PC: IPL Twitter
గత రెండు సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ, అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న మయాంక్ అగర్వాల్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్‌లో మనోడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవలి కాలంలో మయాంక్ ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇదే తొలిసారి. మయాంక్‌కు జతగా మరో ఓపెనర్ వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..!
గతేడాది పంజాబ్ కెప్టెన్‌గా వ్యవహరించి ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ పంచన చేరిన మయాంక్‌కు ముంబై ఇండియన్స్ అంటే పూనకం వస్తుంది. ఈ సీజన్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన అతను 9 మ్యాచ్‌ల్లో 187 పరుగులు చేస్తే.. ముంబైతో ఇవాళ్టి మ్యాచ్‌లో 83 పరుగులు చేశాడు. 17 పరుగుల తేడాతో ఐపీఎల్‌లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న మయాంక్.. 2022 సీజన్ నుంచి ముంబైపై విరుచుకుపడుతున్నాడు.
ఈ మధ్యలో ముంబైతో 3 మ్యాచ్‌లు ఆడిన అతను 153.78 స్ట్రయిక్ రేట్‌తో 61 సగటున 183 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే సమయంలో (గత రెండు ఐపీఎల్ సీజన్లు) ఇతర జట్లతో 19 మ్యాచ్‌లు ఆడిన మయాంక్.. 112.75 స్ట్రయిక్ రేట్‌తో కేవలం 14.89 సగటున 283 పరుగులు చేశాడు. ఇందులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ గణాంకాలు చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. ముంబై అంటే మయాంక్ ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో.
ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్‌రైజర్స్.. నామమాత్రపు మ్యాచ్‌లో ఇవాళ ముంబైతో తలపడుతుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్ అడుతున్న ముంబైకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు ఉంటాయి. గుజరాత్ (18),సీఎస్‌కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా.. నాలుగో ప్లేస్ కోసం ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.
చదవండి: SRH VS MI: రికార్డులు కొల్లగొట్టిన సన్‌రైజర్స్ యువ ఓపెనర్
Comments
Please login to add a commentAdd a comment