PC: IPL Twitter
సన్‌రైజర్స్ ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2023 భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఒకవేళ గెలిచినా నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. ఎందుకంటే.. గుజరాత్‌తో ఇవాళ రాత్రి జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిస్తే, మెరుగైన రన్‌రేట్ కారణంగా ఆ జట్టే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ గుజరాత్‌పై ఆర్సీబీ గెలిచినా ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే.. సన్‌రైజర్స్‌పై సాదాసీదాగా గెలిస్తే సరిపోదు. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 11.4 ఓవర్లలో ఛేదించాల్సి ఉంటుంది. ఇది అంత ఆషామాషీ విషయం కాదు కాబట్టి, గుజరాత్- ఆర్సీబీ మ్యాచే ప్లే ఆఫ్స్ నాలుగో బెర్తును డిసైడ్ చేస్తుంది. మరోవైపు గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాచ్ సమయానికి ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని యాక్యూ వెదర్ చూపిస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది (సన్‌రైజర్స్‌పై ముంబై గెలిచి). మ్యాచ్ రద్దైతే ఆర్సీబీ, గుజరాత్‌లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్సీబీ ఖాతాలో 15 పాయింట్లు ఉంటాయి. సన్‌రైజర్స్‌పై ముంబై గెలిస్తే.. ఆ జట్టు 16 పాయింట్లతో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. గుజరాత్ (18),సీఎస్‌కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాలుగో ప్లేస్ కోసం ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.
ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ భారీ స్కోర్ సాధించింది. వివ్రాంత్ శర్మ (69), మయాంక్ అగర్వాల్ (83) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. క్లాసెన్ (18), ఫిలిప్స్ (1), బ్రూక్ (0) విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. 7 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 73/1గా ఉంది. ఇషాన్ కిషన్ విఫలం కాగా.. కెమారూన్ గ్రీన్ (15 బంతుల్లో 42) ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. రోహిత్ (16 బంతుల్లో 16) పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు.
చదవండి: MI VS SRH: ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..!
Comments
Please login to add a commentAdd a comment