![IPL 2023: Rahul Tewatia Super-Catch Stunned Rilee Rossouw Video Viral - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/4/Tewatia.jpg.webp?itok=VRDDjAte)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఆటగాడు రాహుల్ తెవాటియా స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ వేసిన బౌన్సర్‌ను ఆడే ప్రయత్నంలో భుజం ఎత్తులో బ్యాట్‌కు తగిలి బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా వెళ్లింది. 24 మీటర్ల దూరంలో ఉన్న తెవాటియా కొంచెం ముందుకు పరిగెత్తి డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు.
అయితే బంతి కింద పడిందేమోనన్న అనుమానంతో రివ్యూకు వెళ్లిన రొసౌకు నిరాశే మిగిలింది. రిప్లేలో తెవాటియా క్యాచ్‌లో ఎలాంటి పొరపాటు లేదని తేలింది. దీంతో రొసౌకు మైండ్‌బ్లాక్ అయింది. అంతేకాదు ఆడిన తొలి బంతికే ఔటైన రొసౌ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
0:07 - Stunning Catch by Rahul Tewatia🙌#DCvGT #IPL2023 pic.twitter.com/c94fIN3D03
— 12th Khiladi (@12th_khiladi) April 4, 2023
Comments
Please login to add a commentAdd a comment