అతడు అద్భుతం.. మా గురించి అలా అనుకోవద్దు: గిల్‌ కౌంటర్‌ | Dont Think Like That: Shubman Gill Reply To Harsha Bhogle On GT Left It Late | Sakshi
Sakshi News home page

అతడు అద్భుతం.. మా గురించి అస్సలు అలా అనుకోకండి: గిల్‌ వార్నింగ్‌

Published Thu, Apr 11 2024 10:28 AM | Last Updated on Thu, Apr 11 2024 11:25 AM

Dont Think Like That: Shubman Gill Reply To Harsha Bhogle On GT Left It Late - Sakshi

టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (PC: BCCI/IPL)

ఆఖరి బంతికి విజయం సాధించడం ఎల్లప్పుడూ గొప్పగానే ఉంటుందంటూ గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ హర్షం వ్యక్తం చేశాడు. రషీద్‌ భాయ్‌ వల్లే తమకు రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపు దక్కిందని వైస్‌ కెప్టెన్‌పై ప్రశంసలు కురిపించాడు.

ఐపీఎల్‌-2024లో ఆరంభం నుంచి ఓటమి ఎరుగని రాజస్తాన్‌ జైత్రయాత్రకు గుజరాత్‌ బ్రేక్‌ వేసిన విషయం తెలిసిందే. జైపూర్‌లో బుధవారం ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి టైటాన్స్‌ జయభేరి మోగించింది. మెరుపు ఇన్నింగ్స్‌(11 బంతుల్లో 24*)తో గుజరాత్‌ శిబిరంలో ఆశలు నింపిన రషీద్‌ ఖాన్‌.. అంచనాలు నిలబెట్టుకుంటూ ఆఖరి బంతికి ఫోర్‌ బాది గెలుపును ఖరారు చేశాడు.

రాహుల్‌ తెవాటియా(11 బంతుల్లో 22) సైతం విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక కష్ట సమయంలో గిల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(44 బంతుల్లో 72) ఆడటం టైటాన్స్‌కు కలిసి వచ్చింది.

ఈ నేపథ్యంలో విజయానంతరం కామెంటేటర్‌ హర్షా భోగ్లేతో ముచ్చటిస్తున్న సమయంలో శుబ్‌మన్‌ గిల్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. గెలుపు నేపథ్యంలో గిల్‌ను అభినందిస్తూ.. ‘‘బాగా ఆడారు.

మీకు రెండు పాయింట్లు వచ్చాయి. అయితే, నాలాంటి చాలా మంది మీరు ఆలస్యం చేస్తున్నారు కాబట్టి ఏమవుతుందోనని కంగారు పడ్డారు. కానీ మీరు బాగా ఆడారు’’ అని హర్షా భోగ్లే అన్నాడు.

ఇందుకు స్పందిస్తూ.. ‘‘థాంక్యూ.. మేము ఆడుతున్నపుడు ఇంకెప్పుడూ అలా అనుకోకండి’’ అంటూ తమ జట్టు గురించి గొప్పగా చెబుతూ ఒకరకంగా హార్ష భోగ్లేకు గట్టి కౌంటరే వేశాడు శుబ్‌మన్‌ గిల్‌. ఇక తమ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘అప్పటికీ.. మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఒక్కో బ్యాటర్‌ తొమ్మిది బంతుల్లో 22 పరుగులు చేయాలనుకున్నాం. నిజంగా మ్యాచ్‌ ఫినిష్‌ చేయడం ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. ఈరోజు నేను ఆపని చేయాలనుకున్నాను.

అయితే, రాహల్‌- రషీద్‌ భాయ్‌ ఆ పని పూర్తి చేశారు. ఆఖరి బంతికి విజయం సాధించడం ఎ‍ప్పుడూ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రషీద్‌ ఖాన్‌ లాంటి వాళ్లు జట్టులో ఉండాలని ప్రతి ఒక్క కెప్టెన్‌ కోరుకుంటాడనడంలో సందేహం లేదు’’ అని శుబ్‌మన్‌ గిల్‌ చెప్పుకొచ్చాడు. 

IPL 2024: రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ స్కోర్లు
►రాజస్తాన్‌: 196/3 (20)
►గుజరాత్‌: 199/7 (20)
►ఫలితం: మూడు వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ విజయం
► ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: రషీద్‌ ఖాన్‌(ఒక వికెట్‌, 24 పరుగులు- నాటౌట్‌).

చదవండి: IPL 2024: మాట్లాడలేకపోతున్నా.. అతడి వల్లే ఓటమి.. ఆ ఒక్క బంతి..!
#ShubmanGill: కొరకరాని కొయ్యలా సంజూ.. అంపైర్‌తో గొడవపడ్డ గిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement