
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు హార్ధిక్ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా ఈ సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఉమ్రాన్ మాలిక్, ఆర్షదీప్ సింగ్,రాహుల్ త్రిపాఠి వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు.
కాగా ఐర్లాండ్ సిరీస్‌కు ఐపీఎల్‌లో అదరగొట్టిన రాహుల్ తెవాటియాకు చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే సెలెక్టర్లు అతడికి మరో సారి మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో జరిగే సిరీస్‌కు రాహుల్ తెవాటియాను జట్టులోకి తీసుకుని ఉండాల్సిందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
"రాహుల్ తెవాటియా అద్భుతమైన ఆటగాడు. ఐపీఎల్‌లో మనం చాలా సార్లు చూశాం. ఓడిపోవాల్సిన మ్యాచ్‌లను ఒంటి చేత్తో తెవాటియా గెలిపించాడు. అతడికి మైదానంలో అన్నివైపులా షాట్‌లు ఆడగలిగే సత్తా ఉంది. కాబట్టి అతడిని 18వ ఆటగాడిగా ఐర్లాండ్ పర్యటనకు తీసుకోవాల్సింది" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IRE vs IND: టీమిండియాలో నో ఛాన్స్.. రాహుల్ తెవాటియా ట్వీట్ వైరల్..!