Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాజస్తాన్‌రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా జైశ్వాల్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ క్రమంలోనే జైశ్వాల్ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ల జాబితాలో జైశ్వాల్ చోటు దక్కించుకున్నాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు మనీష్ పాండే(2009లో ఆర్‌సీబీ తరపున 19 ఏళ్ల 253 రోజులు) తొలి స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 20 ఏళ్ల 218 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్(2021లో ఆర్‌సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉన్నారు.
A special moment in IPL history:
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023
1st match - Brendon McCullum scored a century.
1000th match - Yashasvi Jaiswal scored a century. pic.twitter.com/wwaE83uRBV
చదవండి: వికెట్లు తీస్తున్నా లాభం లేదు.. ధోనికి మింగుడుపడని అంశం
Comments
Please login to add a commentAdd a comment