
PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కేవలం 53 బంతుల్లోనే యశస్వి జైశ్వాల్ తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు.
కాగా అతడి ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కావడం గమానార్హం. దీంతో యశస్విపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న జైశ్వాల్‌ను భారత జట్టులోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మ కూడా జైశ్వాల్ ఆటతీరుకు ఫిదా అయిపోయాడు.
అతడిలో అద్భుత టాలెంట్ ఉంది హిట్‌మ్యాన్ కొనియాడాడు. "గతేడాది నుంచి జైశ్వాల్ ఆటతీరును చూస్తున్నాను. అతడు రోజు రోజుకు మరింత మెరుగు అవుతున్నాడు. ఈ తరహా క్రికెట్ ఆడుతుండడం రాజస్తాన్‌తో పాటు భారత క్రికెట్‌కు చాలా మంచిది అని రోహిత్ పోస్ట్‌మ్యాచ్ సందర్భంగా రోహిత్ పేర్కొన్నాడు.
ఇక రోహిత్ చేసిన వాఖ్యలు బట్టి చూస్తే.. త్వరలోనే జైశ్వాల్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20ల నుంచి తప్పుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి రోహిత్ బ్యాకప్ ఓపెనర్‌గా జైశ్వాల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు పలువురు మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: IPL 2023: అంపైర్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్
A maiden #TATAIPL 💯 for Yashasvi Jaiswal 🙌🙌🙌#MIvRR #IPL1000 #IPLonJioCinema pic.twitter.com/W8xyyzEJtS
— JioCinema (@JioCinema) April 30, 2023