సహచరులు, ముంబై ప్లేయర్లతో మయాంక్ (Photo Credit: SRH Twitter/IPL)
IPL 2023 SRH Vs MI: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై అభిమానులు మండిపడుతున్నారు. టెస్టు ప్లేయర్‌ని టీ20లలో ఆడిస్తే ఇలాగే ఉంటుందంటూ సెటైర్లు వేస్తున్నారు. మయాంక్ కారణంగా పవర్ ప్లేలో పవరే లేకుండా పోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్.. 12 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 196 పరుగులు చేశాడు. సారథిగానూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గతేడాది పద్నాలుగింట కేవలం ఏడు విజయాలు మాత్రమే సాధించిగా పంజాబ్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది.
తనదైన ముద్ర వేయలేక
ఈ క్రమంలో ఐపీఎల్-2023 వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ మయాంక్‌ను వదిలేయగా.. సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ కోసం 8.25 కోట్ల రూపాయల మేర భారీ మొత్తం వెచ్చించింది. అయితే, ఇప్పటి వరకు ఆడిన 5 మ్యాచ్‌లలో మయాంక్ తనదైన మార్కు చూపించేలా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. 5 ఇన్నింగ్స్‌లలో కలిపి ఈ ఓపెనర్ చేసిన పరుగులు 113.
అందుకే విమర్శలు
ఇక ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మయాంక్ 48 పరుగులతో రైజర్స్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయినప్పటికీ అభిమానుల ఆగ్రహానికి కారణం అతడి స్ట్రైక్‌రేటు(117.07). అర్ధ శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయిన మయాంక్.. ఇందుకోసం ఏకంగా 41 బంతులు తీసుకున్నాడు.
వరుస విజయాలకు బ్రేక్
ఈ నేపథ్యంలో కొంతమంది అతడిని విమర్శిస్తుండగా.. మరికొంత మందేమో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడని.. తను కూడా తొందరగా అవుటైతే పరిస్థితి ఇంకోలా ఉండేదని మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా తడబడింది.
మయాంక్ 48 పరుగులకు తోడు కెప్టెన్ ఎయిడెన్ మార్కరమ్(17 బంతుల్లో 22 పరుగులు), వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్(16 బంతుల్లో 36 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో రైజర్స్ విజయానికి 20 పరుగులు అవసరమైన వేళ అర్జున్ టెండుల్కర్ అద్భుత బౌలింగ్ కారణంగా ముంబై 14 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో వరుసగా రెండు విజయాలు సాధించిన మార్కరమ్ బృందం జోరుకు బ్రేక్ పడినట్లయింది.
చదవండి: సచిన్ కొడుకుతో అట్లుటంది మరి.. శెభాష్ అర్జున్! వీడియో వైరల్
అదే మా కొంపముంచింది.. లేదంటేనా! అందుకే అలా చేశా: మార్కరమ్
Three wins in a row for the @mipaltan as they beat #SRH by 14 runs to add two key points to their tally.
— IndianPremierLeague (@IPL) April 18, 2023
Scorecard - https://t.co/oWfswiuqls #TATAIPL #SRHvMI #IPL2023 pic.twitter.com/asznvdy1BS
Comments
Please login to add a commentAdd a comment