టిమ్ డేవిడ్ సంచలన ఇన్నింగ్స్.. ముంబై ఇండియన్స్ ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రెండు పరాజయాల తర్వాత మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకంఉది. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో 213 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19.3ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ 55 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. చివర్లో టిమ్ డేవిడ్ 14 బంతుల్లో 45 నాటౌట్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. తిలక్ వర్మ 29 పరుగులు నాటౌట్ ముంబై ఇండియన్స్‌ను గెలిపించారు.
సూర్యకుమార్(55) ఔట్.. ముంబై 170/4
55 పరుగులు చేసిన సూర్యకుమార్ బౌల్ట్ బౌలింగ్‌లో సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 17 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. తిలక్ వర్మ 20, టిమ్ డేవిడ్ 11 పరుగులతో ఆడుతున్నారు.
14 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 141/3
14 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. సూర్యకుమార్ 48, తిలక్ వర్మ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
10 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 98/2
10 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 43, సూర్యకుమార్ 20 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 28 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ అశ్విన్ బౌలింగ్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
8 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 75/1
8 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 40, ఇషాన్ కిషన్ 28 పరుగులతో ఆడుతున్నారు.
5 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 47/1
ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 25, ఇషాన్ కిషన్ 20 పరుగులతో ఆడుతున్నారు.
Photo Credit : IPL Website
జైశ్వాల్ సెంచరీ.. ముంబై టార్గెట్ 213
రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేశాడు.
Photo Credit : IPL Website
యశస్వి జైశ్వాల్ సెంచరీ.. రాజస్తాన్ 179/6
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
14 ఓవర్లలో రాజస్తాన్ రాయల్స్ 142/3
14 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జైశ్వాల్ 77, హోల్డర్ 11 పరుగులతో ఆడుతున్నారు.
శాంసన్(14) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
14 పరుగులు చేసిన సంజూ శాంసన్ అర్షద్‌ఖాన్ బౌలింగ్‌లో తిలక్‌వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. జైశ్వాల్ 47 పరుగులతో ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
తొలి వికెట్ కోల్పోయిన రాజస్తాన్
18 పరుగులు చేసిన బట్లర్ పియూష్ చావ్లా బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్ వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది.
Photo Credit : IPL Website
జైశ్వాల్ దూకుడు.. 6 ఓవర్లలో రాజస్తాన్ 65/0
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. జైశ్వాల్ 41, బట్లర్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
3 ఓవర్లలో రాజస్తాన్ 26/0
మూడు ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. జైశ్వాల్ 18, బట్లర్ 1పరుగుతో క్రీజులో ఉన్నారు.
Photo Credit : IPL Website
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్
ఐపీఎల్ 2023లో భాగంగా వాంఖండే వేదికగా 42వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది.
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ ((కెప్టెన్)/వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
The Royals win the toss & elect to bat at Wankhede 🏟️
Catch the action of #MIvRR - LIVE & FREE on #JioCinema across all telecom operators 👈#IPL2023 #IPLonJioCinema #TATAIPL pic.twitter.com/Ul4sxUiB11
— JioCinema (@JioCinema) April 30, 2023
Comments
Please login to add a commentAdd a comment