Photo Credit : IPL Website
ఐపీఎల్-2023లో భాగంగా వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సంచలన విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై విజయంలో ఆ జట్టు ఆటగాడు టిమ్ డేవిడ్ కీలక పాత్ర పోషించాడు.
హోల్డర్ వేసిన ఆఖరి ఓవర్‌లో ముంబై గెలుపుకు 17 పరుగులు అవసరమవ్వగా.. టిమ్ డెవిడ్ వరుసగా మూడు సిక్స్‌లు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక విజయంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. జైస్వాల్, టిమ్ డేవిడ్ అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడని రోహిత్ కొనియాడాడు.
Photo Credit : IPL Website
జైస్వాల్ ఒక యువ సంచలనం..
"ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేదించడం చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా మేము దగ్గరకు వచ్చి ఓటమిపాలైం. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మా జట్టులో పొలార్డ్ స్థానాన్ని డేవిడ్ భర్తీ చేశాడు. పొలార్డ్ చాలా సీజన్‌లపాటు మా జట్టులో ఉన్నాడు. మేము ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలవడంలో పాలీ తనవంతు పాత్రపోషించాడు. ఇప్పడు డేవిడ్ కూడా అదే పనిచేస్తాడని ఆశిస్తున్నాము.
Photo Credit : IPL Website
టిమ్‌కు చాలా బ్యాటింగ్ పవర్ ఉంది. లోయార్డర్‌లో డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాడు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అటువంటి పవర్ హిట్టర్ క్రీజులో ఉంటే ఎటువంటి బౌలరైనా ఒత్తడికి లోనవుతాడు. ఇక ప్రతీ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్ధితులు బట్టి జట్టును ఎంపికచేస్తాం. ఇక జోఫ్రా అర్చర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
అదే విధంగా అతడు చాలా కాలం పాటు బంతి పట్టుకోలేదు. కాబట్టి అతడికి ఇంకా చాలా ప్రాక్టీస్ అవసరం. అయినా ఈ మ్యాచ్‌లో మంచి పేస్‌తో బౌలింగ్ చేశాడు. సూర్య కూడా తన రిథమ్‌ను తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇక జైశ్వాల్ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. గతేడాదే అతడు అద్భుతంగా ఆడటం నేను చూశాను. కానీ ఈ ఏడాది అంతకు రెట్టింపు ఆడుతున్నాడు.
Photo Credit : IPL Website
బ్యాటింగ్‌లో అంత పవర్‌ను ఎలా జనరేట్ చేస్తున్నవాని జైస్వాల్‌ను ఇన్నింగ్స్ బ్రేక్‌లో ఆడిగా. అందుకు బదులుగా జిమ్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల సాధ్యపడుతుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అతడిని ఆపడం మాతరం కాలేదు. నిజంగా మేము భయపడ్డాం. ఇక అతడు అద్భుతఫామ్‌లో ఉండడం.. రాజస్తాన్‌తో పాటు భారత క్రికెట్‌కు కూడా చాలా మంచిది" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: #Yashasvi Jaiswal: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన జైశ్వాల్.. తొలి క్రికెటర్‌గా!
Comments
Please login to add a commentAdd a comment