ముంబై: పంజాబ్‌పై విజయం కోసం గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్లో 19 పరుగులు చేయాలి. తొలి 4 బంతుల్లో 7 పరుగులు వచ్చాయి. సమీకరణం 2 బంతుల్లో 2 సిక్సర్లకు మారింది! తీవ్ర ఒత్తిడి మధ్య ఇలాంటి స్థితిలో రెండు వరుస సిక్సర్లు బాదడం పేరొందిన బ్యాటర్లకు కూడా అంత సులువు కాదు. అయితే రాహుల్ తెవాటియా దానిని చేసి చూపించాడు.
రెండేళ్ల క్రితం ఇదే పంజాబ్‌పై రాజస్తాన్ తరఫున ఒకే ఓవర్లో ఐదు సిక్స్‌లు బాదిన మ్యాచ్‌ను గుర్తుకు తెస్తూ ఈసారి చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలచి గుజరాత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో శుక్రవారం జరిగిన పోరులో టైటాన్స్ 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లివింగ్‌స్టోన్ (27 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (59 బంతుల్లో 96; 11 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు.
రషీద్‌కు 3 వికెట్లు...
మయాంక్ అగర్వాల్ (5), బెయిర్‌స్టో (8) తక్కువ స్కోరుకే అవుటైనా లివింగ్‌స్టోన్ మెరుపులతో పంజాబ్ జట్టు ఇన్నింగ్స్‌కు ఊపు వచ్చింది. రషీద్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన అతను... నల్కండే ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో చెలరేగాడు. తెవాటియా ఓవర్లో పంజాబ్ 24 పరుగులు రాబట్టింది.
ఈ ఓవర్లో జితేశ్ శర్మ (11 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రెండు భారీ సిక్సర్లు బాదగా, లివింగ్‌స్టోన్ 4, 6 కొట్టాడు. ఆ తర్వాత వరుస బంతుల్లో జితేశ్, ఒడెన్ స్మిత్ (0)లను నల్కండే పెవిలియన్ పంపించగా, షమీ ఓవర్లో షారుఖ్ (15) కొట్టిన రెండు వరుస సిక్సర్లు హైలైట్‌గా నిలిచాయి. అయితే కనీసం 200 స్కోరు ఖాయమనుకుంటున్న దశలో పంజాబ్ 9 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయింది.
సెంచరీ మిస్...
వేడ్ (6) ఆరంభంలోనే అవుటైనా, గిల్ మెరుపు వేగంతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. పవర్‌ప్లేలో గుజరాత్ స్కోరు 53 పరుగులకు చేరింది. మరోవైపు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సుదర్శన్ కూడా కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 68 బంతుల్లోనే 101 పరుగులు జోడించారు.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 27; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ చేజార్చుకోగా... చివర్లో పాండ్యా కూడా రనౌట్ కావడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్‌లు) టైటాన్స్‌ను గెలుపు తీరం చేర్చాడు.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: మయాంక్ (సి) రషీద్ (బి) హార్దిక్ 5; శిఖర్ ధావన్ (సి) వేడ్ (బి) రషీద్ 35; బెయిర్‌స్టో (సి) తెవాటియా (బి) ఫెర్గూసన్ 8; లివింగ్‌స్టోన్ (సి) మిల్లర్ (బి) రషీద్ 64; జితేశ్ (సి) గిల్ (బి) నల్కండే 23; స్మిత్ (సి) గిల్ (బి) నల్కండే 0; షారుఖ్ (ఎల్బీ) (బి) రషీద్ 15; రబడ (రనౌట్) 1; రాహుల్ చహర్ (నాటౌట్) 22; వైభవ్ (బి) షమీ 2; అర్ష్‌దీప్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 189.
వికెట్ల పతనం: 1–11, 2–34, 3–86, 4–124, 5–124, 6–153, 7–154, 8–156, 9–162.
బౌలింగ్: షమీ 4–0–36–1, హార్దిక్ 4–0–36–1, ఫెర్గూసన్ 4–0–33–1, రషీద్ 4–0–22–3, దర్శన్ నల్కండే 3–0–37–2, తెవాటియా 1–0–24–0.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: వేడ్ (సి) బెయిర్‌స్టో (బి) రబడ 6; గిల్ (సి) మయాంక్ (బి) రబడ 96; సుదర్శన్ (సి) మయాంక్ (బి) చహర్ 35; హార్దిక్ (రనౌట్) 27; మిల్లర్ (నాటౌట్) 6; తెవాటియా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 190.
వికెట్ల పతనం: 1–32, 2–133, 3–170, 4–172.
బౌలింగ్: వైభవ్ 4–0– 34–0, అర్ష్‌దీప్ 4–0–31–0, రబడ 4–0–35–2, రాహుల్ చహర్ 4–0–41–1, ఒడెన్ స్మిత్ 3–0–35–0, లివింగ్‌స్టోన్ 1–0–12–0.
ఐపీఎల్‌లో నేడు
హైదరాబాద్ X చెన్నై సూపర్ కింగ్స్
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి
బెంగళూరు X ముంబై ఇండియన్స్
వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం
𝗪𝗛𝗔𝗧. 𝗔. 𝗙𝗜𝗡𝗜𝗦𝗛! 👌 👌@rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! 👏 👏 #PBKSvGT
— IndianPremierLeague (@IPL) April 8, 2022
Scorecard ▶️ https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41
Comments
Please login to add a commentAdd a comment