకు నిరాశే మిగిలింది. రిప్లేలో తెవాటియా క్యాచ్‌లో ఎలాంటి పొరపాటు లేదని తేలింది. దీంతో రొసౌకు మైండ్‌బ్లాక్ అయింది. అంతేకాదు ఆడిన తొలి బంతికే ఔటైన రొసౌ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 0:07 - Stunning Catch by Rahul Tewatia🙌#DCvGT #IPL2023 pic.twitter.com/c94fIN3D03 — 12th Khiladi (@12th_khiladi) April 4, 2023 చదవండి: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ధోనికి అరుదైన గౌరవం -
'ఐర్లాండ్‌తో సిరీస్‌కు అతడిని జట్టులోకి తీసుకోవాల్సింది'
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఉమ్రాన్ మాలిక్, ఆర్షదీప్ సింగ్,రాహుల్ త్రిపాఠి వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. కాగా ఐర్లాండ్ సిరీస్‌కు ఐపీఎల్లో అదరగొట్టిన రాహుల్ తెవాటియాకు చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే సెలెక్టర్లు అతడికి మరో సారి మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు రాహుల్ తెవాటియాను జట్టులోకి తీసుకుని ఉండాల్సిందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "రాహుల్ తెవాటియా అద్భుతమైన ఆటగాడు. ఐపీఎల్లో మనం చాలా సార్లు చూశాం. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లను ఒంటి చేత్తో తెవాటియా గెలిపించాడు. అతడికి మైదానంలో అన్నివైపులా షాట్లు ఆడగలిగే సత్తా ఉంది. కాబట్టి అతడిని 18వ ఆటగాడిగా ఐర్లాండ్ పర్యటనకు తీసుకోవాల్సింది" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IRE vs IND: టీమిండియాలో నో ఛాన్స్.. రాహుల్ తెవాటియా ట్వీట్ వైరల్..! -
'ట్విటర్‌కు బదులుగా ఆటపై దృష్టి పెట్టు, అప్పుడే జట్టులోకి'
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులోకి తనని ఎంపిక చేయకపోవడంపై రాహుల్ తెవాటియా పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ట్విటర్ వేదికగా 'అంచనాలు బాధిస్తాయి' అంటూ తన నిరాశను వ్యక్తం చేశాడు.ఈ క్రమంలో తెవాటిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ట్విటర్‌కు బదులుగా తన ఆటపై ఎక్కువ దృష్టి పెట్టాలని తెవాటియాను సూచించాడు. "ప్రస్తుతం చాలా మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం. కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశారని భావిస్తున్నాను. మీరు ట్విటర్ బదులుగా ఆటపై ఎక్కువగా దృష్టి పెట్టి, అద్భుతమైన ప్రదర్శన చేయాలి. తర్వాత సిరీస్‌లకు జట్టును ఎంపిక చేసేటప్పుడు మీ పేరు ఖచ్చితంగా ఉండేలా చేసుకోవాలి" అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు రాహుల్ తెవాటియా ఎంపికయ్యాడు. అయితే గాయం కారణంగా సిరీస్‌కు ముందే తప్పుకున్నాడు. ఇక ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన తెవాటియా బాగా రాణించాడు. ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్ల్ ఆడిన తెవాటియా.. 147.62 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టుకు బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. చదవండి: IND VS SA T20 Series: భువనేశ్వర్ ఖాతాలో మరో అరుదైన రికార్డు -
టీమిండియాలో నో ఛాన్స్.. రాహుల్ తెవాటియా ట్వీట్ వైరల్..!
