PC: IPL/BCCI
IPL 2023 SRH Vs MI- Brian Lara Comments: తమ జట్టు మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాల్సి ఉందని.. ఇందుకోసం కసరత్తులు చేస్తున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియన్ లారా అన్నాడు. ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చగల ఫినిషర్ల అవసరం ఉందని పేర్కొన్నాడు. తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు సన్‌రైజర్స్‌లో కూడా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
ఐపీఎల్-2023లో భాగంగా ఉప్పల్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్.. ముంబై ఇండియన్స్‌తో తలపడింది. సొంతమైదానంలో టాస్ గెలిచిన రైజర్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.
అలా కథ ముగిసింది
టార్గెట్ చేధించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేసి అవుటైంది. దీంతో 14 పరుగుల తేడాతో రోహిత్ సేన చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో రైజర్స్ గెలుపొందాలంటే 20 పరుగులు అవసరమైన వేళ.. రోహిత్ శర్మ..అర్జున్ టెండుల్కర్ చేతికి బంతినిచ్చాడు.
అప్పటికి భువనేశ్వర్ కుమార్‌తో పాటు క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్.. చివరి ఓవర్ రెండో బంతికి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో మయాంక్ మార్కండే క్రీజులోకి రాగా.. రెండు పరుగులు వచ్చాయి. ఆ తర్వాత బై రూపంలో ఒక పరుగు రాగా.. మరుసటి బంతికి అర్జున్.. భువీని పెవిలియన్‌కు పంపడంతో సన్‌రైజర్స్ కథ ముగిసింది.
వాళ్లలాంటి ఆటగాళ్లు కావాలి
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం రైజర్స్ కోచ్ లారా మాట్లాడుతూ.. ‘‘మేము ఆ విషయం(మిడిలార్డర్)లో ఇంకా కసరత్తులు చేస్తున్నాం. మ్యాచ్ చివరి వరకు ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించే ఆత్మవిశ్వాసం ఆటగాళ్లలో ఉండాలి. తెవాటియా, మిల్లర్ లాంటి ప్లేయర్ల అవసరం మాకు ఉంది.
ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను ఎలా ఫినిష్ చేయాలో వాళ్లకు తెలుసు. అలాంటి వాళ్లను తయారు చేసుకోగలగాలి. మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈరోజైతే మేము అత్యుత్తమ జట్టు చేతిలోనే ఓడిపోయాం అని కచ్చితంగా చెప్పగలను’’ అని పేర్కొన్నాడు.
కాగా 2022లో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ ఫినిషర్లుగా అద్భుత పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజా ఓటమితో సన్‌రైజర్స్ పరాజయాల సంఖ్య మూడుకు చేరగా 4 పాయింట్లతో పట్టికలో తొమ్మిదోస్థానానికి పడిపోయింది.
చదవండి: నేను మూడేళ్లు ఇక్కడే ఆడాను.. అతడొక అద్భుతం! ఏ బౌలర్ కైనా చుక్కలే: రోహిత్
SRH Vs MI: టెస్టు ప్లేయర్‌తో ఇట్లనే ఉంటది మరి! ‘టాప్ స్కోరర్’ అయితే ఏంటి?
Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally.
— IndianPremierLeague (@IPL) April 18, 2023
Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS
Comments
Please login to add a commentAdd a comment