Vivrant Sharma
-
SRH VS MI: రికార్డులు కొల్లగొట్టిన సన్‌రైజర్స్ యువ ఓపెనర్
ఐపీఎల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ యువ ఓపెనర్ వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు,2 సిక్సర్లు) అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు మాజీ రాజస్థాన్ ఆటగాడు స్వప్నిల్ అస్నోద్కర్ (60) పేరిట ఉండేది. ఈ రికార్డుతో పాటు వివ్రాంత్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున హాఫ్ సెంచరీ చేసిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా (23 ఏళ్ల 2023 రోజులు) రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు ప్రియం గార్గ్ (19 ఏళ్ల 307 రోజులు) పేరిట ఉంది. ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు వివ్రాంత్ శర్మ, మయాంక్ అగర్వాల్ (44 బంతుల్లో 82) విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోవడంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. 16 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 168/1గా ఉంది. మయాంక్ శతకం దిశగా సాగుతుంటే, క్లాసెన్ తనదైన స్టయిల్లో విరుచుకుపడుతున్నాడు. చదవండి: Ben Stokes: టైం అయ్యింది.. డబ్బులు ముట్టాయి, వెళ్లొస్తా..! -
అన్న త్యాగంతో కోటీశ్వరుడయ్యాడు! వాళ్లిద్దరితో కలిసి ఆడతానంటూ
IPL 2023 Auction- Vivrant Sharma- Sunrisers Hyderabad: ‘‘మా నాన్నను చాలా మిస్ అవుతున్నా. ఆయన ఎక్కడున్నా ఇప్పుడు నా సక్సెస్ చూసి సంతోషిస్తూ ఉంటారు. నిజానికి ఇదంతా మా అన్నయ్య త్యాగం వల్లే సాధ్యమైంది. తనే లేకుంటే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. నాన్న చనిపోయిన తర్వాత నేను క్రికెట్ కొనసాగించగలనా లేదోననే సందేహాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో నా సోదరుడు విక్రాంత్ కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకున్నాడు. మాకున్న వ్యాపారం ఇప్పుడు తనే చూసుకుంటున్నాడు. నిజానికి తను కూడా క్రికెటర్‌గా ఎదగాలని కలలు కన్నాడు. కానీ కుటుంబం కోసం, నా కోసం త్యాగం చేశాడు. తన కలను ఇలా నా రూపంలో నెరవేర్చుకుంటున్నాడు’’ అని జమ్మూ కశ్మీర్ బ్యాటర్ వివ్రాంత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. కోటీశ్వరుడయ్యాడు ఐపీఎల్ మినీ వేలం-2023లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పోటీ పడి మరీ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 20 లక్షల కనీస ధరతో ఆక్షన్‌లోకి వచ్చిన అతడి కోసం ఏకంగా 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో వివ్రాంత్ పంట పండినట్లయింది. కాగా వివ్రాంత్ తండ్రి సుశాంత్ కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూయగా.. ఇంటికి పెద్ద కుమారుడైన 26 ఏళ్ల విక్రాంత్ కుటుంబ బాధ్యతలు చేపట్టాడు. తమ్ముడిని క్రికెట్ కొనసాగించేలా ప్రోత్సహించాడు. కాగా విక్రాంత్ కూడా యూనివర్సిటీ లెవల్ పేసర్ కావడం విశేషం. ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ తన కోసం ఇంత మొత్తం ఖర్చు చేస్తుందని ఊహించలేదన్న వివ్రాంత్.. తనతో పాటు తన కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగిపోయారంటూ పీటీఐతో వ్యాఖ్యానించాడు. ఆయన ప్రోత్సహించారు అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘‘రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో ఆయనతో నేను మాట్లాడాను. నాలో ఉన్న ప్రతిభను గుర్తించి నన్ను ప్రోత్సహించారు. విలువైన సలహాలు ఇచ్చారు’’ అని వివ్రాంత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే సన్‌రైజర్స్‌కు ఆడుతున్న కశ్మీర్ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్‌తో తనకు స్నేహం ఉందన్న వివ్రాంత్.. అవకాశం వస్తే వాళ్లతో కలిసి ఐపీఎల్‌నూ కనిపిస్తానంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో 124 బంతుల్లో 154 పరుగులు చేసిన వివ్రాంత్ ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. చదవండి: Ind Vs Ban: ఆ క్యాచ్ పడితే నీ ఆట ముగిసేది.. భారత్ 89కే ఆలౌట్ అయ్యేది! దిమ్మతిరిగేలా అశ్విన్ కౌంటర్ IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