ఐర్లాండ్ పర్యటనకు 17 మంది సభ్యలతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఐపీఎల్ అదరగొట్టిన రాహుల్ త్రిపాఠికి భారత జట్టులో తొలి సారిగా చోటు దక్కింది. అయితే మరోసారి ఆల్ రౌండర్ రాహుల్ తెవాటియాకు నిరాశే ఎదరైంది. ఈ సిరీస్‌కు కూడా సెలెక్టర్లు త్రిపాఠికి మొండి చేయి చూపించారు. గత కొన్ని సీజన్లుగా ఐపీఎల్లో రాహుల్ తెవాటియా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ ఏడాది సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడిన తెవాటియా.. తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 16 మ్యాచ్‌ల్లో 147.62 స్ట్రైక్ రేట్‌తో 217 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టుకు బెస్ట్ ఫినిషర్‌గా మారాడు. కాగా ఐర్లాండ్ పర్యటనకు భారత జట్టులో చోటు దక్కక పోవడంతో తెవాటియా నిరాశ చెందాడు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా తెవాటియా తన నిరాశను వ్యక్తం చేశాడు. "అంచనాలు కానీ ఆశలు కానీ పెట్టుకోకూడదు. అవి మనల్ని బాధిస్తాయి" తెవాటియా ట్విట్ చేశాడు. కాగా ప్రస్తుతం తెవాటియా ట్వీట్ వైరల్‌గా మారింది. ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత టీ20 జట్టు: హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, చహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, ఆవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Ranji Cricketer Kamal Singh Life Story:'14 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించి.. అరంగేట్రంలోనే సెంచరీతో' Expectations hurts 😒😒 — Rahul Tewatia (@rahultewatia02) June 15, 2022 -
'నోటితో చెప్పొచ్చుగా'.. సహనం కోల్పోయిన తెవాటియా
ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రనౌట్ అయ్యే అవకాశం నుంచి తృటిలో తప్పించుకున్న రాహుల్ తెవాటియా తన సహనాన్ని కోల్పోయాడు. కోపంతో ఊగిపోయిన తెవాటియా నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న సాయి సుదర్శన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ ఓవర్లో ఒక బంతికి తెవాటియా సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. సగం పిచ్ దాటి వచ్చిన తెవాటియాకు సుదర్శన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో వెనక్కి పరిగెట్టిన తెవాటియా కొద్దిలో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించకున్నాడు. వెంటనే సాయి సుదర్శన్ వైపు తిరిగిన తెవాటియా.. సింగిల్ వద్దని నోటితో చెప్పొచ్చుగా అంటూ సీరియస్ లుక్ ఇస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక పంజాబ్‌తో మ్యాచ్‌లో గుజరాత్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు సాహా, గిల్లు తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. Tewatia angry! pic.twitter.com/7okGTIC0S8 — Cricketupdates (@Cricupdates2022) May 3, 2022 -
IPL 2022- అది స్నేక్షాట్.. ఇలా ఎందుకు అన్నానంటే: రషీద్
‘రషీద్ ఖాన్ బౌలింగ్ మరీ అంత గొప్పగా ఏమీ ఉండదు’.. రషీద్ గతంలో ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుత బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా చేసిన వ్యాఖ్య ఇది. ఆ మాటలను నిజం చేస్తూ బుధవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ ప్లేయర్ రషీద్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. నాలుగు ఓవర్ల పూర్తి బౌలింగ్ చేసిన అతడు ఏకంగా 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. గతంలో వికెట్ తీయని సందర్భంలో 35 పరుగులకు మించి ఇవ్వని ఈ ఆఫ్గనిస్తాన్ స్పిన్నర్ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు. అయితే, ఎస్ఆర్హెచ్లో మ్యాచ్‌తో బౌలర్‌గా విఫలమైనా.. బ్యాటర్‌గా ఆకాశమే హద్దుగా చెలరేగాడు రషీద్. గుజరాత్ ఓడిపోతుందనకున్న తరుణంలో రాహుల్ తెవాటియాతో కలిసి అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి వరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రషీద్.. 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును టాప్-1లో నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఒక సిక్సర్, మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు రషీద్. ఈ విషయం గురించి మ్యాచ్ అనంతరం తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాహుల్ తెవాటియాతో జరిగిన చిట్‌చాట్‌లో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భువీ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌కు స్నేక్ షాట్‌గా రషీద్ నామకరణం చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘దీనిని నేను స్నేక్ షాట్ అని చెబుతాను. పాము ఒకరిని కాటేసిన తర్వాత వెంటనే వెనక్కి జరుగుతుంది కదా! అలాగే బాల్ దూసుకువచ్చిన సమయంలో నా బాడీ పొజిషన్ సరిగా లేనట్లయితే షాట్ బాదలేను. ఆ బంతిని అంచనా వేసిన తర్వాత రిస్ట్ పవర్ ఉపయోగిస్తేనే దానిని బాదగలనని అర్థమైంది’’ అని చెప్పుకొచ్చాడు. కాగా 18వ ఓవర్ నాలుగో బంతిని యార్కర్‌గా సంధించాలనుకున్న భువీ ప్రయత్నం విఫలం కాగా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రషీద్ బ్యాట్‌తో బంతిని బలంగా బాది ఆరు పరుగులు పిండుకున్నాడు. ఈ షాట్ కాస్త ధోని హెలికాప్టర్ షాట్‌ను పోలి ఉన్నా బ్యాటర్ తల చుట్టూ కాకుండా బ్యాట్ యథాస్థానంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రషీద్ దానిని స్నేక్ షాట్ అని పేర్కొనడం విశేషం. చదవండి👉🏾 Umran Malik: అతడిని వీలైనంత త్వరగా టీమిండియాకు సెలక్ట్ చేసి.. On the mic: @gujarat_titans captain @hardikpandya7 interviews the star finishers of Wankhede - @rashidkhan_19 and @rahultewatia02. 👌 👌 - By @28anand Full interview 🎥 🔽 #TATAIPL | #GTvSRH https://t.co/UXfkyolepN pic.twitter.com/4cRVsSYD4U — IndianPremierLeague (@IPL) April 28, 2022 WHAT. A. GAME! 👌👌 WHAT. A. FINISH! 👍👍 We witnessed an absolute thriller at the Wankhede and it's the @gujarat_titans who edged out #SRH to seal a last-ball win! 🙌 🙌 Scorecard ▶️ https://t.co/r0x3cGZLvS #TATAIPL #GTvSRH pic.twitter.com/jCvKNtWN38 — IndianPremierLeague (@IPL) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తెవాటియా సిక్సర్ కొట్టగానే స్టెప్పులు.. ఇంతకీ ఎవరామె?!
