Will You Marry Me - Rajasthan Royals Rahul Tewatia Proposes To Water Bottle In Hilarious Manner - Sakshi
Sakshi News home page

లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా: తెవాటియా

Published Wed, May 12 2021 1:24 PM | Last Updated on Wed, May 12 2021 3:27 PM

IPL 2021 RR Rahul Tewatia Funny Proposal To Water Bottle Will You Marry Me - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌-2021 వాయిదా పడటంతో పలు ఫ్రాంఛైజీలు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆటగాళ్ల వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఆనందం పంచుతున్నాయి ఈ సీజన్‌లో నమోదైన అత్యుత్తమ ప్రదర్శనకు సంబంధించిన దృశ్యాలతో పాటుగా, క్రికెటర్ల వ్యక్తిగత ఫన్నీ మూమెంట్స్‌ షేర్‌ చేస్తూ వినోదం అందిస్తున్నాయి. తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌ ఇలాంటి ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. బయో బబుల్‌లో ఉన్న తమ ఆటగాళ్లతో ఆర్‌ఆర్‌ ఓ గేమ్‌ ఆడించింది. ఇందులో భాగంగా మ్యూజిక్‌ ఆగిపోయినపుడు పార్శిల్‌ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్లు, ఓ చిట్టీ తెరచి అందులో ఏముంటే అది చేయాలి.

ఈ క్రమంలో రాహుల్‌ తెవాటియా చేతిలోకి పార్శిల్‌ రాగానే మ్యూజిక్‌ ఆగిపోవడంతో అతడు టాస్క్‌ చేయాల్సి వచ్చింది. నీళ్ల బాటిల్‌కు ప్రపోజ్‌ చేయాలని చిట్టీలో ఉండటంతో.. మెల్లగా బాటిల్‌ తీసుకున్న అతడు.. ముసిముసిగా నవ్వుతూ తొలుత సీనియర్ల సలహాలు అడిగాడు. ఆ తర్వాత తానే రంగంలోకి దిగి.. ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్‌ యూ.. నన్ను పెళ్లి చేసుకుంటావా? అయినా ఎందుకు చేసుకోవులే’’ అంటూ సిగ్గుపడుతూ ప్రపోజల్‌ పూర్తి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చదవండి: నేను మరీ అంతపనికిరాని వాడినా: కుల్దీప్ యాద‌వ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement