Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున రాహుల్ తెవాటియా సూపర్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆఖర్లో బ్యాటింగ్ వచ్చి సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తూ సిక్సర్ల తెవాటియాగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సిక్సర్ల తెవాటియా ఇషాంత్ అనుభవం ముందు తలవంచాల్సి వచ్చింది.
అభినవ్ మనోహర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన తెవాటియా ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో నోర్ట్జేకు చుక్కలు చూపించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాది ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి మ్యాచ్‌ను దాదాపు లాగేసుకున్నంత పని చేశాడు. ఇక చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 12 పరుగులు అవసరమైన దశలో ఇషాంత్ శర్మ అద్బుతంగా బౌలింగ్ వేశాడు. ఒత్తిడిలో సూపర్‌గా బౌలింగ్ చేసిన ఇషాంత్ ఇన్నేళ్ల అనుభవాన్ని చూపించాడు.
Photo: IPL Twitter
తొలి బంతికి హార్దిక్ పాండ్యా రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ తీయడంతో తెవాటియా మరోసారి స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఇక మ్యాచ్ గుజరాత్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఇషాంత్ బౌలింగ్‌లో తన అనుభవాన్ని చూపించాడు. మూడో బంతిని తెలివిగా ఆన్‌ది లైన్ వేయడంతో డాల్‌బాల్ వచ్చింది. ఇక నాలుగో బంతిని తెవాటియా ఎక్స్‌ట్రా కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడాలనుకున్నాడు.
కానీ ఇషాంత్ అనుభవం ముందు సిక్సర్ల తెవాటియా పనికి రాలేదు. బౌన్స్ అయిన బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి గాల్లోకి లేచింది. రిలీ రొసౌ పొరపాటు చేయకుండా క్యాచ్ తీసుకోవడంతో తెవాటియా వెనుదిరిగాడు. ఈ సమయంలో పాండ్యాఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఆసక్తి కలిగించింది. ఆ తర్వాత రెండు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన దశలో మూడు పరుగులే తీయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.
Ishant Sharma the champion - Delhi Capitals defended 130 at GT's home ground.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 2, 2023
What a bowling effort! pic.twitter.com/rWsTdbzoIE
చదవండి: ఏడో నెంబర్‌లో వచ్చి అదరగొట్టాడు.. ఎవరీ అమన్ హకీమ్ ఖాన్?
Comments
Please login to add a commentAdd a comment