తమదైన రంగంలో జీవిత భాగస్వామి రాణిస్తే... సదరు భర్త లేదంటే భార్య పొందే ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. వాళ్లు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కితే సంతోషంతో కళ్లు చెమర్చడం సహజం. గుజరాత్ టైటాన్స్ క్రికెటర్ రాహుల్ తెవాటియా సతీమణి రిద్ధి పన్ను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. చేజారిందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి నిమిషంలో వరుస షాట్లు బాది తన భర్త జట్టును గెలిపించిన తీరు చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆనందంతో చిన్నగా స్టెప్పులేస్తూ తన బెస్టాఫ్ను చూస్తూ మురిసిపోయారు. ఐపీఎల్-2022 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. చివరి వరకు నువ్వా- నేనా అంటూ సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో గుజరాత్ విజయానికి 12 పరుగులు అవసరమైన తరుణంలో తెవాటియా బ్యాట్ ఝులిపించాడు. ఓడియన్ స్మిత్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలుపొంది.. అరంగేట్ర సీజన్లో హార్దిక్ పాండ్యా సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఇక నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో తెవాటియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులతో పాటు అతడి భార్య రిద్ధి కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు. తన భర్త ఈ ఫీట్ పూర్తి చేస్తాడా లేదా అన్న కంగారు ఆమె ముఖంలో కనిపించింది. అయితే, వరుస షాట్లతో తెవాటియా విరుచుకుపడటంతో రిద్ధి ఆనందంలో ముగినిపోయారు. చిరునవ్వులు చిందిస్తూ... భర్త విజయాన్ని ఆస్వాదిస్తూ ఎగిరి గంతేశారు. ఈ క్రమంలో వైట్ టాప్‌లో తళుక్కుమన్న రిద్ధిపై కెమెరాలు దృష్టి సారించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా దేశవాళీ క్రికెట్లో హర్యానా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రాహుల్ తెవాటియా గతంలో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా కొత్త ఫ్రాంఛైజీ గుజరాత్ టైటాన్స్ అతడిని కొనుగోలు చేసింది. ఇక గతేడాది ఫిబ్రవరిలో రిద్ధితో నిశ్చితార్థం చేసుకున్న తెవాటియా.. నవంబరులో ఆమెను వివాహమాడాడు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లి వేడుకకు నితీశ్ రాణా, రిషభ్ పంత్, యజువేంద్ర చహల్ తదితర టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. చదవండి: Who Is Sai Sudharsan: ఎవరీ సాయి సుదర్శన్? ధర కేవలం 20 లక్షలే.. అయినా గానీ! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41 — IndianPremierLeague (@IPL) April 8, 2022 -
నిజానికి ఇది కింగ్స్ గేమ్.. ఆ ముగ్గురి వల్లే ఇదంతా!
IPL 2022 GT Vs PBKS: ‘‘తెవాటియాకు హ్యాట్సాఫ్. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగి .. హిట్టింగ్ ఆడటం చాలా కష్టం. ముఖ్యంగా ఒత్తిడిని జయించి ఈ స్థాయిలో రాణించడం అమోఘం’’ అని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ జట్టు బ్యాటర్ రాహుల్ తెవాటియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. అదే విధంగా శుభ్‌మన్ గిల్(59 బంతుల్లో 96 పరుగులు), సాయి సుదర్శన్(30 బంతుల్లో 35) పట్టుదలగా నిలబడిన కారణంగానే తాము చివరి వరకు మ్యాచ్‌ను తీసుకురాగలిగామని పేర్కొన్నాడు. వారిద్దరి మెరుగైన భాగస్వామ్యం తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని హార్దిక్ తెలిపాడు. కాగా శుక్రవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. తద్వారా క్యాష్ రిచ్ లీగ్ ఎంట్రీలోనే హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసిన జట్టుగా పాండ్యా సేన నిలిచింది. ఆఖరి వరకు తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో తెవాటియా చివరి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన వేళ రెండు సిక్సర్లు కొట్టి జట్టుకు గుర్తుండిపోయే గెలుపును అందించాడు. దీంతో చివరి వరకు పోరాడిన పంజాబ్ కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. నిజానికి ఇది కింగ్స్ గేమ్. వాళ్ల పట్ల నాకు సానుభూతి ఉంది. నిజంగా బాగా ఆడారు. తెవాటియా అద్భుతంగా ఆడాడు. గిల్ నేనున్నాంటూ అందరికీ భరోసా ఇచ్చాడు. ఇక గిల్‌తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పిన ఘనత సాయికి దక్కుతుంది. వాళ్ల వల్లే మేము చివరి వరకు పోటీలో నిలవగలిగాం. నా ఆటతీరు కూడా రోజురోజుకీ మెరుగుపడుతోంది. నిజానికి నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ చేసేసరికి అలసిపోతున్నా. అయితే, మ్యాచ్ మ్యాచ్‌కు నా ఆట తీరును మెరుగుపరచుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేయడంతో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 36 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు పంజాబ్–189/9 (20) గుజరాత్– 190/4 (20) చదవండి: IPL 2022: వారెవ్వా తెవాటియా.. ధోని తర్వాత... 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41 — IndianPremierLeague (@IPL) April 8, 2022 -
IPL 2022: వారెవ్వా తెవాటియా.. ధోని తర్వాత...
IPL 2022 GT Vs PBKS: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ.. ఇంకొక్క సిక్సర్ కొడితే చాలు... విజయం వరిస్తుంది.. ఐపీఎల్లో అరంగేట్ర సీజన్లోనే విజయాల హ్యాట్రిక్ కొట్టిన జట్టుగా పేరూ వస్తుంది.. పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పరిస్థితి ఇది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒత్తిడిని అధిగమించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు రాహుల్ తెవాటియా. తద్వారా గుజరాత్ టైటాన్స్‌కు చిరస్మరణీయ విజయం అందించాడు. ఈ క్రమంలో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తెవాటియా చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని సరసన చేరాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో విజయానికి 2 బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో రెండు వరుస సిక్స్‌లతో టీమ్‌ను గెలిపించిన రెండో ప్లేయర్‌గా తెవాటియా నిలిచాడు. 2016లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ధోని పుణే సూపర్ జెయింట్స్ తరఫున ఈ ఘనత సాధించాడు. కాగా పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ఓడియన్ స్మిత్‌కు తెవాటియా చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న తెవాటియా 2 సిక్సర్ల సాయంతో 13 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ఇక విధ్వసంకర ఆట తీరుతో విరుచుకుపడిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్(59 బంతుల్లో 96 పరుగులు– 11 ఫోర్లు, ఒక సిక్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు పంజాబ్–189/9 (20) గుజరాత్– 190/4 (20) చదవండి: Shubman Gill: సెంచరీ మిస్.. అయినా 'రికార్డు' సృష్టించిన గిల్! 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41 — IndianPremierLeague (@IPL) April 8, 2022 -
IPL 2022: ఎదురులేని టైటాన్స్
ముంబై: పంజాబ్‌పై విజయం కోసం గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్లో 19 పరుగులు చేయాలి. తొలి 4 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. సమీకరణం 2 బంతుల్లో 2 సిక్సర్లకు మారింది! తీవ్ర ఒత్తిడి మధ్య ఇలాంటి స్థితిలో రెండు వరుస సిక్సర్లు బాదడం పేరొందిన బ్యాటర్లకు కూడా అంత సులువు కాదు. అయితే రాహుల్ తెవాటియా దానిని చేసి చూపించాడు. రెండేళ్ల క్రితం ఇదే పంజాబ్‌పై రాజస్తాన్ తరఫున ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదిన మ్యాచ్‌ను గుర్తుకు తెస్తూ ఈసారి చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలచి గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (59 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. రషీద్‌కు 3 వికెట్లు... మయాంక్ అగర్వాల్ (5), బెయిర్‌స్టో (8) తక్కువ స్కోరుకే అవుటైనా లివింగ్‌స్టోన్ మెరుపులతో పంజాబ్ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. రషీద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను... నల్కండే ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో చెలరేగాడు. తెవాటియా ఓవర్లో పంజాబ్ 24 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్లో జితేశ్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రెండు భారీ సిక్సర్లు బాదగా, లివింగ్‌స్టోన్ 4, 6 కొట్టాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో జితేశ్, ఒడెన్ స్మిత్ (0)లను నల్కండే పెవిలియన్ పంపించగా, షమీ ఓవర్లో షారుఖ్ (15) కొట్టిన రెండు వరుస సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అయితే కనీసం 200 స్కోరు ఖాయమనుకుంటున్న దశలో పంజాబ్ 9 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది. సెంచరీ మిస్... వేడ్ (6) ఆరంభంలోనే అవుటైనా, గిల్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. పవర్‌ప్లేలో గుజరాత్ స్కోరు 53 పరుగులకు చేరింది. మరోవైపు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సుదర్శన్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 101 పరుగులు జోడించారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ చేజార్చుకోగా... చివర్లో పాండ్యా కూడా రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) టైటాన్స్‌ను గెలుపు తీరం చేర్చాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రషీద్ (బి) హార్దిక్ 5; శిఖర్ ధావన్ (సి) వేడ్ (బి) రషీద్ 35; బెయిర్‌స్టో (సి) తెవాటియా (బి) ఫెర్గూసన్ 8; లివింగ్‌స్టోన్ (సి) మిల్లర్ (బి) రషీద్ 64; జితేశ్ (సి) గిల్ (బి) నల్కండే 23; స్మిత్ (సి) గిల్ (బి) నల్కండే 0; షారుఖ్ (ఎల్బీ) (బి) రషీద్ 15; రబడ (రనౌట్) 1; రాహుల్ చహర్ (నాటౌట్) 22; వైభవ్ (బి) షమీ 2; అర్ష్‌దీప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189. వికెట్ల పతనం: 1–11, 2–34, 3–86, 4–124, 5–124, 6–153, 7–154, 8–156, 9–162. బౌలింగ్: షమీ 4–0–36–1, హార్దిక్ 4–0–36–1, ఫెర్గూసన్ 4–0–33–1, రషీద్ 4–0–22–3, దర్శన్ నల్కండే 3–0–37–2, తెవాటియా 1–0–24–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వేడ్ (సి) బెయిర్‌స్టో (బి) రబడ 6; గిల్ (సి) మయాంక్ (బి) రబడ 96; సుదర్శన్ (సి) మయాంక్ (బి) చహర్ 35; హార్దిక్ (రనౌట్) 27; మిల్లర్ (నాటౌట్) 6; తెవాటియా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–32, 2–133, 3–170, 4–172. బౌలింగ్: వైభవ్ 4–0– 34–0, అర్ష్‌దీప్ 4–0–31–0, రబడ 4–0–35–2, రాహుల్ చహర్ 4–0–41–1, ఒడెన్ స్మిత్ 3–0–35–0, లివింగ్‌స్టోన్ 1–0–12–0. ఐపీఎల్లో నేడు హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి బెంగళూరు X ముంబై ఇండియన్స్ వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం 𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41 — IndianPremierLeague (@IPL) April 8, 2022 -
లవ్ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా: తెవాటియా
న్యూఢిల్లీ: ఐపీఎల్-2021 వాయిదా పడటంతో పలు ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా వేదికగా తమ ఆటగాళ్ల వీడియోలు పోస్ట్ చేస్తూ ఆనందం పంచుతున్నాయి ఈ సీజన్లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలతో పాటుగా, క్రికెటర్ల వ్యక్తిగత ఫన్నీ మూమెంట్స్ షేర్ చేస్తూ వినోదం అందిస్తున్నాయి. తాజాగా రాజస్తాన్ రాయల్స్ ఇలాంటి ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. బయో బబుల్‌లో ఉన్న తమ ఆటగాళ్లతో ఆర్ఆర్ ఓ గేమ్ ఆడించింది. ఇందులో భాగంగా మ్యూజిక్ ఆగిపోయినపుడు పార్శిల్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్లు, ఓ చిట్టీ తెరచి అందులో ఏముంటే అది చేయాలి. ఈ క్రమంలో రాహుల్ తెవాటియా చేతిలోకి పార్శిల్ రాగానే మ్యూజిక్ ఆగిపోవడంతో అతడు టాస్క్ చేయాల్సి వచ్చింది. నీళ్ల బాటిల్‌కు ప్రపోజ్ చేయాలని చిట్టీలో ఉండటంతో.. మెల్లగా బాటిల్ తీసుకున్న అతడు.. ముసిముసిగా నవ్వుతూ తొలుత సీనియర్ల సలహాలు అడిగాడు. ఆ తర్వాత తానే రంగంలోకి దిగి.. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ ప్రపోజల్ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాదవ్ 𝐑𝐚𝐡𝐮𝐥 𝐓𝐞𝐰𝐚𝐭𝐢𝐚 𝐣𝐮𝐬𝐭 𝐩𝐫𝐨𝐩𝐨𝐬𝐞𝐝! 😱#RoyalsFamily | @rahultewatia02 pic.twitter.com/blpyJveitS — Rajasthan Royals (@rajasthanroyals) May 9, 2021 -
ఏంది మీ ఓవరాక్షన్.. ఎంత క్యాచ్‌లు పడితే మాత్రం
ముంబై: కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లైన రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియాలు తమ చర్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టినప్పుడల్లా తెవాతియా అతని దగ్గరికి వచ్చి చేతిలో మొబైల్ ఉన్నట్లు ఊహించుకొని సెల్ఫీలు దిగడం చేశారు. 36 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నించి పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తెవాతియా పరాగ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగినట్లుగా పోజిచ్చి వెళ్లాడు. రెండోసారి రసెల్ ఔటైనప్పుడు కూడా పరాగ్, తెవాతియాలు ఈ విధంగా చేయడం వైరల్‌గా మారింది. వీరి ఫోజు చూసిన నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. ''ఎంత క్యాచ్‌లు పడితే మాత్రం... ఏంది మీ ఓవరాక్షన్'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో మోరిస్ విజృంభించడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. రెండు ఓవర్ల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. దినేశ్ కార్తిక్ 25 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, సకారియా, ముస్తాఫిజుర్, ఉనాద్కట్‌లు చెరో వికెట్ తీశారు. చదవండి: మేము కూడా బౌలింగ్ తీసుకోవాలనుకున్నాం 'ఐపీఎల్లో ఆడినా.. జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాలేడు' Riyan Parag's selfie celebrate 😂❤️ Parag #RRvKKR #KKRvRR pic.twitter.com/9LvG9Bpcx9 — Asmita Thakkar(asmi) (@AsmiThakkar) April 24, 2021 -
ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమైన సిక్సర్ల వీరుడు..
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా బీసీసీఐ నిర్వహించిన ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు సమాచారం. ఇదే నిజమైతే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలన్న అతని ఆశలపై నీలినీడలు కమ్ముకున్నట్టే. గతేడాది ఐపీఎల్లో విండీస్ బౌలర్ కాట్రెల్‌పై వరుసగా 5 సిక్సర్లతో విరుచుకుపడ్డ తెవాటియా.. ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చి ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం తొలిసారిగా పిలుపునందుకున్నాడు. బీసీసీఐ ఫిట్నెస్ ప్రమాణాల ప్రకారం జట్టులో చోటు దక్కాలంటే ప్రతి ఆటగాడు యోయో టెస్ట్‌లో 17.1 పాయింట్లు సాధించాలి. లేదా 8.5 నిమిషాల్లో 2 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి. కానీ, రాహుల్ తెవాటియా ఈ రెంటిలోనూ విఫలమైనట్లు సమాచారం. తెవాటియాతో పాటు జట్టులోకి ఎంపికైన కోల్‌కతా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఫిట్నెస్ టెస్ట్‌లో విఫలమైనట్లు తెలుస్తోంది. -
ఇన్నాళ్ల నిరీక్షణ ముగిసింది.. కంగ్రాట్స్
