IPL 2022: Rashid Khan Name His Trademark Shot as Snake Shot Why - Sakshi
Sakshi News home page

Rashid Khan: నాలుగు సిక్సర్లు.. అది స్నేక్‌షాట్‌.. ఇలా ఎందుకు అన్నానంటే!

Published Thu, Apr 28 2022 1:12 PM | Last Updated on Thu, Apr 28 2022 5:44 PM

IPL 2022: Rashid Khan Name His Trademark Shot As Snake Shot Why - Sakshi

రషీద్‌ ఖాన్‌, హార్దిక్‌ పాండ్యా(PC: IPL/BCCI)

రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ మరీ అంత గొప్పగా ఏమీ ఉండదు’.. రషీద్‌ గతంలో ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ బ్రియాన్‌ లారా చేసిన వ్యాఖ్య ఇది. ఆ మాటలను నిజం చేస్తూ బుధవారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ రషీద్‌ పేలవ ప్రదర్శన కనబరిచాడు.

నాలుగు ఓవర్ల పూర్తి బౌలింగ్‌ చేసిన అతడు ఏకంగా 45 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. గతంలో వికెట్‌ తీయని సందర్భంలో 35 పరుగులకు మించి ఇవ్వని ఈ ఆఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్నాడు.

అయితే, ఎస్‌ఆర్‌హెచ్‌లో మ్యాచ్‌తో బౌలర్‌గా విఫలమైనా.. బ్యాటర్‌గా ఆకాశమే హద్దుగా చెలరేగాడు రషీద్‌. గుజరాత్‌ ఓడిపోతుందనకున్న తరుణంలో రాహుల్‌ తెవాటియాతో కలిసి అద్భుత ఆట తీరుతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరి వరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో 11 బంతులు ఎదుర్కొన్న రషీద్‌.. 31 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును టాప్‌-1లో నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు.

కాగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ బౌలింగ్‌లో ఒక సిక్సర్‌, మార్కో జాన్సెన్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు రషీద్‌. ఈ విషయం గురించి మ్యాచ్‌ అనంతరం తమ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, రాహుల్‌ తెవాటియాతో జరిగిన చిట్‌చాట్‌లో అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భువీ బౌలింగ్‌లో కొట్టిన షాట్‌కు స్నేక్‌ షాట్‌గా రషీద్‌ నామకరణం చేశాడు. ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. ‘‘దీనిని నేను స్నేక్‌ షాట్‌ అని చెబుతాను. పాము ఒకరిని కాటేసిన తర్వాత వెంటనే వెనక్కి జరుగుతుంది కదా! అలాగే బాల్‌ దూసుకువచ్చిన సమయంలో నా బాడీ పొజిషన్‌ సరిగా లేనట్లయితే షాట్‌ బాదలేను. ఆ బంతిని అంచనా వేసిన తర్వాత రిస్ట్‌ పవర్‌ ఉపయోగిస్తేనే దానిని బాదగలనని అర్థమైంది’’ అని చెప్పుకొచ్చాడు.

కాగా 18వ ఓవర్‌ నాలుగో బంతిని యార్కర్‌గా సంధించాలనుకున్న భువీ ప్రయత్నం విఫలం కాగా.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రషీద్‌ బ్యాట్‌తో బంతిని బలంగా బాది ఆరు పరుగులు పిండుకున్నాడు. ఈ షాట్‌ కాస్త ధోని హెలికాప్టర్‌ షాట్‌ను పోలి ఉన్నా బ్యాటర్‌ తల చుట్టూ కాకుండా బ్యాట్‌ యథాస్థానంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే రషీద్‌ దానిని స్నేక్‌ షాట్‌ అని పేర్కొనడం విశేషం. 

చదవండి👉🏾 Umran Malik: అతడిని వీలైనంత త్వరగా టీమిండియాకు సెలక్ట్‌ చేసి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement