PC: IPL Twitter
ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ ఓపెనర్ వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు,2 సిక్సర్లు) అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ ఆటగాడు స్వప్నిల్ అస్నోద్కర్ (60) పేరిట ఉండేది. ఈ రికార్డుతో పాటు వివ్రాంత్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున హాఫ్ సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల 2023 రోజులు) రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు ప్రియం గార్గ్ (19 ఏళ్ల 307 రోజులు) పేరిట ఉంది.
ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ (44 బంతుల్లో 82) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 16 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 168/1గా ఉంది. మయాంక్ శతకం దిశగా సాగుతుంటే, క్లాసెన్ తనదైన స్టయిల్‌లో విరుచుకుపడుతున్నాడు.
చదవండి: Ben Stokes: టైం అయ్యింది.. డబ్బులు ముట్టాయి, వెళ్లొస్తా..!
Comments
Please login to add a commentAdd a comment