ఢిల్లీ: ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్‌తో పాటు ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాలకు కూడా చోటు దక్కింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరిని అభినందిస్తూ ట్వీట్స్ చేశారు. 'ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ సూర్య.. అలాగే ఇషాన్ కిషన్, తెవాటియాలకు కూడా నా అభినందనలు' అంటూ మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు. 'సూర్యను టీమిండియాలో చూడాలనేది ఫైనల్‌గా నెరవేరింది.. గుడ్ లక్ సూర్య.. ఆల్ ది బెస్ట్' అని ట్వీట్ చేశాడు. ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియా, సూర్యకుమార్ యాదవ్‌లకు ఇవే నా అభినందనలు.. టీమిండియాలో మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా' అంటూ ఆర్పీ సింగ్ ట్వీట్ చేశాడు. కాగా గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలు అదరగొట్టే ప్రదర్శన చేశారు.ముంబై ఇండియన్స్ తరపున సూర్యకుమార్ 16 మ్యాచ్‌ల్లో 480 పరుగులు చేయగా.. ఇషాన్ కిషన్ 14 మ్యాచ్‌ల్లో 516 పరుగులతో దుమ్మురేపాడు. ఇక రాజస్తాన్ తరపున ఆడిన రాహుల్ తెవాటియా 14 మ్యాచ్‌ల్లో 255 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు. కాగా విజయ్ హజారే ట్రోపీలో శనివారం జార్ఖండ్, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 94 బంతుల్లోనే 173 పరుగుల తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు.. 11 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఇంగ్లండ్, టీమిండియాల మధ్య ఐదు టీ20ల సిరీస్ మార్చి 12 నుంచి జరగనుంది. చదవండి: సూర్య కుమార్, తెవాటియాలకు చాన్స్ ఇషాన్ కిషన్ విశ్వరూపం -
సూర్య కుమార్, తెవాటియాలకు చాన్స్
ముంబై: ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ఐదు టి20 మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌తో తలపడే భారత జట్టులో అతనికి చోటు దక్కింది. అహ్మదాబాద్‌లో జరిగే ఈ సిరీస్ కోసం 19 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించారు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీలో కూడా ముంబై తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడినా... ఇన్నాళ్లూ సూర్యకుమార్‌కు టీమిండియాలో అవకాశం లభించలేదు. ఐపీఎల్‌లోనే రాజస్తాన్ తరఫున ఆకట్టుకున్న రాహుల్ తెవాటియాకు కూడా తొలిసారి భారత జట్టు పిలుపు వచ్చింది. ముంబై ఇండియన్స్ తరఫునే పలు దూకుడైన ఇన్నింగ్స్‌లు ఆడిన జార్ఖండ్ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా తొలి సారి భారత జట్టుకు ఎంపిక కావడం విశేషం. రిషభ్ పంత్ జట్టులో ఉన్నా, రెండో వికెట్ కీపర్‌గా కిషన్‌ను ఎంపిక చేసిన కమిటీ... సంజు సామ్సన్‌పై వేటు వేసింది. బ్యాట్స్‌మన్ మనీశ్ పాండే, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను కూడా జట్టునుంచి తప్పించారు. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై గాయం కారణంగా చివరి నిమిషంలో తప్పుకున్న స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి సెలక్టర్లు మరో అవకాశం కల్పించారు. గాయంనుంచి కోలుకొని భువనేశ్వర్ కుమార్ పునరాగమనం చేస్తుండగా... ఊహించినట్లుగా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. 12 మార్చినుంచి 20 మార్చి వరకు మొటెరా స్టేడియంలోనే ఐదు టి20లు జరుగుతాయి. జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), రోహిత్ (వైస్ కెప్టెన్), రాహుల్, ధావన్, అయ్యర్, సూర్యకుమార్, హార్దిక్, పంత్, ఇషాన్ కిషన్, చహల్, చక్రవర్తి, అక్షర్, సుందర్, తెవాటియా, నటరాజన్, భువనేశ్వర్, దీపక్ చహర్, నవదీప్, శార్దుల్ -
నిశ్చితార్ధం చేసుకున్న సిక్సర్ల వీరుడు..
చంఢీగడ్: రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాతియా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. గత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున సిక్సర్లతో అదరగొట్టిన ఈ హర్యానా కుర్రాడు..బుధవారం నిశ్చితార్ధం చేసుకున్నాడు. నిశ్చితార్ధానికి సంబంధించిన ఫోటోలను గురువారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అభిమానులతో సహా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు వీరి జంటకు శుభాకాంక్షలు తెలిపారు. తెవాతియాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీశ్ రాణా, అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ తదితరులు ఉన్నారు. తెవాతియా చివరిసారిగా హర్యానా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో హర్యానా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. కాగా, తెవాతియాను ఐపీఎల్ వేళానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు అంటిపెట్టుకుంది. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన తెవాతియా గతేడాది ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పేసర్ షెల్టన్ కాట్రెల్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది వెలుగులోకి వచ్చాడు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన మరో ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ కూడా మంగళవారం వివాహం చేసుకున్నాడు. -
‘వారి వల్ల కాకపోతే తెవాటియా గెలిపిస్తాడు’
లండన్: కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ను రాహుల్ తెవాటియా గెలిపిస్తాడని అంటున్నాడు ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్. కచ్చితంగా తెవాటియా ఒక మ్యాచ్ విన్నర్ అని, అది కింగ్స్ పంజాబ్‌తో మ్యాచ్‌లో చూస్తామన్నాడు. రాజస్తాన్ రాయల్స్ జట్టులో రియల్ టాలెంట్ ఉందంటూ స్వాన్ కొనియాడాడు. కింగ్స్ పంజాబ్ జట్టు క్రిస్ గేల్ వచ్చిన తర్వాత బలంగా మారిపోయిందని విషయంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. కానీ రాజస్తాన్ జట్టు కూడా విదేశీ ఆటగాళ్లతో చాలా పటిష్టంగా ఉందన్నాడు. స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో మాట్లాడిన స్వాన్.. రాజస్తాన్ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. ఇక్కడ తెవాటియాను మ్యాచ్ విన్నర్‌గా ప్రశంసించాడు. (ఈపీఎల్‌ను దాటేసిన ఐపీఎల్!) ‘కింగ్స్ పంజాబ్ చాలా బలమైన జట్టు. అందులో ఎటువంటి సందేహం లేదు. గేల్ వచ్చిన తర్వాత పంజాబ్ ఆటే మారిపోయింది. కానీ రాజస్తాన్ కూడా బలమైన జట్టే. ఓవర్సీస్ ఆటగాళ్లతో రాజస్తాన్ బలంగా ఉంది. బట్లర్, స్టోక్స్, స్మిత్, ఆర్చర్లు వారి ప్రధాన బలం. వారు భయంలేని క్రికెట్ ఆడతారు. ఒకవేళ వీరంతా విఫలమైతే తెవాటియా రాజస్తాన్‌ను గెలిపిస్తాడు. ఈ ఐపీఎల్లో ఎవరు ముఖ్యపాత్ర పోషించే బౌలర్ అని అడిగిన ప్రశ్నకు ఆర్చర్ అని సమాధానమిచ్చాడు స్వాన్.ఈ సీజన్లో తెవాటియా 12 మ్యాచ్‌ల్లో 224 పరుగులు సాధించాడు. అందులో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 53. అది కూడా పంజాబ్‌పైనే కొట్టాడు తెవాటియా. పంజాబ్‌పై అతని యావరేజ్ 44.80గా ఉండగా, స్టైక్‌రేట్ 143.58గా ఉంది. ఇక బౌలింగ్‌లో 7.15 ఎకానమీతో 7 వికెట్లు సాధించాడు. (ప్లేఆఫ్స్ రేసు: ఎవరికి ఎంత అవకాశం?) -
అతనికి చాన్స్ ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా..: సెహ్వాగ్
దుబాయ్: రాజస్తాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియాపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతనికి అవకాశమిస్తే కరోనా వ్యాక్సిన్‌ను కూడా తయారు చేయగలడని తనదైన శైలిలో కొనియాడాడు. ఇప్పటికే తన సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు సంచలన విజయాలందించిన తెవాటియా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా అదరగొట్టాడు.ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓడిపోయినా తెవాటియా పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్ వచ్చిన తెవాటియా (19 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. అనంతరం బౌలింగ్‌లో పడిక్కల్ వికెట్ తీశాడు. ఇక అంతటితో ఆగకుండా బౌండరీ లైన్ వద్ద సూపర్ క్యాచ్‌తో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి(43)ని పెవిలియన్ చేర్చాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా విరాట్ భారీ షాట్ ఆడగా.. బంతి దాదాపు సిక్స్‌గా వెళ్లింది. కానీ ఆ దిశలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తెవాటియా పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని అద్భుతంగా అందుకున్నాడు. ఆ వెంటనే పట్టుతప్పుతున్నట్లు గ్రహించిన ఈ రాజస్తాన్ ఆల్‌రౌండర్.. బంతిని గాల్లోకి ఎగిరేసి మళ్లీ వచ్చి చాకచక్యంగా అందుకున్నాడు. ఇక ఈ క్యాచ్‌కు ఫిదా అయిన సెహ్వాగ్.. రాహుల్ తెవాటియాను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. ఈ సీజన్లో అతను పట్టిందల్లా బంగారమే అవుతుందనే అర్థంలో తనదైన శైలిలో ప్రశంసించాడు. ‘తెవాటియా ఏదైనా చేయగలడు. ఆఖరికి తనకు అవకాశం ఇస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయగలడు. అద్భుతమైన క్యాచ్'అంటూ సెహ్వాగ్ హిందీలో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్లో తెవాటియా సూపర్ క్యాచ్ ఫొటోను కూడా సెహ్వాగ్ పంచుకున్నాడు. Tewatia kuchh bhi kar sakte hain. Agar Covid vaccine banane ka ek mauka mil gaya, toh jaisa unka time chal raha hai , lagta hai bana denge. What a season for him. #RRvRCB pic.twitter.com/WYY5mojrKC — Virender Sehwag (@virendersehwag) October 17, 2020