ముంబై: కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లైన రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియాలు తమ చర్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. విషయంలోకి వెళితే.. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో రియాన్ పరాగ్ క్యాచ్ పట్టినప్పుడల్లా తెవాతియా అతని దగ్గరికి వచ్చి చేతిలో మొబైల్ ఉన్నట్లు ఊహించుకొని సెల్ఫీలు దిగడం చేశారు. 36 పరుగులు చేసిన రాహుల్ త్రిపాఠి ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు యత్నించి పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో తెవాతియా పరాగ్ దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగినట్లుగా పోజిచ్చి వెళ్లాడు. రెండోసారి రసెల్ ఔటైనప్పుడు కూడా పరాగ్, తెవాతియాలు ఈ విధంగా చేయడం వైరల్‌గా మారింది.
వీరి ఫోజు చూసిన నెటిజన్లు వినూత్న రీతిలో స్పందించారు. ''ఎంత క్యాచ్‌లు పడితే మాత్రం... ఏంది మీ ఓవరాక్షన్'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. డెత్ ఓవర్లలో మోరిస్ విజృంభించడంతో కేకేఆర్ తక్కువ స్కోరుకు పరిమితమైంది. రెండు ఓవర్ల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన కేకేఆర్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బ్యాటింగ్‌లో రాహుల్ త్రిపాఠి 36 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. దినేశ్ కార్తిక్ 25 పరుగులు చేశాడు. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ 4, సకారియా, ముస్తాఫిజుర్, ఉనాద్కట్‌లు చెరో వికెట్ తీశారు.
చదవండి: మేము కూడా బౌలింగ్ తీసుకోవాలనుకున్నాం
'ఐపీఎల్‌లో ఆడినా.. జట్టులో రెగ్యులర్ సభ్యుడు కాలేడు'
Riyan Parag's selfie celebrate 😂❤️
— Asmita Thakkar(asmi) (@AsmiThakkar) April 24, 2021
Parag #RRvKKR #KKRvRR pic.twitter.com/9LvG9Bpcx9
Comments
Please login to add a commentAdd a comment