కూల్టర్ నైల్‌కు రోహిత్ అభినందన
డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ప్లే ఆఫ్స్’ ఆశలు నిలబెట్టుకుంది. లీగ్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రోహిత్ సేన తమ బలాన్ని ప్రదర్శించి రాజస్తాన్ రాయల్స్‌ను చిత్తుగా ఓడించి అవకాశం చేజారిపోకుండా కాపాడుకుంది. కూల్టర్ నైల్, నీషమ్ పదునైన బౌలింగ్‌తో రాయల్స్‌ను 90 పరుగులకే పరిమితం చేసిన ముంబై, ఇషాన్ కిషన్ జోరుతో మరో 70 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం విశేషం. తాజా ఫలితంతో రాజస్తాన్ ముందంజ వేసే అవకాశాలు ముగియగా... నాలుగో స్థానం కోసం చివరి మ్యాచ్ ఫలితంతో పాటు రన్‌రేట్ విషయంలో కూడా కోల్‌కతాతో ముంబై పోటీ పడటం ఖాయమైంది.
షార్జా: ముంబై ఇండియన్స్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఐపీఎల్‌లో భారీ విజయాన్ని అందుకుంది. మంగళవారం జరి గిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో రాజస్తాన్‌ను ఓడించింది. ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 90 పరుగులకే పరిమితమైంది. లూయిస్ (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్)దే టాప్ స్కోర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కూల్టర్ నైల్ (4/14), జిమ్మీ నీషమ్ (3/12) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం ముంబై 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 94 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. జయంత్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 15 పరుగులు రావడం మినహా రాజస్తాన్ ఇన్నింగ్స్ పేలవంగా సాగింది.
ముంబై బౌలర్లు కూల్టర్ నైల్, నీషమ్ పదునైన బంతులతో రాయల్స్ పని పట్టారు. యశస్విని అవుట్ చేసి కూల్టర్ నైల్ తొలి వికెట్ అందిం చగా, బుమ్రా బౌలింగ్‌లో లూయిస్ వికెట్ల ముందు దొరికిపోయాడు. నీషమ్ తన వరుస ఓవర్లలో సామ్సన్ (3), దూబే (3) లను డగౌట్ చేర్చడంతో రాజస్తాన్ కుప్పకూలింది. రన్‌రేట్ మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ఛేదనలో దూకుడు కనబర్చిన ముంబై ఫటాఫట్‌గా ముగించింది. ముస్తఫిజుర్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్, సిక్స్‌తో 14 పరుగులు రాబట్టిన రోహిత్ తన ఉద్దేశాన్ని ప్రదర్శించాడు. అతడిని సకారియా అవుట్ చేయడంతో రాజస్తాన్‌కు తొలి వికెట్ దక్కింది. సూర్యకుమార్ (13) మళ్లీ విఫలమయ్యాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్ జోరు మొదలైంది. కుల్దీప్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన కిషన్... సకారియా ఓవర్లో ఫోర్, 2 భారీ సిక్సర్లు బాదాడు. ముస్తఫిజుర్ వేసిన తర్వాతి ఓవర్ తొలి రెండు బంతుల్లోనూ ఫోర్, సిక్స్ కొట్టి ముంబై విజయాన్ని ఖాయం చేశాడు.
స్కోరు వివరాలు: రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: లూయిస్ (ఎల్బీ) (బి) బుమ్రా 24; యశస్వి (సి) ఇషాన్ (బి) కూల్టర్ నైల్ 12; సామ్సన్ (సి) జయంత్ (బి) నీషమ్ 3; దూబే (బి) నీషమ్ 3; ఫిలిప్స్ (బి) కూల్టర్ నైల్ 4; మిల్లర్ (ఎల్బీ) (బి) కూల్టర్ నైల్ 15; తెవాటియా (సి) ఇషాన్ (బి) నీషమ్ 12; గోపాల్ (సి) ఇషాన్ (బి) బుమ్రా 0; సకారియా (బి) కూల్టర్ నైల్ 6; కుల్దీప్ (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 3, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 90. వికెట్ల పతనం: 1–27, 2–41, 3–41, 4–48, 5–50, 6–71, 7–74, 8–76, 9–82.బౌలింగ్: బౌల్ట్ 4–0–24–0, జయంత్ 2–0–17–0, బుమ్రా 4–0–14–2, కూల్టర్ నైల్ 4–0–14–4, నీషమ్ 4–0–12–3, పొలార్డ్ 2–0–9–0. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) యశస్వి (బి) సకారియా 22; ఇషాన్ కిషన్ (నాటౌట్) 50; సూర్యకుమార్ (సి) (సబ్) లోమ్రోర్ (బి) ముస్తఫిజుర్ 13; హార్దిక్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (8.2 ఓవర్లలో 2 వికెట్లకు) 94. వికెట్ల పతనం: 1–23, 2–56. బౌలింగ్: ముస్తఫిజుర్ 2.2–0–32–1, సకారియా 3–1–36–1, గోపాల్ 1–0–9–0, కుల్దీప్ 2–0–16–0.
400
టి20 క్రికెట్‌లో రోహిత్ శర్మ 400 సిక్స్‌ల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఏడో ప్లేయర్‌గా రోహిత్ నిలిచాడు. ఈ జాబితాలో గేల్ (1042) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment